
తెలంగాణలో పెరిగిన అత్యాచారాలు
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలపై అత్యాచారాలు, హింస పెరిగాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు పెరిగాయి.
► మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన నేరాలు
► వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలపై అత్యాచారాలు, హింస పెరిగాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచా రాలకు సంబంధించి 2014లో 117 కేసులు, 2015లో 147 కేసులు నమోదు కాగా 2016లో ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయి. ఎస్టీ, ఎస్టీలపై అన్ని రకాల నేరాలకు సంబం« దించి నవంబర్ 2015 నాటికి 1288 కేసులు నమోదు కాగా నవంబర్ 2016 వరకు 1398 కేసులు నమోదయ్యాయి. క్రైం రేటు 8.5శాతం పెరిగింది. అదే విధంగా మహిళలపై అత్యా చారాల కేసులు 2014లో 972, 2015లో 1,117 నమోదు కాగా, 2016 నవంబర్ వరకు 1,138 నమోదయ్యాయి.
వీటిల్లో 253 కేసులు ప్రేమ, పారిపోవడాలకు సంబంధించినవి ఉన్నాయి. మహిళలపై అన్ని రకాల నేరాలకు సంబంధించి 2015 నవంబర్‌లోగా 12,422 కేసులు నమోదు కాగా.. 2016 నవంబర్ వరకు 12,281 కేసులు నమోదయ్యాయి. డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం ఇక్కడ విడు దల చేసిన 2016 వార్షిక నేర నివేదికలోని గణాంకాలివి. గతంతో పోల్చితే బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేస్తున్నారని, ఫిర్యాదుల న్నింటిపై కేసులు నమోదు చేస్తున్నామని, అందుకే ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై అత్యా చార కేసులు పెరిగాయని డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో 221 షీ టీములు పనిచేస్తున్నాయని, వీటీ ద్వారా 3,171 కేసులు నమోదు చేయగా, 2,733 మంది నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. సామాజిక మాద్యమాల పోస్టుల ఆధారంగా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు.
తగ్గిన హత్యలు, దోపిడీలు, దొంగతనాలు..
రాష్ట్రంలో హత్యలు, లబ్ధి కోసం హత్యలు, దోపిడీ, దొంగతనాలు తగ్గాయి. 2016 నవంబర్ వరకు శిక్షార్హ నేరాలకు సంబంధించి 95,124 కేసులు నమోదయ్యాయని, గడిచిన రెండేళ్లతో పోల్చితే నేరాలు స్వల్పంగా తగ్గు ముఖం పట్టాయని డీజీపీ తెలిపారు. అయితే, చైన్ స్నాచింగ్ ఘటనల్లో బాధితులు గాయప డిన కేసుల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరి గింది. మొత్తానికి 2015లో 1,418 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా 2016లో ఇప్పటి వరకు 958 కేసులకు తగ్గాయి. పదేపదే నేరాలకు పాల్పడుతున్న 665 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
నిత్యం నెత్తురోడుతున్న రోడ్లు...
తెలంగాణలో రహదారులు నిత్యం నెత్తురోడు తున్నాయి. 2015లో 17,999 రోడ్డు ప్రమాదా లు చోటుచేసుకోగా 5,725 మంది మృత్యు వాతపడ్డారు. 2016 నవంబర్ వరకు 19,395 రోడ్డు ప్రమాదాలు జరగగా, 5,563 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు 8శాతం పెరగగా, ప్రమాదాల్లో మృతుల రేటు 2శాతం తగ్గింది. 2015లో ప్రతి 100 ప్రమా దాలకు 31.80 మృత్యు రేటు ఉండగా, 2016 లో 28.68కు తగ్గింది. జాతీయ సగటు 29.34 కన్నా ఇది తక్కువని పోలీసు శాఖ తెలిపింది. 51,642 డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్ చేసిన ట్లు పేర్కొంది. నిబంధనలను ఉల్లం ఘించిన వాహనదారుల నుంచి 2015లో 83.41 కోట్ల జరిమానాలు వసూలు చేయగా, 2016లో రూ.85.19 కోట్లు వసూలు చేసింది.
తీవ్రవాదులకు ప్రవేశం లేదు..
తెలంగాణలో మావోయిస్టుల సంఖ్య చాలా తక్కువని డీజీపీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌సీ), ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల కమిటీలు, కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీలు పనిచేస్తున్నాయని, వీటిలో 92 మంది మావోయిస్టులు ఉన్నారన్నారు. వీరిని రాష్ట్రంలోకి రానీయమన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జాతి వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఆకర్షితులైన యువతకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు.
తగ్గిన సైబర్ నేరాలు
రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య తగ్గింది. 2015లో 634 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, 2016లో 513 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచడం వల్ల మోసపోయే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ అనురాగ్ శర్మ గురువారం తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్ద మార్పు కనిపించలేదని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఆర్థిక నేరాలు, నమ్మక ద్రోహాలు, మోసాలు పెరిగాయి. 2015లో 7,303 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా 2016లో 7,987కు పెరిగాయి. 9.37 శాతం వృద్ధి నమోదైంది.