breaking news
-
సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్ అని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి తాను విదేశీ పర్యటనలకు వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నామని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపారు. అదానీ, అంబానీకి 25 లక్షల కోట్ల రూపాయిలు మాఫీ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. గత 10 ఏండ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ధిక బడ్జెట్ ను చక్కదిద్దాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడని అన్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం -
ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పలువురికి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని ఆమె కామెంట్స్ చేశారు. కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ క్రమంలో విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024 ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
నేటి నుంచి ‘బండి’యాత్ర
కరీంనగర్ టౌన్: ‘మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఈ మహాయాగంలో మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నా.. ఆశీర్వదించండి’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యా త్రను విజయవంతం చేయాలని కోరారు. శనివారం ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే తొలివిడత యాత్ర ఈనెల 15 వరకు కొనసాగనుంది. తొలిరోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో జరగనుంది. రాత్రి కథలాపూ ర్లో సంజయ్ బసచేస్తారు. తొలివిడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనం వాడతారు. గ్రామాల్లో మా త్రం పాదయాత్రగా ముందుకు సాగుతారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. నియోజకవర్గం మొత్తం పర్యటించేలా రూట్‌మ్యాప్ ప్రజాహిత యాత్ర పేరిట కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేలా ఇప్పటికే సంజయ్ రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొదట కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి సంజయ్ తనయాత్రను ప్రారంభించనున్నారు. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి తంగళ్లపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీ. మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ మండలం కవర్ చేస్తూ.. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్రను కొనసాగించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. -
11 లేదా 12న కాంగ్రెస్‌లోకి పట్నం దంపతులు!
తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్‌రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ను వీడారు. మహేందర్‌రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
అందరి గురి మల్కాజిగిరి!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పదును పెట్టింది. పార్టీ ముఖ్యులతో ముమ్మర చర్చలు జరుపుతోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ నివాసంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్‌రావు, జితేందర్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అందిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. తనకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని మల్కాజిగిరి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సీటును ఆశిస్తున్న మురళీధర్‌రావు.. దశాబ్దాలుగా తనకున్న జాతీయ స్థాయి అనుభవం, పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పరిగణనలోకి తీసుకుని పోటీకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి కూడా ఈ సీటును కోరుతున్నారు. ఈ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని జైపాల్‌రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, మురళీగౌడ్ భావిస్తుండగా, మహబూబ్‌నగర్ నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ బరిలో ఉన్నారు. త్వరలో అభ్యర్థుల ప్రకటన: కిషన్‌రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని సమావేశానంతరం కిషన్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తొలి జాబితాలోనే వీలైనన్ని ఎక్కువ పేర్లు ప్రకటిస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని, గ్రామ స్థాయిలో పార్టీలో చేరికల కోసం 25 మంది యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు వేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోని ఆఫీస్‌కు తాళం వేశారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. -
ఆటోవాలాల పొట్టగొడతారా?
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశం శుక్రవారం శాసనసభలో అధికార కాంగ్రెస్– ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలకు కారణమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం ఉదయం చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం ప్రారంభించిన అనంతరం యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ ఇద్దరూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరుణంలో బీఆర్ఎస్ పక్షాన పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ప్రజా పాలన అంటూ ఘనంగా చెప్పుకొని చివరకు 30 మోసాలు, 60 అబద్ధాలు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం సాగిందని ఆయన విమర్శించారు. ప్రజాభవన్‌లో మంత్రుల జాడెక్కడ.. ఆరు నిమిషాలు కూడా లేని సీఎం ప్రజాభవన్‌లో స్వయంగా తానే విన్నపాలు వింటానని ముఖ్యమంత్రి పేర్కొన్నా ఇప్పటివరకు ఆరు నిమిషాలకు మించి ఉండలేకపోయారని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. మంత్రులు ఉంటామన్నా వారి జాడ కూడా లేదని, ఉన్నతాధికారులు వస్తారని చెప్పినా వారూ కనిపించటం లేదని, చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే విన్నపాలు నమోదు చేసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో డ్రాప్ బాక్సులు పెట్టి అభ్యర్థనలను వాటిల్లో వేయమనేలా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ, ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలినన్ని బస్సులు లేకుండా మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదనీ, చాలినన్ని బస్సులు, ట్రిప్పులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకంతో ఆటోవాలాలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకుని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణపథకాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పేద ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, దీనికి బడ్జెట్లో నిధులు ప్రతిపాదిస్తామని పునరుద్ఘాటించారు. తాము మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించటం లేదని, బస్సుల సంఖ్య పెంచాలనీ, ఆటోడ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేలు చొప్పున సాయం అందించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బెంజికార్లు దిగని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆటోడ్రైవర్లను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని, ఆర్టీసీ ఉద్యోగులను నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని గాలికొదిలేసిందని, ఇప్పుడేమో ఆటోడ్రైవర్లను ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. బెంజ్ కార్లు దిగని ఈ ఫ్యూడల్స్ ఇప్పుడు ఆటోల్లో ప్రయాణిస్తూ వారిని అవమానిస్తున్నారని విమర్శించారు. తమ బంధువైన రిటైర్డ్ ఆర్టీసీ ఈడీని ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు కొనసాగించి సంస్థను భ్రషు్టపట్టించిన చరిత్ర గత ప్రభుత్వానిదని ఆరోపించారు. పేద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటాన్ని గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆటోడ్రైవర్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మరో మంత్రి సీతక్క విమర్శించారు. కవితపై ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆరోపణలు.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, యాదాద్రి అభివృద్ధి పేరిట యాడాను ఏర్పాటు చేసి వందల కోట్ల నిధులను దుర్వీనియోగం చేశారని, సగం నిధులు ఎమ్మెల్సీ కవిత, నాటి మంత్రి జగదీశ్‌రెడ్డికి ముట్టాయని ఆరోపించా రు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి వచ్చారు. వారిపై స్పీకర్ ఆగ్ర హం వ్యక్తం చేయటంతో తిరిగి తమ స్థానాల వద్దకు చేరుకున్నారు. సభలో లేని వారి గురించి సభ్యుడు మాట్లాడిన అభ్యంతరకర మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంతరెడ్డి కోరగా, పరిశీలించి నిర్ణ యం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. -
నేడు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. బడ్జెట్‌ను శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కేసీఆర్ డిసెంబర్ 8న జారిపడి గాయపడ్డారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈమేరకు బులెటిన్ కూడా విడుదలైంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే.. బీఆర్ఎస్ చేసిందేమిటి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఏపీ తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే సహకరించిందని, కేంద్రం వద్ద ఈ దిశగా సానుకూలంగా సంతకాలు చేసింది కేసీఆర్ సర్కారే అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ 12.5 టీఎంసీల నీళ్ళు వాడుకునేందుకు వీలుగా ప్రాజెక్టులు కడితే, తెలంగాణలో కనీసం రెండు టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కూడా లేవని విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చకు రేవంత్ బదులిచ్చారు. కాళేశ్వరంపై నివేదికలు సభలో పెడతాం ‘కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే, కృష్ణా ప్రాజెక్టులు అప్పగించారంటున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ లక్షా 47 వేల కోట్ల మేరకు అంచనాలు వచ్చాయని, రూ.97,500 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఇంకో రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతాచేసి కాళేశ్వరం కింద 90 వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందలేదన్నది వాస్తవం కాదా? దీనిపై విజిలెన్స్ నివేదికలు సభలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని రేవంత్‌రెడ్డి అన్నారు. మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ సర్కారే ‘కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ కేంద్రానికి అప్పగించిందనే వాదనలో అర్థం లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును 2014 పునరి్వభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2014 నుంచి 2023 వరకు బోర్డు సమావేశాలకు వెళ్ళింది వాళ్ళే. ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే ఏపీ పోలీసు లు ఏకే 47 తుపాకులతో నాగార్జున సాగర్ డ్యాంపైకి ఎలా వచ్చారు? వాళ్ళ పులుసు తిని అలుసు ఇచ్చింది బీఆర్ఎస్. రాయలసీమకు వెళ్ళి మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది మీరు కాదా? మీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి కట్టింది. మీ కళ్ళ ముందే కదా వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డి పాడును 44 వేల క్యూసెక్కులకు పెంచింది. జీవో నంబర్ 203కు నీ ఇంట్లోనే కదా పునాది వేసింది. 8 టీఎంసీలు తరలించేందుకు అనుమతించింది బీఆర్ఎస్సే. ఇప్పుడు 12 టీఎంసీలు వెళ్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ 796 ఎఫ్ఆర్ఎల్ వద్ద కట్టారు. ఏపీ ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే, వీళ్ళు చేసిందేమిటి? రాజీవ్ గాంధీ టన్నెల్ ప్రాజెక్టులో ఒక్క కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు. కల్వక్తురి లిఫ్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ పరిస్థితీ ఇదే. కృష్ణా జలాలపై మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ సర్కారే. కృష్ణా జలాలు 2015లో కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఏపీకి కేటాయిస్తే, 512 టీఎంసీలు ఏపీకి ఇవ్వడానికి అధికారికంగా సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ రైతుల హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు..’అని సీఎం ఆరోపించారు. -
సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే... మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసనమండలి తొలిరోజు రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసింది. శాసనమండలి సభ్యులపైన ఓ టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హౌజ్‌లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చేప్పేవరకు సభను ముందుకు సాగనివ్వమని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్ ఐదుసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో ధన్యవాద తీర్మానంపై చర్చ కు అవకాశం లేకుండా పోయింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందా? లేదా? చూడాలి. సభ ప్రారంభంలోనే గందరగోళం ఉదయం సభ ప్రారంభం కాగా... చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముందుగా సభలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు స్వాగతం పలికారు. అనంతరం బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు భానుప్రసాద్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాసనమండలి సభ్యులపైన సీఎం రేవంత్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హౌజ్‌లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సైతం గొంతు కలపడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగజేసుకుంటూ సీఎం వాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపామనీ, సభ్యులు ఈ అంశంపై నోటీసు ఇస్తే చర్చకు అవకాశం కల్పిస్తానన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకుండా సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పదినిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదన్న జూపల్లి ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యు లు అదే తీరును ప్రదర్శించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిద్దరు సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రభుత్వం తరపున మాట్లాడాలని చైర్మన్ కోర గా జూపల్లి స్పందిస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో మంత్రి వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగు ్గలు కలిపే వ్యక్తికి రాజ్యసభను పంపించిన బీఆర్ఎస్కి మండలిలో మాట్లాడే అర్హత లేదన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సాంప్రదాయమని, సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పెద్దల సభకు గౌరవం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తులు మండలికి వస్తారని, పెద్ద మనుషులు ఉండే పెద్దల సభను అగౌరవం పర్చేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. -
‘సబ్‌ప్లాన్’ను మాయం చేశారు
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ విధానాన్ని ప్రారంభించి, ఆయా వర్గాల పేదల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని తొలగించి పేదల సంక్షేమాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులతో ఆయా వర్గాల వారికి ఎంతో లబ్ధి కలిగిందని, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కో గ్రామానికి పది వరకు యూనిట్లు దక్కాయని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి, దళితబంధు పేరుతో నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీ నుంచి వెళ్లిపోయి మాట్లాడుతున్నావంటూ వ్యాఖ్యానించారు. ‘నన్ను ఓ మనిషిగా చూడలేని మిమ్మల్ని వదిలి ఆదరించిన కాంగ్రెస్‌లో చేరి గెలిచా. అన్నీ చెప్తా.. వినే ఓపిక ఉందా, నన్ను గెలకొద్దు, గెలికించుకోవద్దు’అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తూనే తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించిందన్నారు. అంతా బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారు దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమను గెలిపించారని, దొరల పాలనకు గుర్తుగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు తొలగించామని వీరేశం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకొన్నారని, మరి సంక్షేమం బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేసిన గద్దర్‌ను ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా అవమానించారని, ఇప్పుడు ఆయన సేవలను తమ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించుకుంటోందన్నారు. అబద్ధానికి ప్రతిరూపం కేసీఆర్: యెన్నం అబద్ధానికి ప్రతిరూపంగా కేసీఆర్ నిలుస్తారని అధికార పక్ష సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదికి కాళ్లు అడ్డుపెట్టి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎంపీగా అక్కడి నుంచి గెలిచి, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మహబూబ్‌నగర్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. కానీ, నాలుగు సార్లు దావోస్ వెళ్లి రూ.19 వేల కోట్లకు మించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేకపోయిందని యెన్నం ఎద్దేవా చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దావోస్ వెళ్లి ఏకంగా రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న ఘనత రేవంత్‌దన్నారు. -
వారిది ఫెవికాల్ బంధం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతునిచ్చిం ది. లోక్‌సభ, రాజ్యసభల్లో త్రిపుల్ తలాక్, 370 ఆర్టీకల్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్లచట్టాలు లాంటి వందల బిల్లుల ఆమోదానికి బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది..’అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి, బీఆర్ఎస్కు మధ్య సంబంధం ఉందంటూ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎంఐఎంతో మాత్రమే తాము స్నేహపూర్వకంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని మాట్లాడారు. పదేళ్ల పాటు రెండు పార్టీలదీ ఒకే ఆలోచన ‘బీజేపీ, బీఆర్ఎస్ గత పదేళ్లుగా ఒకే ఆలోచనతో ప్రభుత్వాలు నడిపాయి. ఆ రెండు పార్టీలు కలిసి చర్చించుకుంటాయి. బీఆర్ఎస్ అంతర్గత విషయంలోనూ మోదీ మద్దతు కోరారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తాననన్నాడు. అయితే వారసత్వ రాజకీయాలను తాను సమర్థి చనంటూ కేసీఆర్‌తో అన్నానని, మోదీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పారు. బీజేపీతో సంబంధాలు లేకపోతే కేసీఆర్‌కు మోదీ అనుమతి ఎందుకు? కేసీఆర్ పార్టీ అంతర్గత వ్యవహారంలోనే మోదీ అనుమతి కోరారంటే, బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమేనని స్పష్టమవుతోంది. 2011లో శాసనమండలి ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ, అప్పటి టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మీనారాయణలు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేశారు. అలాగే ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, కావేటి సమ్మయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులు కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుకూలంగా ఓటేశారు. ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతు ఇచ్చినందుకే కేసీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు ‘మీ అల్లుడు’ఓటేయమని చెపితే వేశామని, ఆయన్ను ఏమనకుండా మమ్మల్ని ఎలా పార్టీ నుంచి బహిష్కరిస్తారంటూ నిలదీశారు. దీంతో తిరిగి 2014లో వారికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. కేసీఆర్ సొంత పార్టీ నేతలకు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పరు. కొన్ని చెపుతారు.. కొన్నింటిని దాస్తారు..’అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. సీఎంను మార్చాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు: పోచారం సీఎం వ్యాఖ్యలపై పోచారం స్పందించారు. ‘రేవంత్‌రెడ్డి, మేమంతా కలిసి పనిచేశాం. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఎలాంటి బంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించింది. సీఎంను మార్చాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు. బీఆర్ఎస్కే అప్పుడు 100 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉంది. అధికారం వస్తది పోతది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్‌రెడ్డి చిన్న వయస్సులో సీఎం అయినందుకు మాకు ఎలాంటి ఈర‡్ష్య లేదు. ప్రజలు మమ్మలి ఇక్కడ.. వాళ్లను అక్కడ కూర్చోబెట్టారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు మా సహకారం ఉంటుంది..’అని అన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చారు: పల్లా మన్మోహన్సింగ్, సోనియాగాం«దీలే తెలంగాణ ఇచ్చారని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణను తెచ్చిం ది కేసీఆరేనన్నారు. బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్య్రం ఇవ్వలేదనీ, అది పోరాడి సాధించుకున్నదని చెప్పారు. అలాగే తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉండొచ్చేమో కానీ, కొట్లాడి తెచ్చిం ది మాత్రం కేసీఆరేనన్నారు. సుష్మాస్వరాజ్‌ను మరిచారు: పాయల్ శంకర్ తెలంగాణ కోసం కృషి చేసిన వారిలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ఉన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల గురించి మాత్రమే చెబుతున్నారని, మిగతా హమీలకు గ్యారంటీ లేదా అని ఎద్దేవా చేశారు. తాము బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో ఎవరికీ దగ్గరగా లేమన్నారు. వైఎస్సార్ లేని లోటును పూడ్చలేం: అక్బరుద్దీన్ మూసీ నది సుందరీకరణ వ్యవహారం మూడు దశాబ్దాలుగా చర్చల్లోనే ఉందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ అన్నారు. ఈ విషయంపై అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను పిలిపించి మాట్లాడారని, ఈ ప్రాజెక్టు చేద్దామని తనతో చెప్పారని గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన అకస్మాత్తుగా చనిపోయారని, ఆయనలేని లేని లోటు పూడ్చలేమని, ఆయన్ను తాము ఎంతో మిస్ అవుతున్నామని చెప్పారు. మూసీని సుందరీకరించాలన్న వైఎస్సార్ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాకారం చేయాలని కోరారు. ఇక హైదరాబాద్ మెట్రో రైలుపై తాను చేసిన ప్రతిపాదనను కూడా అప్పట్లో వైఎస్సార్ అంగీకరించి, ఢిల్లీకి కలిసి వెళ్లి అక్కడి మెట్రో రైలును పరిశీలిద్దామని చెప్పారని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. కాగా దళితబంధు లబ్ధిదారులను ఎమ్మెల్యేలు కాకుండా ప్రభుత్వమే గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 వేల మంది నర్సులకు పోస్టింగ్‌లు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. దావోస్ నుంచి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని అభినందించారు. రంజాన్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. -
‘రాజకీయాల నుంచి తప్పుకుంటే.. గోవా వెళ్తా.. ఎంజాయ్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్‌ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సబితారెడ్డితో కేటీఆర్ భేటీ అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం -
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయమై శుక్రవారం ఉత్తమ్ అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు ఎక్కడి నుంచో మినట్స్ తెచ్చి సమాధానం చెప్పాల్సిందిగా మమ్మల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు. ‘కృష్ణా నదిలో వాటా వదులుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.కృష్ణా నీటిని ఏపీకి తరలించే ఒప్పందం ప్రగతిభవన్లోనే జరిగిందా లేదా కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగింది’ అని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదీ చదవండి.. గ్రూప్ 1 పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన -
గ్రూప్-1పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ‘బీఆర్ఎస్కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారు. అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం. ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 9వ తేదీ మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశాం. ప్రతిపక్షం సహకరించకపోయినా ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తాం. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరిచాం. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ల నాయకున్ని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ అప్పటి పాలకులు టీజీకి బదులు టీఆర్ఎస్ వచ్చేలా టీఎస్ అని పెట్టుకున్నారు. దానిని మార్చాం. రాజరిక పోకడలున్న అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించాం’ అని రేవంత్ తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1.. వయోపరిమితి 46 ఏళ్లు ‘ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదు. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుంది. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తాం. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైంది. తొందరలోనే పోలీస్ శాఖలో 15వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్సిటీల వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే సొంత మనుషులనే వాళ్లు అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం నా భాధ్యత. బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతిలో నేను చెయ్యను. గతపు ఆనవాళ్లు సమూలంగా ప్రక్షాళన చేసే భాధ్యత నాది. కాళోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్లుగా పూర్తి చెయ్యలేదు గత ప్రభుత్వం’ అని రేవంత్ విమర్శించారు. గతంలో ఒకరిది అగ్గిపెట్టె డ్రామా.. ఇప్పుడొకరిది ఆటో డ్రామా ‘తెలంగాణ గీతాన్ని కేబినెట్ ఆమోదం తెలిపితే మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు 9 నెలల పాటు పడ్డాయి. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేశాం. ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు. గతంలో ఒకరు అగ్గిపెట్టె డ్రామాలు ఆడితే...మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు. వాళ్ళ ఇండ్లలో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి...కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదు’ అని రేవంత్ బీఆర్ఎస్కు చురకలంటించారు. ఇదీ చదవండి.. ధర్మపురి అర్వింద్‌కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ -
ధర్మపురి అరవింద్‌కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్‌కు టికెట్ ఇవ్వద్దని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిలో సతీష్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి అరవింద్‌కు టికెట్ ఇవ్వద్దని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ‘వి వాంట్ జస్టిస్, అహంకార అరవింద్ మాకొద్దు.. అరవింద్ డౌన్ డౌన్ , అరవింద్ కీ హటావో బీజేపీ బచావో’ అంటూ మెడలో దండలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన చేశారు. ‘ఎంపీగా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు. గత 30 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదు. ఈసారి అరవింద్‌కు టికెట్ ఇస్తే ఒడిస్తాం’ అని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు -
కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు!
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. దీనిలో భాగంగా వీరిద్దరూ రేపు(శనివారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు.మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
కడియంను బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్‌కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్‌గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బీసీని చేయాలని సూచించారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
హస్తం గూటికి పట్నం దంపతులు!
వికారాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో త్వర లో నిర్వహించనున్న బహిరంగ సభలో వీరు హస్తం కండువా వేసుకోనున్నట్లు సమాచారం. మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
కేసీఆర్‌కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్‌ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్‌ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్‌ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌కు కూడా చాంబర్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్‌ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్‌లోగా ప్రతిపక్ష నేత చాంబర్‌ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
బీఏసీకి హరీశ్ రాకపై అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో మంత్రులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య స్వల్ప వాగ్విదం జరిగింది. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌కు బదులు హరీశ్‌రావు బీఏసీ భేటీకి హాజరు కావడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ చాంబర్లో బీఏసీ తొలి సమావేశం ప్రారంభమైంది. అధికార పార్టీ తరఫున శ్రీధర్‌బాబు, పొన్నంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున తనకు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశంలో పాల్గొంటారంటూ మాజీ సీఎం కేసీఆర్ బుధవారం స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే శ్రీధర్‌బాబు, పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది. కేసీఆర్‌కు బదులుగా తాను హాజరయ్యేందుకు స్పీకర్ అంగీకరించారని హరీశ్ చెప్పారు. అయితే ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి హరీశ్‌రావు హాజరయ్యేందుకు వీలు లేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలా హాజరయ్యేందుకు వీలు లేదు: శ్రీధర్‌బాబు తాము ఎవరిని బీఏసీ సమావేశం నుంచి బయటకు వెళ్ళమని చెప్పలేదని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కలి్పంచారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్లు ఇచ్చారని తెలిపారు. కానీ బీఏసీ భేటీకి కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తానని హరీశ్‌రావు తెలిపారని, అయితే ఒక సభ్యుడు సమావేశానికి రావడం లేదని చెప్పి అతడి స్థానంలో మరో సభ్యుడికి అనుమతినివ్వడం కుదరదని పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి లేఖ కూడా ఇవ్వలేదని తెలిపారు. కాగా అసెంబ్లీని ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు తా ము సిద్ధమని శ్రీధర్‌బాబు చెప్పారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు మేం అనుమతించాం: హరీశ్ గతంలో తాము బీఏసీ జాబితాలో లేని వారిని కూడా పార్టీ శాసనసభా పక్ష నేత వినతి మేరకు అనుమతించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశా రు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బదు లుగా ఎమ్మెల్యే బలాలను పలు సందర్భాల్లో అనుమతించామని, అవసరమైతే బీఏసీ మిని ట్స్‌ను పరిశీలించాలని అన్నారు. తాము అలా అనుమతించలేదని నిరూపిస్తే రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తానని హరీశ్ స్పష్టం చేశారు. దీంతో మినిట్స్ పరిశీలించేందు కు సమయం పడుతుందని, అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో సర్దుకుపోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ కోరారు. దీంతో మీ విచక్షణకే వదిలివేస్తున్నానంటూ హరీశ్‌రావు బీఏసీ భేటీ నుంచి బయటకు వచ్చారు. దీంతో కడియం ఒక్కరే బీఆర్ఎస్ తరఫున బీఏసీ భేటీలో పాల్గొన్నారు. -
హామీలేమయ్యాయి? కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారా? లేదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రెండు రోజులు ముందుకు జరపడంలో ఉన్న తొందర, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద లేదని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్..ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ ప్రసంగాన్ని విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం.. కానీ గవర్నర్‌తో అర్ధ సత్యాలు ప్రచారం చేయిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, ఆసరా పింఛన్‌దారులు, మహిళలు, వరి పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం నిరాశ మిగిల్చిందని అన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రజలకు ఎలాంటి విశ్వాసం కల్పించలేదని చెప్పారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని, మేనిఫెస్టోలోని అంశాలు, నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదని ధ్వజమెత్తారు. పవర్ ప్లాంట్లు, మూసీ నది పునరుద్ధరణ ప్రస్తావన లేదని అన్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతం ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ‘దావోస్’పై వైట్ పేపర్ విడుదల చేయండి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక మిగిలింది 40 రోజులేనని హరీశ్‌రావు అన్నారు. ఈలోగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడ అని నిలదీశారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల రైతుబంధు ఇస్తామన్న హామీ, వడ్లకు రూ.500 బోనస్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.500కు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని మాత్రమే చెప్పారని, తద్వారా మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేమని చెప్పకనే చెప్పారని అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారంటూ.. యాద్రాద్రి విద్యుత్ ప్లాంట్ చివరి దశలో ఉందని, దాన్ని పూర్తి చేస్తే కొంతమేర విద్యుత్ కొరత నుంచి గట్టెక్కవచ్చునని అన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన రూ.40 వేల కోట్ల పెట్టుబడులపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజూ ప్రజావాణి ఎక్కడా? ప్రతిరోజూ ప్రజావాణి నిర్వహిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఏమయ్యాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారని.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు, ఆ తర్వాత అధికారులు, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనిపై గవర్నర్‌తో కూడా అసత్యాలు చెప్పించారని అన్నారు. -
Ghmc: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్
సాక్షి,హైదరాబాద్: బోరబండ ప్రస్తుత కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి బాబా పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ పార్టీ కోసం 22 ఏళ్లు సైనికుడిగా పనిచేశా. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైంది’ అని లేఖలో బాబా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో బాబా కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఉన్న విభేదాల కారణంగానే బాబా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. ఇదీ చదవండి.. సీఎం రేవంత్ చిట్‌చాట్.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు -
సీఎం రేవంత్ చిట్‌చాట్.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత రేవంత్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అని, ఆయన ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవడంలేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి, బీఏసీకి కూడా రాలేదంటే కేసీఆర్ చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్షనేతగా ఆయన తన బాధ్యత నిర్వర్తించాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గది మార్పు నిర్ణయం స్పీకర్‌కు సంబంధించినదని చెప్పారు. బీఏసీ సమావేశానికి రాకుండా హరీశ్‌రావును తాము ఎందుకు అడ్డుకుంటామన్నారు. బీఏసీకి వచ్చేవారి జాబితాలో కేసీఆర్ కడియం శ్రీహరి పేరు ఇచ్చారన్నారు. హరీశ్‌రావుకు బీఏసీకి అనుమతివ్వాలో లేదో స్పీకర్ నిర్ణయిస్తారు. రేపు బీఏసీకి కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సెషన్లో రాష్ట్రంలో కులగణణపై తీర్మానం ఉంటుందని చెప్పారు. టీఎస్పీఎస్సీపై పూర్తి పప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు. మరిన్ని అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది అనుకుంటే స్పీకర్ సభను పొడిగించవచ్చన్నారు. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టులను అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కృష్ణా బేసిన్లో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. సీఎంగా తాను ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని రేవంత్ అన్నారు. ఇదీ చదవండి.. తెలంగాణలో బీజేపీది ఒంటరి పోరే -
‘తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి..’
హైదరాబాద్: రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈసారి 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈసారి అసుదుద్దీన్ ఓవైసీ ఓడిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక సర్వేలపై మాట్లాడుతూ.. సర్వేలల వస్తున్న ఫలితాలు నిజం కాదన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయన్నారు. ఇక మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్చేసుకుంటున్నారని, కాళేశ్వరం అవతకకలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ లేనిపోని రాద్దాంతం చేస్తోందని, కాళేశ్వరం అవకతవకలపై దృష్టి మళ్లించేందుకు ఈ నాటకమని కిషన్‌రెడ్డి విమర్శించారు.