రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు
హైదరాబాద్ : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. సినీరంగం, ఇతర పరిశ్రమలకు భూముల కేటాయింపుకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఇప్పటి వరకూ రైతు రుణ ప్రణాళిక పూర్తిగా అమలు కాలేదని, రుణమాఫీ విషయంలోనూ షరతులు విధిస్తున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరిపంట వద్దంటున్న ప్రభుత్వం ఆరుతడి పంటలకు అదనపు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.