వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం | Classification of Government remiss | Sakshi
Sakshi News home page

వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Mar 20 2016 4:25 AM | Updated on Oct 8 2018 3:00 PM

వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం - Sakshi

వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లటంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మార్పీఎస్ ....

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
 
కేయూ క్యాంపస్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లటంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అణగారిన వర్గాలకు చేస్తున్న మోసాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని  పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ సెమినార్‌హాల్‌లో నిర్వహించిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) మహాసభలో ఆయన మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణను కేసీఆర్ అసెంబ్లీ తీర్మానానికే పరిమితం చేశారని, రెండు సార్లు ఇటీవలనే ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ఎస్సీల వర్గీకరణ అంశంపై ఎక్కడా చర్చించలేదన్నారు. దళితుడిన సీఎం చేస్తానని మోసం చేసి సీఎం పదవి చేపట్టిన కేసీఆర్.. ఎస్సీ వర్గీకరణకు కృషిచేయడం లేదని విమర్శించారు. మంత్రి కడియం శ్రీహరి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు చొరవ చూపడం లేదన్నారు. ఎస్సీల వర్గీకరణ జరగకపోవటం వలన ఎంతో మంది మాదిగలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణకు అవసరమైతే పార్లమెంట్ ముట్టడికి కూడా వెనకాడబోమన్నారు.

 90శాతం ఉన్న మహాజనులు రాజ్యాధికారం దిశగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ సభలో కేయూ ప్రొఫెసర్ కె డేవిడ్, కేయూ టెక్నికల్ అసోసియేషన్ అధ్య క్షుడు డాక్టర్ పుల్లాశ్రీని వాస్,ఎంఎస్‌ఎఫ్ జాతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ సంకినేని వెంకట్‌మాదిగ, కేయూఇన్‌చార్జి మంద భాస్కర్, కేయూ అధ్యక్షుడు ఎర్రోళ్లపో చయ్య, అధికార ప్రతినిధి కొత్తరాము, బాధ్యు లు బొడ్డుదయాకర్ మాదిగ, కె సత్య, ప్రవళిక, బొర్ర భిక్షపతి, బుర్రి సతీష్, దినేష్, మురళీ, చిట్యాల కుమార్, అంజయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement