'వాటి వల్లే టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలుస్తోంది' | congress leaders slams trs government over paleru bypoll | Sakshi
Sakshi News home page

'వాటి వల్లే టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలుస్తోంది'

May 12 2016 6:07 PM | Updated on Mar 18 2019 9:02 PM

అధికార బలం, డబ్బు, ప్రలోభాలతో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఆరోపించారు.

ఖమ్మం: అధికార బలం, డబ్బు, ప్రలోభాలతో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఆరోపించారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి  పాల్గాన్నారు. ఈ సందరర్భంగా వారు మాట్లాడుతూ.. పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. కాంట్రాక్టర్లను, లిక్కర్ వ్యాపారులను ఖమ్మంలో దింపి కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డిని టీఆర్ఎస్ ఓడించే ప్రయత్నం చేస్తోందన్నారు. డబ్బు, మద్యం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో గెలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కేబినెట్ మొత్తం పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలోనే ఉందని నేతలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement