చెట్టంత ఎదిగిన కొడుకులు చేజారిపోయూరు. డాక్టర్లరుు పేరు తెస్తారనుకున్న బిడ్డలు తీరని శోకాన్ని మిగిల్చారు. అసలే కుర్రకారు.. ఆపై కొత్త కారు..
చెట్టంత ఎదిగిన కొడుకులు చేజారిపోయూరు. డాక్టర్లరుు పేరు తెస్తారనుకున్న బిడ్డలు తీరని శోకాన్ని మిగిల్చారు. అసలే కుర్రకారు.. ఆపై కొత్త కారు.. పరీక్షలు ముగిసిన సంతోషంలో మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కరీంనగర్-చొప్పదండి రహదారిపై కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి శివారులో ఉన్న మూలమలుపు వద్ద కారు, బస్సును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మెడికోలు దుర్మరణం చెందారు.
మృతుల్లో పెగడపల్లి మండలం దీకొండ గ్రామానికి చెందిన గొర్రె నాని(21), హైదారాబాద్ బోడుప్పల్‌కు చెందిన రాచూరి రాహుల్(22), వరంగల్ జిల్లా పరకాల సారంగవీధికి చెందిన ఫిరంగి నవకాంత్(22), మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మారుతీనగర్‌కు చెందిన కేతావత్ మహేష్‌నాయక్(22) ఉన్నారు. వీరంతా నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.-కరీంనగర్ క్రైం
కరీంనగర్ క్రైం: ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సం వత్సరం చదువుతున్న రాచూరి రాహుల్, ఫిరంగి నవకాంత్, కేతావత్ మహేష్‌నాయక్, గొర్రె నానీ(21) కరీంనగర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కాలేజీలో కొద్ది రోజులు గా జరుగుతున్న ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం ముగిసి న తర్వాత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయం లో పై నలుగురు కలిసి నవకాంత్ కొత్తగా కొనుగోలు చేసిన హోండా ఐ20 కారులో కరీంనగర్ బయలుదేరారు. అదే సమయంలో కరీంనగర్-2 డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు ప్రయాణికులతో మంచిర్యాలకు వెళ్తోంది.
కరీంనగర్ మండ లం తీగలగుట్టపల్లి గ్రామం దాటిన తర్వాత ఉన్న మూలమలుపు వద్ద రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన కారు బస్సు ఢీకొట్టింది. కారు దాదాపు 90 శాతం బస్సు కిందకు దూసుకుపోయింది. కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో బస్సును పక్కకు జరిపి కారును, అందులో చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహలను విద్యార్థులు, మిత్రులు కలిసి ప్రతిమ మెడికల్ కాలేజీకి తరలించారు. బుధవారం రాత్రంతా ఆస్పత్రిలోనే భద్రపరిచారు. నేడు పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కరీంనగర్ రూరల్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
మిన్నంటిన రోదనలు
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు వేర్వేరు జిల్లాలో ఉండడంతో కాలేజీ నిర్వాహకులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు రాత్రి వరకు ఆస్పత్రికి చేరుకున్నారు. నవకాంత్, నానీ కుటుంబసభ్యులు రాత్రి 8గంటల వరకు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. ప్రమాద విషయం తెలుసుకున్న బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వెంటనే ప్రతిమ ఆసుపత్రికి చేరుకుని మృతుల నివాళులు అర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇంట్లో అందరూ వైద్యులే...
నవకాంత్ ఇంట్లో అందరు వైద్యులే. వరంగల్ జిల్లా పరకాలలోని సారంగవీధికి చెందిన డాక్టర్ ఫిరంగి సంతోష్ స్థానికంగా సంతోష్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. నవకాంత్ తల్లి కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వైద్యవిద్యను అభ్యసించి వైద్యుడిగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడైన నవకాంత్‌ను కూడా డాక్టర్ చేయూలని కలలు కన్నారు.
నవకాంత్ 10వ తరగతి పరకాలలో, ఇంటర్ వరంగల్‌లోని ఎస్‌ఆర్ కాలేజీలో పూర్తి చేశాడు. ఇతడు ప్రతిమ కాలేజీలోని హాస్టల్‌లోనే ఉంటున్నాడు. 2015 కొత్త సంవత్సరం సందర్భంగా నవకాంత్‌కు తండ్రి సంతోష్ కారును కొనిచ్చాడు. బుధవారం తన మిత్రులైన మహేష్‌నాయక్, రాచూరి రాహుల్‌తో కలిసి కరీంనగర్ బయల్దేరాడు. దారిలో గొర్రె నాని కనిపించడంతో అతడిని కూడా తమ వెంట తీసుకెళ్లారు. వీరు ప్రయాణిస్తున్నా కారు ప్రమాదానికి గురికావడంతో మిత్రులందరూ మృతి చెందారు.
చదువులో మేటి నాని..
దీకొండకు చెందిన గొర్రె ప్రశాంత్-భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో నాని పెద్ద కుమారుడు కాగా, చిన్న కుమారుడు స్టీఫెన్ భువనేశ్వర్‌లో ఐఐటీ చేస్తున్నాడు. ప్రశాంత్ స్థానికంగా కారోబార్‌గా పనిచేస్తుండగా, తల్లి భాగ్యలక్ష్మి ప్రతిమ ఆస్పత్రిలో ఏన్‌ఎంగా పనిచేస్తోంది. నాని చిన్నతనం నుంచి చదువులో మేటిగా రాణిస్తున్నాడు.
చొప్పదండి నవోదయలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి మెడిసిన్‌లో ఉచిత సీటు పొందాడు. అప్పటినుంచి తీగలగుట్టపల్లిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రోజు బస్సులో కాలేజీకి వెళ్తుంటాడు. బుధవారం కూడా కాలేజీకి వెళ్లిన నాని పరీక్షలు అయిపోయిన తర్వాత గదికి రావడానికి బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. అదే సమయంలో కరీంనగర్ బయలుదేరిన మిత్రులు కోరడంతో కారులో వెళ్లి మృత్యువాతపడ్డాడు.