ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా | Donthiri Sridhar Reddy Canvass In Thurkapalli | Sakshi
Sakshi News home page

ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Nov 29 2018 2:34 PM | Updated on Nov 29 2018 2:36 PM

Donthiri Sridhar Reddy Canvass In Thurkapalli - Sakshi

మాట్లాడుతున్న దొంతిరి శ్రీధర్‌రెడ్డి

సాక్షి,తుర్కపల్లి : ప్రజలు ఆశీర్వదిస్తే ఆలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ ఆభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలంలోని రుస్తాపూర్, రాంపూర్, మోతీరాంతండా, పల్లెపహాడ్, తుర్కపల్లి, మల్కాపూర్, చిన్నలక్ష్మపూర్, మాధాపూర్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని, రైతులకు సాగునీరు అందించి వారి ఆదాయం నాలుగు రెట్లు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసే విధంగా మేకిన్‌ ఆలేరుగా తీర్చిదిద్దుతానని, ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాట పెంటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు శత్రునా యక్, మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ, ఆకుల రమేశ్, నరేందర్‌నాయక్, కొక్కొండ రాజుగౌడ్, బోళ్ల నర్సింహులు, ఆకుల సైదులుతు, సందీప్‌చారి, గుండెబోయిన మల్లేశం పాల్గొన్నారు.  

మరిన్ని వార్తాలు...

1
1/1

గిరిజన మహిళ ను ఓటు అడుగుతున్న శ్రీధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement