తెలంగాణలో 45కు చేరిన కరోనా కేసులు | CoronaVirus: One More Positive Case Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 45కు చేరిన కరోనా కేసులు

Mar 26 2020 9:56 PM | Updated on Mar 26 2020 10:34 PM

CoronaVirus: One More Positive Case Registered In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కరోనా కేసు నమోదయింది. సికింద్రాబాద్‌ బౌద్ద నగర్‌లోని 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. బౌద్ద నగర్‌లోని ఆ వ్యక్తికి సంబంధించిన వారితో పాటు అతను ఎవరెవరిని కలిశాడో వంటి వివరాలను పోలీసులు, వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారందరికి కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం నమోదయిన ఈ కేసుతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 45కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా సాగుతోంది. ప్రజానీకాన్ని బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement