breaking news
-
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి -
TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి
సాక్షి,మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఆరు గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప్ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం నిధులు సమకూర్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కర్ణాటకలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా... ఓవైసీ ,కేసీఆర్, రాహుల్ గాంధీ ఎంతమంది దిగొచ్చిన మోదీని అడ్డుకోలేరన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఉండదని మరోసారి స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్, కేసీఆర్ ఆవశ్యకత లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు ఎజెండా లేదు. ఆ పార్టీ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. అధికార దుర్వినియోగం, అహంకారం, అవినీతి వల్లే ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయం. దేశంలో తొమ్మిదిన్నరేళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. బీజేపీ విజయసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు -
రాజకీయాలకు రైతులను బలిచేయొద్దు
షాద్‌నగర్ (రంగారెడ్డి): రాజకీయాల కోసం రైతుల ను బలి చేయొద్దని, రుణమాఫీ చేయడంతోపాటు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. తెలంగాణ అమరవీరులకు ఒక్కనాడు పువ్వు పెట్టని, జై తెలంగాణ అనని, ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేసుకుంటే బాధేస్తోందని తెలిపా రు. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చినా..బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని మండిపడ్డారు. పాలమూరును 80 శాతం పూర్తి చేశాం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే 80శాతం పనులు పూర్తి చేశామని, కాల్వలు తవ్వితే పొలాలకు నీళ్లు వస్తాయని, ఈ పని పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని హరీశ్ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయని, జాతీయ హోదా సాధించడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి కేఆర్ఎంబీకి ప్రాజెక్టుకు అప్పగించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో 1984 నుంచి 2014 వరకు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ద్వారా రైతుకు సాగు నీరు అందించలేదని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 లక్షల ఎకరాలకు నీరందించిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదాపడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నియోజకవర్గ స్థాయి సమీక్ష, లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వాస్తవానికి గత నెల 27వ తేదీనే ఈ భేటీలను మొదలుపెట్టారు. ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ 40కిపైగా నియోజకవర్గాల్లో ముగిశాక.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదాపడ్డాయి. మంగళవారం నుంచి వాటిని పునః ప్రారంభించిన బీఆర్ఎస్.. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిపై సంబంధిత నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం జరిగిన షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. విదేశ పర్యటనలో ఉన్న కేటీఆర్ తిరిగొచ్చాక ఈ భేటీల్లో పాల్గొననున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు ముగిశాక.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్న నేపథ్యంలో.. ఆలోగానే కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు వివరించాయి. నియోజకవర్గ స్థాయిలోనూ పోస్ట్‌మార్టం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితిపై బీఆర్ ఎస్ పోస్ట్‌మార్టం మొదలుపెట్టింది. జనవరి 3 నుంచి 22వ తేదీ వరకు మూడు విడతల్లో 17 లోక్‌సభ సెగ్మెంట్లపై సుదీర్ఘంగా సమీక్షించిన పార్టీ ముఖ్యు లు.. నేతలు, కార్యకర్తల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ను నివేదికల రూపంలో కేసీఆర్‌కు అందజేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలతో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి భేటీలు జరపాలని నిర్ణయించింది. 40కి పైగా సెగ్మెంట్ల భేటీలు ముగిశాయి. వాయిదాపడిన మిగతా నియోజకవర్గాల సభలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా ఆదేశించారు. వ్యూహాలు, అభిప్రాయాలు స్వీకరించి.. ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సి న వ్యూహాలు, పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. ఈ భేటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడి యం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మె ల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్.రమణ తదితరులు పాల్గొననున్నారు. సమావేశాల్లో అందిన సూచన లు, అభిప్రాయాలను పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే సంస్థాగత కమిటీలు పార్టీకి 65 లక్షలకుపైగా క్రియాశీల, సాధారణ సభ్యత్వమున్నా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగినట్టు బీఆర్ఎస్ గుర్తించింది. పార్టీని అన్నిస్థాయిల్లో బలోపేతం చేసేందుకు సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడటంతో.. ఆ తర్వాతే సంస్థాగత కమిటీల ఏర్పా టు ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
రాజ్యసభకు ఆ ముగ్గురూ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రక టించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, వద్ది రాజు రవిచంద్ర మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. బుధవారం ధ్రువీకరణ పత్రం తీసుకుంటానని రేణుకా చౌదరి రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. భారీ ప్రదర్శనగా వచ్చిన అనిల్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేందుకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనిల్ వెంట ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కడం తన విజయం కాదని, తెలంగాణ యువజన కాంగ్రెస్ విజయమని వ్యాఖ్యానించారు. ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపి కాంగ్రెస్ అధిష్టానం బీసీలందరికీ తగిన గౌరవం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్న వద్దిరాజు రాజ్యసభకు 2022లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున తొలిసారిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మరోమారు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రెండోమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ గుప్తాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై పార్లమెంటులో గొంతెత్తుతానని వద్దిరాజు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాగా, ఈ నెల 8న రాష్ట్రం కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 15 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కాయి. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం.. పరిశీలన, విత్‌డ్రా గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్.. మోసకారి పార్టీలు!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, యాదాద్రి/ తాండూరు/ నిర్మల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజలను మోసం చేసే దొంగల పార్టీ లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ రెండూ అవినీతి, కుటుంబ పా ర్టీ లు అని, వాటితో ప్రజలకు అన్యాయమే జరుగుతుందని ఆరోపించారు. ఇన్నాళ్లూ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు సాధించే లక్ష్యంతో.. మంగళవారం ఒకేరోజున రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి బీజేపీ ‘విజయ సంకల్ప రథయాత్ర’లు మొదలయ్యాయి. అస్సాం, గోవా రాష్ట్రాల సీఎం హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బీఎల్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఆయా ప్రాంతాల్లోని ముఖ్యమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో పూజలు చేశాక.. రోడ్‌షోలు, మినీ సభలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఆయా ప్రాంతాల బీజేపీ సీనియర్ నేతలు వీటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు ప్రజలను, బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు..: కిషన్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో కృష్ణానది తీరాన దత్తాత్రేయుడు, కృష్ణమ్మ విగ్రహాలకు పూజలు చేసి బీజేపీ విజయ సంకల్పయాత్రను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. మక్తల్ బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం, నాయకుల దోపిడీ తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లూ కేసీఆర్ కుటుంబం దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్‌గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిమిత్తం సూట్‌కేసులు పంపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలపై ‘రాహుల్ ట్యాక్స్’ వేస్తున్న పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అదే కేంద్రంలో తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. కాగా.. 500ఏళ్ల హిందువుల కల రామమందిరాన్ని మోదీ సర్కారు సాకారం చేసిందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. అన్ని పా ర్టీ లు తమ కుటుంబ సభ్యులను అందలం ఎక్కించాలని చూస్తుంటే.. ప్రధాని మోదీ సర్కారు ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలే..: హిమంత బిశ్వశర్మ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ అబద్ధాలేనని.. రాహుల్‌గాంధీ రాజకీయాల్లో అబద్ధాలు తప్ప ఏదీ నేర్చుకోలేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని, ఎవరితోనూ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను హిమంత బిశ్వశర్మ ప్రారంభించారు. అనంతరం భైంసాలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎనిమిది మంది అయ్యారని.. రానున్న రోజుల్లో 80మందితో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి తెలుగు అంటే ఇష్టమని, తెలంగాణవాడైన మాజీ ప్రధాని పీవీకి భారతరత్నతో గౌరవించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, ఎంపీ సోయం బాçపూరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పది ఎంపీ సీట్లు బీజేపీకే: ప్రమోద్ సావంత్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పది ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ఆయన యాదాద్రి జిల్లా భువనగిరిలో విజయ సంకల్ప యాత్రను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అవన్నీ తమ కుటుంబానికే ఇచ్చుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధపు గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచి్చందని ఆరోపించారు. కాగా.. దేశంలో ప్రధాని మోదీ శకం నడుస్తోందని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భువనగిరి కోట కేంద్రబిందువని.. ఇక్కడ బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అంటేనే డేంజర్: బండి సంజయ్ కేసీఆర్ అంటేనే డేంజర్ అని, ఆయన వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని కాలం వెళ్లదీయాల ని చూస్తోందని మండిపడ్డారు. మంగళవారం తాండూరులో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంజయ్ కలసి విజయ సంకల్పయాత్రను ప్రారంభించారు. తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరగడంతోనే.. కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని, బీజేపీతో పొత్తు అంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు కొంపలు ముంచడం ఒక్కటే పని అని, మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఎవరి కొంప ముంచుతారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మూడో సారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అంతా అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. -
కమలం.. సర్వేలే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల లో అభ్యర్థుల ఎంపికకు వివిధ అంశాల ప్రాతిపదికన నిర్వహిస్తున్న సర్వేలనే బీజేపీ జాతీయనాయకత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. రాష్ట్రంలో ని పలు సీట్లకు లెక్కకు మించి అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో సర్వేల్లో వెల్లడయ్యే ప్రజాభిప్రాయం ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక చేపట్టాల ని నిర్ణయించిందని తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల్లో పరిస్థితులు, బీజేపీ బలం, వివిధ వర్గాల ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సానుకూలత, పార్టీబలానికి తోడు అభ్యర్థుల బలాబలాలు తదిత ర అంశాల ప్రాతిపదికగా వివిధ సర్వేలు నిర్వహిస్తున్నారు. కాగా, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి, అమిత్‌షా కనుసన్నల్లో మరో సర్వే సాగుతున్న ట్టు విశ్వసనీయ సమాచారం. సదరు సర్వే ఫలితా లను కేవలం ఆయనకే సమర్పిస్తారని తెలుస్తోంది. నెలాఖరుకల్లా సగం మంది అభ్యర్థుల పేర్లు ఖరారు వచ్చే నెల మొదటివారం లేదా పదో తేదీలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చుననే అంచనా ల నేపథ్యంలో... ఈ నెలాఖరు కల్లా రాష్ట్రంలోని సగం స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకా శాలున్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటూ తాజాగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఒకవేళ ఆయన అన్నట్టుగానే సిట్టింగ్ ఎంపీ లు వస్తే వారి బలాబలాలను కూడా పరిగణనలోకి తీసుకుని కచ్చితంగా గెలిచే అవకాశాలున్న వారికి టికెట్లు కేటాయిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాలపై స్పష్టత! రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో.. సిట్టింగ్ సీట్లలో సికింద్రాబాద్– కిషన్‌రెడ్డి, నిజామాబాద్– అర్వింద్ ధర్మపురి, కరీంనగర్–బండి సంజయ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా ఆదిలాబాద్–సోయం బాపూరావు లేదా మరో అభ్యర్థికి ఇవ్వొచ్చుననే ప్రచారం జరుగుతోంది ఆ సీట్ల నుంచి సీనియర్లు మల్కాజిగిరి ఎంపీ సీటుకు అత్యధికంగా పది మందికి పైగానే పోటీపడుతున్నారు. వారిలో ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, ఎన్.రామచంద్రరా వు, చాడ సురే‹Ùరెడ్డి కూడా ఉన్నారు. ఆ తర్వాత జహీరాబాద్ సీటుకు కూడా పోటీ భారీగానే ఉంది. ఇక్కడి నుంచి ఓ బీసీ నాయకుడిని పోటీకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోటీ చేయించే అవకాశముందని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ సీటు విషయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీలో ముందు వరసలో ఉన్నట్టుగా పార్టీనేతలు చెబుతున్నారు. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్రెడ్డికే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌కు సైతం పోటీనే పెద్దగా గెలిచే అవకాశాలు లేకపోయినా హైదరా బాద్ లోక్‌సభ స్థానానికి కూడా పలువురు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పోటీచేసిన భగవంతరావు, ఇంకా పార్టీలో చేరని మాధవీలత, ఇతర నాయకులు హైదరాబాద్ సీటును ఆశిస్తున్నారు. కాగా, హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ను పోటీకి దింపాలనే యోచనలో కూడా నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్, భువనగిరి సీట్లలో పార్టీకి బాగా సానుకూలత ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇక వరంగల్, నల్లగొండ, మెదక్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ సీట్లలో ఇంకా పార్టీపరంగా మరింత బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 24 లేదా మార్చి 2న రాష్ట్రానికి అమిత్ షా! బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 24, 25 తేదీల్లో.. లేదంటే మార్చి 2న రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై అమిత్‌షా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...పార్టీపరంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పార్టీకి ఆయన ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే...అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తార ని చెబుతున్నారు, మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించడంతోపాటు పార్టీపరంగా నిర్వహిస్తున్న విజయసంకల్ప రథయాత్రల్లో పాల్గొంటారని తెలుస్తోంది. -
రాజాసింగ్ అలక!.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే అలకబూనినట్లు ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయ సంకల్ప యాత్ర రథాలకు భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరుకాని రాజాసింగ్.. నేడు భువనగిరి సభకు కూడా రాలేదు. బీజేఎల్పీ టీంలోనూ రాజాసింగ్‌కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు సమాచారం. దీంతో పార్టీకి, రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కాగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ ఇటీవల రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: ‘బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ -
TS: మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాల్లోని అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం వెల్లడించారు. తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలుకు గాను.. మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఇక.. రేణుకా చౌదరి రేపు(బుధవారం) గెలుపు ధృవ పత్రాలను అందుకోనున్నట్లు తెలుస్తోంది. -
విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన కిషన్‌రెడ్డి
సాక్షి,నారాయణపేట: మక్తల్‌లో కృష్ణా నది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం నారాయణపేటకు బయలుదేరే ముందు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీకి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. పదేళ్ళలో కేంద్రం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ‘గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం. కంటి వైద్యం కోసమో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసమో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు ఉంది. బీఆర్ఎస్తో మాకు పొత్తు ప్రసక్తే లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తప్ప రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలు క్లస్టర్ల వారిగా ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. హస్తినలో సీఎం రేవంత్ -
మాది ఒంటరి పోరే: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే ఉత్పన్నం కాదని, బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తేలి్చచెప్పారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు పోటీచేసి మెజారిటీ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న బీజేపీ మునిగిపోయే నావ వంటి బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి రాదని స్పష్టం చేశారు. గతంలో కూడా తామెప్పుడూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రచారాన్ని కొందరు దుర్మార్గులు పనిగట్టుకుని కుట్రపూరితంగా చేస్తున్నారని, మెడకాయ మీద తలకాయ లేనివాళ్లు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించొద్దని ఆయన కోరారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఉందని ఎవరైనా మాట్లాడితే వారి రెండు చెంపలు గట్టిగా వాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 20 (మంగళవారం) నుంచి రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో మొత్తం 5,500 కి.మీ మేర పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విజయసంకల్పయాత్ర’పోస్టర్‌ను, యాత్ర షెడ్యూల్‌ను కిషన్‌రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అదేవిధంగా యాత్ర పాటను, స్టిక్కర్లు, కరపత్రాలను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నోటిఫికేషన్ వచ్చేలోగానే యాత్రలు పూర్తి... పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగానే ఈ యాత్రలను పూర్తిచేస్తామని తెలిపారు. 20వ తేదీ నుంచి నాలుగుయాత్రలు సమాంతరంగా మొదలవుతాయని, మేడారం జాతర కారణంగా వరంగల్ వైపు సాగే యాత్ర మాత్రం కొన్నిరోజుల ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ యాత్రల్లో భాగంగా... రైతులు, చేతివృత్తులవారు, నిరుద్యోగులు, పొదుపుసంఘాల మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబు, నేతలు ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, డా.కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఐదుయాత్రలు ఇలా... 1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర...బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుంచి ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు 21 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ దీనిని ప్రారంభిస్తారు. ఎంపీ డా. కె.లక్ష్మణ్, ఆరుగురు శాసనసభ్యులు భైంసా యాత్రలో పాల్గొంటారు. 2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర...కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తారు. ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు. 3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర... భువనగిరిలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రాజా సింగ్, వెంకటరమణా రెడ్డి పాల్గొంటారు. 4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర...సమ్మక్క సారక్క జాతర కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,015 కి.మీ మేర 7 రోజుల పాటు 21 నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ యాత్ర ఉంటుంది. 5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర...మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసిన తర్వాత ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,440 కి.మీ మేర యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొంటారు. భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద యాత్ర రథాలకు కిషన్‌రెడ్డి పూజలు చార్మినార్: విజయ్ సంకల్ప యాత్ర రథాలకు సోమవారం కిషన్‌రెడ్డి.. ఈటెల రాజేందర్‌తో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు, గుమ్మడి కాయలు కొట్టి ప్రారంభించారు. భారత్ మాతాకీ జై..నరేంద్ర మోదీకి జై..అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
హస్తినలో సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. సీఎం రేవంత్ తదితరులు ఏఐసీసీ కీలక నేత రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా కలిసి రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సాయంపై వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మూడు కీలకాంశాలపై చర్చ ఉంటుందా? సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి ఢిల్లీ బయలుదేరడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురూ పార్టీ హైకమాండ్‌ను కలిసి మూడు కీలకాంశాలపై చర్చించే అవకాశముందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంతో పాటు నామినేటెడ్ పోస్టుల గురించి హైకమాండ్‌తో చర్చించిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు కీలకమైన కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం. అయితే, కేబినెట్ విస్తరణ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉంటుందా? ఇప్పుడే ఉంటుందా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ (లంబాడా), బీసీ, మైనార్టీలకు కేబినెట్లో బెర్తులు దక్కాల్సి ఉంది. ఈ బెర్తులను భర్తీ చేసి పార్లమెంటు ఎన్నికలకు వెళితే ఉపయోగం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే, మరో మూడు బెర్తులకు పోటీ తీవ్రంగా ఉన్నందున ఇప్పుడే కాకుండా లోక్‌సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ మాత్రం మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారని, ఒకవేళ ఈ పర్యటనలో హైకమాండ్‌తో ఈ విషయం గురించి చర్చ జరిగి, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే త్వరలోనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, లేదంటే పార్లమెంటు ఎన్నికల వరకు ఆగాల్సిందేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి అవకాశంపై చర్చ? లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఓ అభిప్రాయానికి వస్తున్నట్టు అర్థమవుతోంది. హైదరాబాద్ (మైనార్టీ), కరీంనగర్ మినహా 15 స్థానాల్లో పోటీకి ఎవరిని దింపాలన్న దానిపై షార్ట్ లిస్ట్ రెడీ అయిందని, ఈ జాబితాను ఇప్పటికే హైకమాండ్‌కు పంపారని, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అనంతరం పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలోకి ఇటీవలి కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూనే తిరుగుతున్నాయి. బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), నీలం మధు (మెదక్), పట్నం సునీతారెడ్డి (చేవెళ్ల), వెంకటేశ్ నేతకాని (పెద్దపల్లి), కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజ్గిరి), తాటికొండ రాజయ్య (వరంగల్)కు లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత వచ్చిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం స్థానాల్లో పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయంలో అనుసరించనున్న మార్గదర్శకాలపై కూడా సీఎం, డిప్యూటీ సీఎం, శ్రీధర్‌బాబు చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం. నామినేటెడ్ ‘నారాజ్’.... పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం లేదనే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నా ఈ పదవులను పంపిణీ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎదురుచూస్తున్నారు. తొలుత 9 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారనే చర్చ జరగ్గా, ఆ తర్వాత ఆ సంఖ్య 18కి చేరింది. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ పదవుల పంపకాలుంటాయని ఓసారి, ఎన్నికల తర్వాతే ఉంటాయని మరోసారి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అడపాదడపా కొందరికి నామినేటెడ్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే (పార్లమెంటు ఎన్నికలకు ముందే) అంశంపై కూడా ఈ పర్యటనలోనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని టీపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలతో పాటు దివ్యాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా ఉన్న జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీకి రాసిన లేఖలను కవిత సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టీకల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జీవో 41, 56లను జారీ చేసిందన్నారు. పాత విధానం ప్రకారం మహిళలకు కచ్చితంగా 33 శాతం ఉద్యోగాలతో పాటు అదనంగా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉండేందన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ విధానంతో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. -
కోడ్ కూయక ముందే.. మోదీ టూరు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగానే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేయాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనే అంచనాల మధ్య పెద్దఎత్తున ముందస్తు ప్రచారానికి కమలదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నెలాఖరులోగా లేదంటే మార్చి మొదటివారంలోగా రెండు, మూడు పర్యాయాలు మోదీ రాష్ట్రానికి వస్తారని చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా ప్రధానితోనే ప్రారంభించినట్టు అవుతుందని బీజేపీ నాయకులు అంచనావేస్తున్నారు. మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే గత అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో, 3న నిజామాబాద్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, తెలంగాణలో పసుపుబోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పంథాలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేలోగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ కూడా అమల్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ద్వారా రాష్ట్రంలో వివిధ రూపాల్లో చేపట్టనున్న ఎన్టీపీసీ, రోడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్‌లో బహిరంగసభ? ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అక్కడే విడిగా ఏర్పాటు చేసే బహిరంగసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా... ములుగులో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ఏర్పాటుకు శంకుస్థాపనలు, తెలంగాణకు మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి ప్రయోజనం చేకూరేలా చేపట్టనున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఇక చర్లపల్లిలో రైల్వే టెరి్మనల్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ మైలేజీని సాధించే దిశలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. -
‘లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారు? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. తాము కిషన్‌రెడ్డితో ఏమైనా.. ఎప్పుడైనా పొత్తుల గురించి ఉసెత్తమా? అని అన్నారు. సోమవారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు. బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ. .. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ ఛానెల్‌లు, మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్యలు కనిపించడం లేదా?. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారు’ అని బాల్క సుమన్ విమర్శలు చేశారు. -
త్వరలో ఢిల్లీకి కెసిఆర్.. ఏం చేయబోతున్నారు?
BRS అధ్యక్షుడు KCR మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కెసిఆర్ చేస్తున్న మొదటిసారి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఅర్ఎస్, బిజెపి ల మద్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగినా.. పొత్తు అవకాశాలను రెండు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కెసిఆర్‌తో పాటు BRS పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తుల్లేవు.. గిత్తుల్లేవు.! ఢిల్లీలో కెసిఆర్ రాజకీయ చర్చల కోసం వస్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. "మేము కిషన్ రెడ్డి తో ఏమైనా ఎప్పుడైనా పొత్తుల గురించి ఊసెత్తమా? బండి సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు? బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కెసిఆర్ ఒక సెక్యులర్ నాయకుడు. ఇలాంటి వార్తలకు లీకులు ఇచ్చేది బీజేపీనే. అలాగే వార్తలు రాయించేది బీజేపీ." అన్నారు బాల్క సుమన్. పొత్తు ఊహగానాలకు అవకాశమిచ్చిందెవరు? సాధారణంగా బీఆర్ఎస్, బీజేపీ నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. దానికి కొనసాగింపుగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. అలాగే ఎంపీ బండి సంజయ్ కూడా ఇదే అంశంపై ప్రకటన చేశాడు. ఇటీవల మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేదు" అన్నారు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలుపై మల్లారెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ ఏమన్నాడంటే.. "ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు" అని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? మొత్తం 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30, 2023న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64, దాని మిత్రపక్షం సిపిఐకి 1, బీఆర్ఎస్కు 39 సీట్లు రాగా, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు నెలల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ సారి పార్లమెంటు ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణంలో మార్పులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
Telangana: రేపట్నుంచి బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. రేపట్నుంచి(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప రథయాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర గురించి వివరాలు వెల్లడించారు. ‘రేపటి నుంచి విజయ సంకల్ప రథ యాత్ర ప్రారంభం కానుంది. రేపు నాలుగు యాత్రలు ప్రారంభం కానున్నాయి .కోమరంభీం యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రం ప్రారంభం అవుతుంది. రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్ర కరీం నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నాలుగు పార్లమెంట్ స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనుంది. ఇందులో 22 అసెంబ్లీలు కవర్ చేయనుంది. మిగిలిన నియోజక వర్గాలను సైతం కవర్ చేసేందుకు కృషి చేస్తాం. భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో ప్రారంభం అవుతుంది. భువనగిరి , మల్కాజ్గిరి హైదరాబాద్ , సికింద్రాబాద్ కవర్ చేస్తూ.. యాత్ర కొనసాగనుంది కృష్ణ విజయ సంకల్ప యాత్ర మక్తల్ లో కృష్ణ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కవర్ చేస్తూయాత్ర కొనసాగనుంది. కొమరం భీం యాత్రనుఅస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ప్రారంభిస్తారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూర్‌లో ప్రారంభం కానుంది. దీనికి కేంద్రమంత్రి బీఎల్ వర్మ హాజరుకానున్నారు. భాగ్యలక్ష్మీ యాత్రకి గోవా సీఎం ప్రమోద సావంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కృష్ణ యాత్రకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరవుతారు. యాత్రలో రోడ్ షో లు ఎక్కువ ఉంటాయి. ఐదు యాత్రలు కలిపి 5500 కి.మీలు కవర్ కానుంది. 114 అసెంబ్లీ కవర్ అయ్యేలా కవర్ యాత్ర ఉండనుంది. 106 రోడ్ షో లు ఉండనున్నాయి’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
బీఆర్ఎస్తో పొత్తు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్‌రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు. అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు. ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు -
సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఫిబ్రవరి 10న కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ తుంగులో తొక్కుతుందని, ఈ అంశంపై జాతీయ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చదవండి: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంనది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. అందరి దృష్టి ఆ సీటుపైనే -
ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ..! ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే.. వాటిని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని అంటున్నారాయన. తాజా.. పరిణామాలపై సాక్షి టీవీతో తాజాగా ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ‘‘నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటా. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తా’’ అని తనలోని ఆసక్తిని బయటపెట్టారాయన. ఇదీ చదవండి: అందరి దృష్టి ఆ సీటుపైనే రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్ నుంచి నెగ్గి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో.. అంతకు ముందు ఆయన ఎంపీగా చేసిన మల్కాజ్గిరి ఖాళీ అయ్యింది. ఈలోపే సార్వత్రిక ఎన్నికలకు పెద్దసమయం లేకపోవడంతో మల్కాజ్గిరి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరం లేకుండా పోయింది. మరోవైపు ఈ నియోజకవర్గంపై ఇప్పటికే అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలెందరి కన్ను వేశారు. మాజీ మంత్రి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి కాంగ్రెస్ దరఖాస్తుల్లోనూ.. ఈ స్థానానికే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. ఆశావహుల్లో.. రేవంత్‌రెడ్డి సన్నిహితులతో పాటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఉన్నారు. -
Malkajgiri Lok Sabha: అందరి దృష్టి ఆ సీటుపైనే
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి. ఇప్పుడు దానిపైనే అందరి గురి. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ తమదే అధికారమని చెబుతున్న బీజేపీ నేతలు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్.. రాష్ట్రంలో గెలుపుతోనే తమ లక్ష్యం పూర్తి కాలేదని లోక్‌సభలోనూ బలం చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. అన్ని పారీ్టలకూ హాట్ సీట్ అన్ని పారీ్టలూ వేటికవి మల్కాజిగిరిలో గెలుపుతో బలం చాటుకోవాలని ఆరాటపడుతున్నాయి. టికెట్ కోసం మాత్రం కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న వారితో పాటు కొత్తగా చేరుతున్న వారు సైతం దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం హామీలిస్తుందో లేదో కానీ ఎవరికి వారుగా ఈ సీటును దక్కించుకోవాలనే తలంపుతోనే ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే రేవంత్‌రెడ్డి అటు పీసీసీ అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి కావడంతో సెంటిమెంట్ పరంగానూ భారీ డిమాండ్ ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహించే రేవంత్ వారసుడెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందరెందరో.. మల్కాజిగిరి లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, బొంతు రామ్మోహన్, సింగిరెడ్డి హరివర్ధ¯న్రెడ్డిలతో పాటు ఇంకా కాంగ్రెస్‌లో చేరనివారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు మామ కావడంతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో చంద్రశేఖరరెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన భువనగిరి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న చోట కాకుండా మహేశ్వరం టికెట్ ఇవ్వడంతో ఓటమిపాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈసారి ఎంపీ సీటు కోసం ప్రయతి్నస్తున్నట్లు వినికిడి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి ఎంటీ టికెట్ కోసం ప్రయతి్నస్తున్నట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త, బీఆర్ఎస్ నేత మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణలు సైతం మల్కాజిగిరి టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి ఇటు.. ప్రముఖ వ్యాపారి, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేకు కూడా కాంగ్రెసే ఆఫర్ ఇచి్చనట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్ను వీడి వస్తే ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం పార్టీ మారి తిరిగి ఎంపీగా పోటీకి సిద్ధమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏయే పారీ్టల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారో.. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపీ టిక్కెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే! -
రేపటి నుంచే బీజేపీ రథయాత్రలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి బీజేపీ సిద్ధమైంది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ నెల 20 నుంచి నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలు మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలకు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్‌తోపాటు ముఖ్యనేతలు ఈటల రాజేందర్, డీకే.అరుణ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఐదో రథయాత్ర మాత్రం ఈ నెల 25న మొదలవుతుంది. హైదరాబాద్‌ను మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన విషయం తెలిసిందే. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లకు చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. కిషన్‌రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయపార్టీ ముఖ్యనేతలు యాత్రల్లో పాల్గొంటారు. ఐదు యాత్రలు ఇలా... ► భాగ్యలక్ష్మి క్లస్టర్: ఈ నెల 20న భువనగిరిలో ప్రారంభమై, 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్‌లో ముగిస్తుంది. ► కొమురం భీం క్లస్టర్: ఈ నెల 20వ తేదీనే ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్‌లో ప్రారంభవుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరవుతున్నారు. అదే రోజు బహిరంగసభ కూడా ఉంటుంది. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది ►రాజరాజేశ్వరి క్లస్టర్: వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 20న ప్రారంభమయ్యే యాత్ర ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ యాత్ర 4 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కరీంనగర్లో ముగుస్తుంది. ►కృష్ణమ్మ క్లస్టర్ : నారాయణపేట జిల్లా మక్తల్‌లో 20వ తేదీనే ఈ యాత్ర మొదలై 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది ►కాకతీయ–భద్రకాళి యాత్ర : ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని సీట్లలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ములుగులో ముగుస్తుంది. -
Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు? సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ?? దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు ఈ ఎన్నికలు చాలా కీలకం పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం -
వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్
సాక్షి, హైదరాబాద్: ‘మీరు అధికారంలో ఉన్నారు. మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరపండి. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. మేము తప్పు చేయలేదు. భయపడేది లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నమే తప్ప, రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని చేస్తున్న యత్నాన్ని విరమించుకొని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో చేసిన మంచి పనులు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తే అంతిమంగా ప్రజలే నష్టపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరమంటూ అది ‘వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్’ అని ఎద్దేవా చేశారు. మిడ్‌మానేరు జలాశయం నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో పూర్తైందని రుజువు చేస్తే రాజీనామా చేసి మళ్లీ సభలో అడుగుపెట్టనని సవాల్ చేశారు. శనివారం శాసనసభలో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... సీడబ్ల్యూసీ సూచనల మేరకే... ‘కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ఏడేళ్లలో కనీస అనుమతులు తీసుకురాలేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టుకు అనుమతి రాలేదు. దీనికోసం 2014 వరకు రూ.6,116 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ సీఎంకు ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, చేసే ఖర్చు వృథా అవుతుందని లేఖ రాశారు. అయినా పట్టించుకోలేదు. ఆ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అనుమతుల కోసం యత్నించినా, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, జలాశయాల సామర్థ్యం సరిపోదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు తక్కువ వచ్చిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మీరు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారమే కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు వచ్చింది. కాళేశ్వరం ద్వారా నిండిన చెరువులు, కుంటలు, స్టేజ్–1, స్టేజ్–2లలో జరిగిన స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చాం. ఏ ప్రాజెక్టుకైనా ప్రారంభించిన వెంటనే కొత్త ఆయకట్టు రాదు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ఎడమకాలువ, దేవాదుల, కల్వకుర్తి మొదలైనప్పుడు అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇదే. శ్వేతపత్రంలో అబద్ధాలనే పొందుపరిచారు. మిడ్ మానేర్‌కు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేమొచ్చాక రూ.775 కోట్లు ఇచ్చాం. మేమే పూర్తి చేసి నీళ్లిచ్చాం. రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారు... అది తప్పు. కేఆర్ఎంబీకి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదని చెప్పడం కూడా తప్పే. మేము దీన్ని వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్‌కు రిఫర్ చేయాలని చెప్పాం. కేఅర్ఎంబీకి అప్పగించింది మేం కాదు. మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్లివ్వండి మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించకుండా సాగదీస్తున్నారు. మొత్తం కూలిపోతే రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అనుమానం వస్తోంది. వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణ పనులు చేయాలి. పదేళ్లలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం. 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం. ప్రాజెక్టుల అంచనాలు పెరగడం కొత్త కాదు. కాళేశ్వరం ఒక్కటే పెరగలేదు. నాగార్జున సాగర్ అంచనా 9.7 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల అంచనాలు పెరిగాయి. కృష్ణా నుంచి 299 టీఎంసీలు కాదు, 600 టీఎంసీలకు పైగా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. టీవీలో నా ముఖం చూపించడం లేదట.. శ్వేతపత్రంపై చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అడ్డుతగిలారు. దీంతో హరీశ్‌రావు పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ ‘నేను శ్వేతపత్రంపై వివరణ ఇవ్వాలో లేదా మంత్రులు మాట్లాడే మాటలకు వివరణ ఇవ్వాలో తెలియట్లేదు?’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన స్పీకర్‌నుద్దేశించి ‘నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే టీవీలో నా మొహం చూపిస్తలేరంట. ఇప్పుడే మా ఆవిడ ఇంట్లో టీవీ చూసి కాల్ చేస్తే.. మా పీఏ కాగితం పంపించాడు. గొంతు వినిపిస్తోందట కానీ నా ముఖం బదులు స్పీకర్ లేదా సీఎంను చూపిస్తున్నారట. నా ముఖం కూడా చూపించండి’ అని అన్నారు. దానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ ‘మీరు సీనియర్ సభ్యులు. అలా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే వారినే చూపిస్తారు’ అని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబుతో హరీశ్ భేటీ... భోజన విరామ సమయంలో లాబీల్లోని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు గదికి హరీశ్‌రావు వచ్చారు. అప్పుడు శ్రీధర్ గదిలో లేకపోవడంతో వెనక్కు తిరిగారు. అంతలోనే లాబీల్లో శ్రీధర్‌బాబు ఎదురుపడి హరీశ్‌ను తన వెంట తీసుకెళ్లారు. శ్వేతపత్రంపై చర్చ ఎంత సేపు జరగనుంది, సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై మాట్లాడతారా అన్న విషయాల గురించి హరీశ్ అడిగినట్టు తెలిసింది. నీటిపారుదల ప్రాజెక్టులపై చాలా మంది సభ్యులు మాట్లాడతామని కోరుతున్నారని, వారందరికీ అవకాశం కల్పిస్తామని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టింది స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టిందని, దీనిపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమల్ని ఇరికించబోయి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుందని, నాలుగు ఎంపీ సీట్లలో గెలుపు కోసం దీన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన అన్న విషయాన్ని గుర్తుచేశామని, ఇదే కాగ్ తమను ఎన్నోసార్లు మెచ్చుకుందని చెప్పారు.