జర్నలిస్టులకు కరోనా: కలత చెందిన కవిత | Coronavirus Positive To Journalist very unfortunate Says Kavitha | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి: కవిత

Apr 21 2020 11:49 AM | Updated on Apr 21 2020 1:11 PM

Coronavirus Positive To Journalist very unfortunate Says Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముంబైలో జర్నలిస్టులకు కరోనా వైరస్‌ పాజిటివ్ రావడంపై నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. జర్నలిస్ట్‌లకు కరోనా సోకడం దురదృష్టకరమని, విషయం తెలిసి ఎంతో కలత చెందానని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా  ఓ పోస్ట్‌ చేశారు. ‘ముంబైలో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. కరోనాపై పోరాటంలో జర్నలిస్టు మిత్రులు ముందుండి పోరాడుతున్నారు. ప్రజల వద్దకు వార్తలను చేరవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని ట్వీట్‌ చేశారు.

కాగా ముంబైలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకిన విషయం తెలిసిందే. సోమవారం బీఎంసీ (బృహన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్ట‌ర్లు, కెమెరామ‌న్‌లు క‌లుపుకుని మొత్తంగా 167 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వీరిలో సుమారు 53 మందికి సోకిన‌ట్లు తేలింది. మరోవైపు తమిళనాడులోనూ ముగ్గురు విలేఖరులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement