ఓటరు కార్డు లేకున్నా.. ఇవుంటే చాలు!

12 Documents Can Be ID Proof For Voting In Telangana Elections 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్లకు ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌ కుమార్‌ తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికలకు సర్వంసి​ద్దమని వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతీ ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు. 

ఓటరు గర్తింపు కార్డు లేని వారు12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని కల్పించామన్నారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఓటరు కార్డు లేదని, ఓటరు​ స్లిప్పులు రాలేదని ఓటర్లు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 12 రకాల ఇతర ఫోటో గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. వీటిలో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. 

12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు..

 • పాస్‌పోర్ట్‌
 • డ్రైవింగ్ లైసెన్స్
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు
 • బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు
 • పాన్ కార్డు
 • ఆధార్‌కార్డు
 • ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్
 • కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్
 • ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం
 • ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్
 • ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
 • ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌ 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top