కాంగ్రెస్‌ దూకుడు

Congress Party Success In Nizamabad District - Sakshi

1985లో వచ్చి మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్‌ హవాతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ డీలా పడాపోయింది.మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకకు ఐదు కాంగ్రెస్‌కు రాగా ,నాలుగు టీడీపీ చేజిక్కించుకుంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో యువరక‍్తం ఉప్పొంగింది..గెలుపుబాటలు వేసింది.బాల్కొండ నుంచి తొలిసారిగా పోటీ చేసిన సురేశ్‌రెడ్డి , కామారెడ్డి నుంచి 32 ఏళ్లకే  అనూహ్యంగా టికెట్‌ సాధించి పోటీచేసిన షబ్బర్‌ అలీ ,నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి డీఎస్‌ తొలిసారిగా పోటీ చేసి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు. ఓటర్లు  1989లో కాంగ్రెస్‌కే పట్టంగట్టారు. ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.తొలిసారిగా గెలవడమే కాకుండా షబ్బిర్‌ అలీ ,డీఎస్‌ ఏకంగా కాబినేట్‌లో మంత్రులగా స్థానం సాధించారు.

సురేశ్‌రెడ్డి తొలి  విజయం 

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): బాల్కొండ నియోజకవర్గంనికి 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన కేతిరెడ్డి సురేశ్‌ రెడ్డి విజయం సాధించారు. యువజన కాంగ్రెస్‌ కమ్మర్‌పల్లి మండలం అధ్యక్షుడిగా ఉన్న సురేశ్‌రెడ్డికి బాల్కొండ కాంగ్రెస్‌ టిక్కెట్‌ లభించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆలూర్‌ గంగారెడ్డి పోటీచేశారు. సురేశ్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో 43,837 ఓట్లు లభించగా, ఆలూర్‌ గంగారెడ్డికి 37,871 ఓట్లు లభించాయి. సురేశ్‌రెడ్డి 5, 966 ఓట్లు మెజార్టీతో ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌రెడ్డి ,టీడీపీ అభ్యర్థి ఆలూర్‌ గంగారెడ్డిలు ఇద్దరి​కి తొలి ఎన్నికలు కావడం విశేషం. కాగా బాల్కొండ నియోజకవర్గానికి 1989 వరకు ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలలో అందరు స్థానికేతరులే. 1989 తరువాత స్థానికులే బాల్కొండకు ప్రాతినిథ్యం వహించడానిగా అవకాశం లభించింది.గతంలో స్థానికేతరులే ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయగా తొలిసారి స్థానికులైన వారు ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. 1989లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.అయితే సురేశ్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయనకు ప్రభుత్వంలో ఎలాంటి పెద్ద పదవి లభించలేదు.గ్రామాల్లో విస్తృతంగా పర్యటనలు జరపడం  ,ప్రజలతో సన్నిహిత సంబంధాలుండడంతో సురేశ్‌రెడ్డి వరుసగా బాల్కొండకు ఎమ్మెల్యేగా ఎంపిక కావడానికి అవకాశం దక్కింది.

సురేశ్‌ రెడ్డి               43,837 
అలూర్‌ గంగారెడ్డి         37,871 
మెజారిటీ              5,966 

ఎల్లారెడ్డిలో నేరెళ్ల పాగా 

సాక్షి, నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి):  ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గాంధారికి చెందిన నేరెళ్ల ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నకల్లో టీడీపీ నుంచి నేరెళ్ల ఆంజనేయులు,కాంగ్రెస్‌ నుంచి తాడూరి బాలాగౌడ్‌ అల్లుడు భీమాగౌడ్‌, బీఎస్పీ నుంచి శంకర్‌ స్వతంత్ర్య అభ్యర్థిగా కిషన్‌రెడ్డి పోటీచేశారు. టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు 31,318 ఓట్లు ,స్వతంత్ర్య అభ్యర్థి కిషన్‌రెడ్డికి 29,318  ఓట్లు వచ్చాయి. దీంతో నేరెళ్ల ఆంజనేయులు స్వతంత్ర్య అభ్యర్థి కిషన్‌రెడ్డిపై 1,716 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా ఆంజనేయులు రాజకీయ కుంటుంబం​ నుంచి వచ్చారు. ఆంజనేయులు తండ్రి భాగన్న 18 ఏళ‍్ల పాటు గాంధారి సర్పంచ్‌గా కొనసాగారు.ఆయన  కామారెడ్డిలో బీఎస్సీ వరకు చదివారు. మొదట 1981లో ఎల్లారెడ్డి పంచాయితీ సమితి  కో- ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికైన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1987 లో ఆయన గాంధారి సహకార సంఘం చైర్మన్‌గా  ఎన్నికయ్యారు.దీంతోపాటు నిజామాబాద్‌ ఎన్‌డీసీసీబీ డైరెక్టర్‌గా కూడా ఎన్నికయ్యారు. 1988లో గాంధారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.1989లో ఎల్లారెడ్డి  అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అనంతరం 1994, 1998లలో వరుసగా జరిగిన  ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎల్లారెడ్డి చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నేతగా గుర్తింపు పొందారు. దీంతోపాటు ఆ రోజుల్లో ఆయన విశేష ప్రజాధారణను చూరగొన్నారు. 

నేరెళ్ల అంజనేయులు 31,034 
కిషన్‌ రెడ్డి 29,318 
మెజారిటీ 1,716 

టీడీపీకి బ్రేక్‌ వేసిన షబ్బిర్‌ అలీ 

సాక్షి,కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి నియోజకవర్గంలో 1983 ,1985లలో శాసన  పభ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనానికి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ బ్రేక్‌ వేసింది.యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మహ్మద్‌ షబ్బీర్‌అలీ 32ఏళ్ల వయస్సులోనే కామారెడ్డి నియోజకవర్గం నుంచి  పోటీ చేయడానికి కాంగ్రెస్‌ టిక్కెట్‌ సాధించారు. శాసన సభపై దాడి సంఘటనలో షబ్బీర్‌అలీ జైలుకు వెళ్లి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.నాటి కేంద్రమంత్రి శివశంకర్‌  షబ్బీర్‌అలీ కి గాడ్‌ఫాదర్‌గా ఉండటంతో టిక్కెట్‌తో పాటు మంత్రి పదవి సాధించడం సులభమైంది.టీడీపీ అభ్యర్థి సయ్యద్‌ యూసుఫ్‌అలీపై 12,9789 ఓట‍్ల మెజారిటీతో అనూహ్యంగా గెలుపొందడమే కాకుండా చెన్నారెడ్డి మంత్రి వర్గంలో ఏపీ రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా  , ఇన్‌చార్జ్‌ మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.చెన్నారెడ్డి మంత్రివర్గంలో  అతి పిన్న వయస్సు మంత్రిగా షబ్బీర్‌అలీ కొనసాగి పనితీరులో శభాష్‌ అనిపించుకున్నారు.1989 ఎన్నకల్లో షబ్బీర్‌అలీ 38,029  ఓట్లు పొందగా ,టీడీపీ అభ్యర్థి సయ్యద్‌ యూసుఫ్‌అలీ 25,051 ఓట్లు పొందారు.దాదాపు 30ఏళ్లగా ​కామారెడ్డిలో షబ్బీర్‌అలీకి మాత్రమే టిక్కెట్‌ కేటాయించడం విశేషంగా చెప్పవచ్చు.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ షబ్బీర్‌అలీ విద్యుత్‌ ,బొగ్గు, మైనారిటీ సంక్షేమం,వక్ఫ్‌, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పనిచేశారు.

షబ్బీర్‌ అలీ 38,029
యూసుఫ్‌ అలీ 25,051 
మెజారిటీ 12,979

ముడోసారి 'శనిగరం' దకూడు

 సాక్షి,ఆర్మూర్‌ :1989 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శనిగరం సంతోష్‌రెడ్డి విజయం సాధించారు.సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన వేముల సురేందర్‌రెడ్డిపై ఆయన విజయం సాధించారు.సంతోష్‌రెడ్డికి 51,881 ఓట్లు రాగా వేముల సురేందర్‌రెడ్డికి 40,460 ఓట్లు వచ్చాయి. దీంతో 11,421 ఓట్లు మెజారాటీతో సంతోష్‌రెడ్డి విజయం సాధించారు.1978,1983 తర్వాత 1989లో సంతోష్‌రెడ్డి మూడో పర్యాయం​ ఆర్మూర్‌  ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఈ పర్యాయం ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు.1990-91 వరకు రోడ్లు ,భవనాల శాఖ మంత్రిగా ,1991-92 వరకు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి క్యాబినేట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

సంతోష్‌రెడ్డి 51,881
సురేందర్‌ రెడ్డి 40,460
మెజారిటీ 11,421

తొలిసారిగా డీఎస్‌ ఎమ్మెల్యే

సాక్షి,నిజామాబాద్‌ అర్బన్‌: 1989 సాధారణ ఎన్నికలు డీ.శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలుపొందారు.1989 జరిగిన  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున డీ.శ్రీనివాస్‌ నిజామాబాద్‌ నియోజకవర్గంలో బరిలో నిలిచారు.ఈయనకు పోటీగా టీడీపీ నుంచి డి. సత్యనారాయణ రెంతవసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో నిజామాబాద్‌ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు.కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్‌ 45,558 ఓట్లు రాగా, డి. సత్యనారాయణ టీడీపీకి 31,549 ఓట్లు వచ్చాయి. డి.శ్రీనివాసే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ రెండు పర్యాయాలు తరువాత నిజామాబాద్‌ నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేసింది. తొలి
సారిగా డి. శ్రీనివాస్‌ 14,009 ఓట్ల మెజారిటీతో డి.సత్యనారాయణపై గెలుపొందారు.

డీ.శ్రీనివాస్‌ 45,558 
సత్యనారాయణ 31,549
మెజారిటీ 14,009

అనూహ్యంగా తెరపైకి 'కత్తెర'

 సాక్షి, బాన్సువాడ: టీడీపీ పార్టీ ప్రభావంతో​ కాంగ్రెస్‌ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు .1983,1985 ఎన్నికల్లో వరుస విజయాలతో టీడీపీ అభ్యర్థులు బాన్సువాడ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.ఆ తర్వాత 1989 ఎన్నికలు రాగా ,బాన్సువాడ ఎంపీపీగా పనిచేసిన కత్తెర గంగాధర్‌కు అనూహ్యంగా టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్‌ లభించింది.ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,36,711 ఓటర్లు ఉండగా , అందులో 1,04,092 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అందులో కేవలం 98,646 ఓట్లు మాత్రమే చెల్తాయి.కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండవ సారి ఆర్‌.వెంకట్రాంరెడ్డి నిటబడగా ,టీడీపీ అభ్యర్థి కత్తెర గంగాధర్‌కు 44,377 ఓట్లు ,ఆర్‌.వెంకట్రారాంరెడ్డికు 41,934 ఓట్లు వచ్చాయి.దీంతో కత్తెర గంగాధర్‌ 2,443 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.1989లో టీడీపీ  తరఫున పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.డీసీసీబీ చైర్మన్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ,ఎమ్మెల్యేగా కత్తెర గంగాధర్‌ కలిసి బాన్సువాడ నియోజకవర్గ అభివ*ద్ధిపై ద*ష్టి పెట్టారు.ఆయన హయంలో​ నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆసుపత్రి మంజూరీ ,బస్సు డిపో మంజూరీ లభించింది. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన కత్తేర 1994లో టికెట్‌ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా పని చేశారు.బాన్సువాడ నియోజకవర్గాన్నిమహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తే పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.

కత్తెర గంగాధర్‌ 44,377 
వెంకట్రారాంరెడ్డి 41,934
మెజారిటీ 2,443

225 ఓట్లతో మండవ విజయం 

 సాక్షి, డిచ్‌పల్లి(నిజామాబాద్): డిచ్‌పల్లి అసెంబ్లీ 1983లో ప్రారంభమైన టీడీపీ హవా వరుసగా మూడో ఎన్నికల్లో కొనసాగింది.1985లో  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండవ వెంకటేశ్వరరావు 1989 ఎన్నికల్లో తన పట్టు నిలుపుకున్నారు.రెండోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌ఎల్‌ నారాయణపై225 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి అంతిరెడ్డి బాల్‌రెడ్డి ఓడిపోవడంలో ఆయనకు బదులుగా పార్టీ టికెట్‌ ఎన్‌ఎల్‌ నారాయణకు ఇచ్చారు.1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మండవ వెంకటేశ్వరరావు కు 42,896 ఓట్లు రాగా ,కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌ఎల్‌ నారాయణకు 42,671 ఓట్లు వచ్చాయి.చివరి రౌండ్‌ వరకు ఇరువురి మధ్య పోటీ హోరాహోరిగా సాగింది.అతి తక్కువ ఓట్లు తేడా రావడంతో ఎన్‌ఎల్‌ నారాయణ వర్గీయులు రీకౌంటింగ్‌ చేయాలనిపట్టుబట్టారు.నిజామాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో గందరగోళ పరిస్థిల మధ్య జరిగిన ఈ ఓట్ల లెక్కింపు తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగింది.చివరకు 225 ఓ‍ట్ల తేడాతో మండవ విజయం సాధించినట్లు ప్రకటించారు.

వెంకటేశ్వరరావు 42,896
నారాయణ 42,671
మెజారిటీ   225

మూడవసారి సౌదాగర్‌

 సాక్షి,నిజాంసాగర్‌(జుక్కల్‌) : జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌ ,టీడీపీ పార్టీల మధ్యహోరాహోరిగా సాగాయి.అప్పటికే రెండు పార్టీలు నియోజకవార్గంపై పట్టు సాధించటంతో గెలపోటములు నాయకులతో​ దోబూచులాడాయి.చేతి గర్తుతో పాటు సైకిల్ గుర్తును ఇక్కడి ఓటర్లు సమానంగా చూశారు. దీంతో నాయాకులకు ఈ ఎన్నికలు కత్తి మీద సాముగా మారాయి.1989లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా సౌదాగర్‌ గంగారాం బరిలో నిలవగా టీడీపీ నుంచి అభ్యర్థిగా శ్రీనివాస్‌కాలే పోటీలో ఉన్నారు.కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాంకు 40,646 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ కాలేకు 39,372 ఓట్లు వచ్చాయి.దాంతో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగారాం 1,274 ఓట్లతో విజయం సాధించారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచి సాదాగార్‌ గంగారం మూడు పర్యాయాలు విజయం సాధించి రాకార్డు సృష్టించారు.

సౌదాగర్ గంగారాం 40,646
శ్రీనివాస్‌ కాలే 39,372
మెజారిటీ 1,274

ఆధిక్యత చూపిన కొత‍్త రమాకాంత్‌ 

 సాక్షి,బోధన్‌ : నియోజకవర్గంలో 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొధన్‌ పట్టణ కేంద్రానికి చెందిన కొత్త రమాకాంత్‌ ఎమ్యెల్యేగా గెలుపొందారు.ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్గిగా ఉన్న మాజీ మంత్రి సుదర‍్శన్‌రెడ్డిపై విజయం సాధించారు. రమాకాంత్‌కు 36,702 ఓట్లు రాగా ,సుదర్శన్‌రెడ్డికి 33,107 ఓట్లు వచ్చాయి.3595 ఓట్ల ఆధిక్యత సాధించి రమాకాంత్ విజయం సాధించారు.బోధన్‌ పట్టణ కేంద్రానికి చెందిన రమాకాంత్‌ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు.బీకాం చదివారు.అప్పట్లో డైనామిక్‌ లీడర్‌గా గుర్తింపు పొందారు.1982లో దివంగత సీఎం ఎన్టీఆర్‌ స్థాపించాక ,రమాకాంత్ ఆ పార్టీలో చేరారు.1989లో తొలి సారిగా ఎమ్యెల్యే స్థానానికి పోటీచేసి విజయకే తనం ఎగురవేశారు.1994 ఎన్నికల్లో బషీరుద్దీన్‌ బాబుఖాన్‌కు టకెట్ ఇవ్వడంతో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1999లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సుదర్శన్‌ రెడ్డి  చేతిలో ఓడిపోయారు.2001లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఆశించి  బోధన్‌ జెడ్సీటీసీగా గెలిచారు.కాని టీడీపీకి తగినంత మెజారిటీ రాకపోయేసరికి రమాకాంత్‌కు జడ్పీచైర్మన్‌ అవకాశం లభించింది.ఆ తర్వాత చాలాకాలం టీడీపీలోనే ఉన్నారు.మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉధ్యమంలో పట్టణ కుల సంఘాల జేఏసీ ఏర్పాటులొ కీలక పాత్ర వహించారు.

కొత్త రమాకాంత్‌ 36,702 
సదర్శన్‌రెడ్డి 33,107
మెజారిటీ  3,595  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top