తెలంగాణ శాసనసభలో విపక్షాలు సోమవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు సోమవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఐకేపీ ఉద్యోగుల సమస్యలపై సీపీఎం, సింగరేణి కాలరీస్ కార్మికుల స్థితిగతులపై బీజేపీ, ఐకేపీ, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
కాగా నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎల్ఎఫ్ భూ కేటాయింపులపై వివరణ ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో కళ్యాణలక్ష్మి పథకం, ప్రభుత్వ శాఖలలో ఖాళీలపై చర్చ జరగనుంది. మరోవైపు సభలో టీఆర్ఎస్ సభ్యులందరూ అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.