breaking news
-
Delhi Liquor Case: కవితకు జైలా? బెయిలా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ శనివారంతో ముగియనుంది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం ఉంది. కాగా గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం(మార్చి 15) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. చదవండి: Liquor Scam: కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ జూలై 7, 2023 రోజున మాగుంట శ్రీనివాసులు రెడ్డి విచారణలో కీలక విషయాలు రాబట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినప్పుడు కేసు పూర్వపరాలన్నీ పూసగుచ్చినట్టు వెల్లడించారని తెలిపింది. "2021 మార్చిలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లలో ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి చదివాను. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూశాను. అప్పటి వరకు ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చూశాను. మా కుటుంబం 71 సంవత్సరాలుగా లిక్కర్ బిజినెస్‌లో ఉంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయితే మరిన్ని లాభాలు ఉంటాయనిపించింది. ఇదే పని మీద ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మార్చి 16, 2021న సాయంత్రం 4.30గంటలకు కలిశాను. కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో వ్యాపారానికి ముందుకు రావాలని కోరారు. మీరు కవితను కలవాలని సూచించారు. ఈ విషయం ఇప్పటికే కవితతో చర్చించామని, ఆమ్ అద్మీ పార్టీకి వంద కోట్ల రుపాయలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ సూచన మేరకు హైదరాబాద్‌లో మార్చి 19, 2021న కవితను కలిశాను. ఈ డీల్ వంద కోట్ల రూపాయలకు సంబంధించనదని, ఇందులో మీ వాటా ఏంటని అడిగారు. రూ.50 కోట్లు ఇవ్వమని అడిగారు. నేను రూ. 30 కోట్లు ఇస్తానని అంగీకరించాను. కవిత ఆడిటర్ బుచ్చిబాబును మా అబ్బాయి రాఘవ కలిసి 25 కోట్ల రూపాయల నగదు ఇచ్చారు. ఈ డబ్బును బోయిన్పల్లి అభిషేక్‌కు కవిత సూచనల మేరకు ఇచ్చాం." -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్‌సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
కవిత అరెస్టు కక్ష సాధింపే: బీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి,ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్‌గా బయటపడతామని చెప్పారు. ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అలంపూర్( జోగులాంబ గద్వాల) బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్.ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, దానికి లభించిన ఆమోదం తదితర ఆధారాలు సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌కు మూడు నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న విజయుడు(ఫైల్ ఫొటో) వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ విజయుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సైతం ప్రసన్నకుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసినా, ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే. విజయుడు బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 2023 శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై 30,573 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
నేను ఎవరితోనూ టచ్‌లోకి వెళ్లలేదు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కావాలని తానేమీ కోరుకోవడం లేదన్నారు. తాను బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ప్రధాన మంత్రిని కలిసినంత మాత్రాన పొల్యూట్ అయినట్టు కాదన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని చెప్పారు. గురువారం మంత్రి పొంగులేటి హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పొంగులేటి సీఎం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మీడియా ప్రస్తావించగా.. అంతా అవాస్తవన్నారు. ‘‘పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడతాయి. నా వద్ద పళ్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రచారం జరుగుతోంది. నేను సీఎం వెంట ఉన్నంత మాత్రాన కేబినెట్లో నంబర్ 2 ఎలా అవుతాను. సీఎం కావాలని నేను అనుకున్నా పార్టీ అధిష్టానం అన్నిరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కదా..’’అని పేర్కొన్నారు. ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయబోం.. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్ చేయదని భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒకట్రెండు సీట్లు గెలిస్తే గొప్పేనన్నారు. కాంగ్రెస్‌లోకి ఎవరినీ ఆహా్వనించలేదని, వారంతట వారే వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్పై కేసులతో కక్షసాధింపు అన్న ఆరోపణలు సరికాదని.. గత ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడేనాటికే వానాకాలం ముగిసిందని.. కానీ జలాశయాల్లో నీళ్లు లేకపోవడం, పంటలు ఎండిపోవడం విషయంలో తమ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. జీతాల చెల్లింపులో కొంత ఆలస్యం వాస్తవమేనని, దానిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్య క్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రజల స్పందన, ప్రభుత్వ వ్యతిరేకత, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పలువురు నేతలు పార్టీని వీడటం ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తుండగా, పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అధినేత భరోసా ఇస్తున్నారు. జిల్లాల వారీగా భేటీలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో పాటు జిల్లాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మెదక్, భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. నాగర్‌కర్నూలు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేరు ఖరారు కాగా హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థి బరిలోకి దిగుతారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు తెరమీదకు రాగా, దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తోంది. సోమవారం హోలీ పండుగ తర్వాత బీఆర్ఎస్ తుది జాబితా వెలువడే అవకాశముంది. మంచి ఫలితాలు ఖాయం! మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, ముధోల్‌లో వేణుగోపాలచారి, హుజూర్‌నగర్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు ఎన్నికల సన్నాహాలను సమన్వయం చేస్తున్నారు. కింది స్థాయిలో స్థానికంగా చురుగ్గా ఉన్న కేడర్‌కు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు జిల్లాల వారీగా ఫోన్ల ద్వారా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ సర్వే ఏజెన్సీల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు ఆయనను కలిసిన నేతలు చెప్తున్నారు. మెదక్‌లో హరీశ్ పోటీ చేస్తారనే ప్రచారం మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ లోకక్భ బరిలో ఉంటారని సామాజిక మాధ్యమాల్లో గురువారం విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని, అలాంటి చర్చ పార్టీలో జరగడం లేదని హరీశ్ స్పష్టత ఇచ్చారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తారంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌తో సుదీర్ఘ భేటీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో ఈ నెల 16న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న హరీశ్ గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కవిత విచారణ సహా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వివరించడంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ శనివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. -
చేయందుకున్న వారికి చాన్స్.. ఐదుగురితో కాంగ్రెస్ రెండో జాబితా
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే మరో ఐదుగురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి బరిలో ఉంటారని తెలిపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఆమోదించిన జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి విడుదల చేశారు. తాజాగా ప్రకటించిన ఐదుగురిలో మల్లు రవి మినహా మిగతా నలుగురు కొత్తగా కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇంకా ఆ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. గడ్డం వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేకానంద బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. రెండో జాబితాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలకు, ఒక బీసీకి, ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించింది. తొలి జాబితాతో కలిపి మొత్తం నలుగురు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక ఎస్టీ, ఇద్దరు ఎస్సీ నేతలకు కాంగ్రెస్ చాన్స్ ఇచ్చినట్టయింది. తొలి జాబితాలో నలుగురి ప్రకటన కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ స్థానాలపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో చర్చ జరగలేదు. ఇక భువనగిరి, ఖమ్మం, మెదక్ స్థానాల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు ఆదిలాబాద్ ఖరారైందనుకున్నా, చివరకు అక్కడ అభ్యర్థిని మార్చాలని భావించారు. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన మరో సీఈసీ భేటీకి వాయిదా పడింది. దీంతో ఈ నెల 25 (హోలీ) తర్వాతే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 8 సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులు.. వంశీచంద్ రెడ్డి (మహబూబ్‌నగర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), రఘువీర్ రెడ్డి (నల్లగొండ), సురేష్ షెట్కార్ (జహీరాబాద్) పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమ్మంపై మున్షీ భేటీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఖమ్మం టికెట్‌కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఈ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ గురువారం ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (మధిర), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), మట్టా రాగమయి (సత్తుపల్లి), రాందాస్‌నాయక్ (వైరా), జారె ఆదినారాయణ (అశ్వారావుపేట) భేటీలో పాల్గొన్నారు. వీరితో ఉమ్మడిగా, విడివిడిగా సమావేశమైన మున్షీ ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీచర్ ఆత్రం సుగుణ ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సుగుణ బుధవారమే తన ఉద్యోగానికి సుగుణ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టేనని అంటున్నారు. అయితే రిమ్స్‌లో వైద్యురాలిగా ఉన్న సుమలత కూడా ఇటీవల సీఎంను కలిశారు. ఆమె కూడా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించారు. ఆమె పేరు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. కానీ తాజాగా ఆత్రం సుగుణ పేరు తెరపైకి వచ్చింది. రెండు మాలలకా? మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో రెండు మాలలకు ఇవ్వడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగర్‌కర్నూల్ (మల్లు రవి), పెద్దపల్లి (గడ్డం వంశీ) రెండు స్థానాలను మాలలకే ఎలా ఇస్తారని మాదిగ సామాజిక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మెదక్ స్థానానికి మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నీలం మధు ముదిరాజ్‌కు ఖరారు కాని పక్షంలో త్రిష పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి, కరీంనగర్లో ప్రవీణ్‌రెడ్డి, హైదరాబాద్‌లో షెహనాజ్ తబుస్సమ్, ఖమ్మంలో పొంగులేటి ప్రసాదరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరికి చామల కిరణ్ లేదా కోమటిరెడ్డి లక్ష్మిలలో ఒకరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. -
సీఎం రేవంత్ మాట మార్చడం సిగ్గుచేటు
కొత్తకోట (వనపర్తి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మా పె ద్దన్న అని మాట్లాడిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మరుసటి రోజే మాట మార్చడం సిగ్గుచే టని బీజేపీ జాతీయ ఉపాధ్య క్షురాలు, పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరిక ల అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా అమ లు కాకపోవడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయా రన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నిక ల్లో మోసం చేసి గెలిచారని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని, తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. -
ఇందిరమ్మరాజ్యంలో ఎమర్జెన్సీ పాలన
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మరాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను గుర్తుకు తెస్తోందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మన్నె క్రిషాంక్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, జగన్ మోహన్‌రావు, దినేశ్ చౌదరితో కలిసి గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తన పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్‌తోపాటు తన పీఆర్ఓ, పీఏ ఫోన్లను మొబైల్ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నా రని చెప్పారు. తమ ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డికి చేరవేసినట్లు తనకు అనుమానం కలుగుతుందన్నారు. తమ ఫోన్లను, పాస్‌పోర్ట్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చిత్రపురి కాలనీలోనే రూ.3వేల కోట్ల మేర అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ చేసిన ఆరోపణలను మాత్రమే తాను ప్రస్తావించానని పునరుద్ఘాటించారు. చిత్రపురికాలనీ అక్ర మాలపై రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చిత్రపురి సొసైటీకి చెందిన అనుముల మహనందరెడ్డి ఎవరో తెలియదని సీఎం రేవంత్ అంటున్నారని, ఆయనతో సీఎం దిగిన ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసినా అణచివేత చర్యలకు పాల్పడలేదన్నారు. -
జానారెడ్డితో ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆయన హైదరా బాద్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇంద్రకరణ్‌రెడ్డి చేరికపై గతంలోనూ ప్రచారం జరిగినా, గురువారం జానా నివాసానికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరపడంతో కచ్చితంగా పార్టీ మారతారని భావిస్తున్నారు. -
రేపు బీజేపీ తుది జాబితా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడినట్టు సమాచారం. తెలంగాణ విషయాని కొస్తే..వరంగల్, ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఖరారు కాగా, ఇక అది ప్రకటించడమే తరువాయి అని సమాచారం. ఖమ్మం నుంచి ఎవరిని బరిలో దింపాలనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నా... పోటీకి ఓ బీఆర్ఎస్ ఎంపీ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఖరారైన నల్లగొండ ఎంపీ సీటుతో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగొచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుండడంతో, ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థి కంటే సదరునేత మెరుగైన వాడిగా భావిస్తే నల్లగొండ అభ్యర్థి మార్పు కూడా ఉంటుందంటున్నారు. తుది జాబితా ప్రకటన ఒకరోజు వాయిదా పడడంతో ఎన్నికల వ్యూహాల ఖరారుకు శనివారం నిర్వహించాల్సిన సమావేశం ఆదివా రానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వికేంద్రీకరణ వ్యూహం... బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో దాదాపు 30వేల మంది పోలింగ్‌బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లాస్థాయి అధ్యక్షులతో అమిత్‌షా సమావేశమైన సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా ఎన్నికల కార్యకలా పాలపై పార్టీ ప్రత్యేకదృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్‌బూత్ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది. ప్రధాన పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మిగతా పార్టీలకన్నా బీజేపీనే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తిచేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ మే 13న ఉన్నందున, ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం!
సాక్షి, హైదరాబాద్: ఓ సామాన్యుడిని సీఎం స్థాయికి ఎదిగేలా చేసిననది, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పతనానికి బీజం వేసినది మల్కాజి గిరి లోక్‌సభ నియోజక వర్గమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నిక ల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆశించిన స్థాయి లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదని, ఇప్పటికైనా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. నా బలం, బల గం కార్యకర్తలే. మల్కాజిగిరిలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు అమ్ముడుపో యి నా, కార్యకర్తలు నన్ను భుజాల మీద మోసి గెలిపించి ఢిల్లీకి పంపారు. ప్రతీ బూత్‌లో ఒక్కో కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారు. నాటి మల్కాజిగిరి గెలుపే నన్ను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది..’’ అని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా కాంగ్రెస్ తుఫాను వచ్చినా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని పేర్కొ న్నారు. అందుకే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలని కోరారు. హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని చెప్పారు. పార్టీకి బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళితే విజయం సాధిస్తామని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
హోలీ పండగలోపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది’’ అని రేవంత్ పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి’’ అని సీఎం రేవంత్ సూచించారు. -
కాంగ్రెస్‌లో జూనియర్ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్ని.. తాను ఎలా ముఖ్యమంత్రిని అవుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. తెలంగాణలో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాం. 3 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ 1 లేదా రెండు ఎంపీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సాగునీటి కొరతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. కాళేశ్వరం ప్రోజెక్టు 3 పిల్లర్లతో డ్యామేజ్ ఆగదు. మొత్తం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. కాళేశ్వరంలో నీటిని స్టోర్ చేయాలని బీఆర్ఎస్ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రంలో త్రాగునీరు కొరత లేకుండా చూస్తున్నాం. నీటి కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మేము ఇంకా గేట్లు ఎత్తలేదు. గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మా ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది’ అని మంత్రి పొంగులేటి అన్నారు. -
Medak Lok Sabha: మెదక్ నుంచి కేసీఆరే!
గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరో వైపు వంటేరు ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తేలిన తరువాతే బరిలో ఎవరుంటారన్నది తేలనుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు జహీరాబాద్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కానీ మెదక్ కు వచ్చేసరికి బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుందో వేచిచూడాల్సిందే మరి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలువుల మదన్‌రెడ్డి రేసులో ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్‌ను సునీతారెడ్డికి ఖరారు చేసిన సందర్భంగా ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధినాయకత్వం హామీ కూడా ఇచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్‌కు కూడా ఎంపీ టికెట్ ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తమకే కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధినేత కేసీఆర్ మాత్రం వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంటేరును లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పని చేసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్య ర్థిత్వం ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కేటాయించింది. ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అధినేతే బరిలోకి దిగుతారనే ప్రచారం? ఈ మెదక్ లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా షురూ అయింది. అందుకోసమే ఈ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రాలేదనే టాక్ జోరందుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లలో మెదక్ సీటు ముందుంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కారు జోరందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టికెట్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. -
త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను త్వరలో విడుదల చేయనుంది. దీంతో, హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. వివరాల ప్రకారం.. త్వరలోనే కాంగ్రెస్ మూడో జాబితాలో అభ్యర్థులను ప్రకటించనుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. అంచనా పేర్లు.. నాగర్ కర్నూల్ : మల్లు రవి చేవెళ్ల : రంజిత్ రెడ్డి పెద్దపల్లి : గడ్డం వంశీ మల్కాజ్గిరి : సునీత మహేందర్ రెడ్డి నిజామాబాద్ : జీవన్ రెడ్డి కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి వీరి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. -
రైతులంటే ఎందుకింత చిన్నచూపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, వడగళ్లు ముంచెత్తినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ద్వారా ఆయన సీఎం రేవంత్‌కు పలు ప్రశ్నలు సంధించారు. సీఎంకు రైతుల కన్నీళ్లు, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదని, ఎన్నికల గోల తప్ప.. కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదని విమర్శించారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నిరంతరం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారని ఆక్షేపించారు. పార్టీ ఫిరాయింపులపై పెడుతున్న శ్రద్ధ పంట నష్టం పరిశీలనపై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేకుండా పోయిందా? అని వ్యాఖ్యానించారు. ‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం’బాగుపడదు అనే సామెతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై తమ పార్టీ బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్‌బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్‌కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. -
ఒంటరిగానే బరిలోకి సీపీఎం!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి గానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరి లోకి దిగాలని సీపీఎం భావిస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. బుధారం జరిగిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణ యం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హైదరాబాద్‌లో విలేకరుల కు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలన, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ వైఖరిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండల్లో తమకు బలముందని, భువనగిరి కాకుండా మిగతా మూడింటిలో ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినా తాము సిద్ధమని ప్రకటించారు. కలిసి పనిచేద్దామని బీఆర్ ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.జహంగీర్ భువ నగిరి జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశా రని చెప్పారు. మూసీ సమస్యను పరిష్కరించాలంటూ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. తమ్మినేనికి బదులు వీరయ్య నిర్ణయాలు అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బదు లుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా జహంగీర్ పేరును కూడా వీరయ్యే ప్రకటించారు. ఇలావుండగా రాష్ట్రంలో పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో సీట్ల సర్దుబాటు ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఈ విషయాన్ని తాము ఇదివరకే ప్రతిపాదించామని చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జగన్‌ను చూసి నేర్చుకోండి
ముషీరాబాద్ (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సామాజిక న్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం విషయంలో అక్కడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు కేటాయించి ఔరా అనిపించుకున్నారని ప్రశంసించారు. 2019తో పోలిస్తే అత్యధికంగా బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, మహిళలకు 19 టికెట్లు కేటాయించారని కొనియాడారు. రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి 37 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటిస్తే 17 అగ్రకులాలకు ఇచ్చారని, 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 13, 12 శాతం ఉన్న ఎస్టీలకు మూడు, 20 శాతం ఉన్న ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క చైర్మన్ పదవిని ఇచ్చారని తెలిపారు. దీన్ని బట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని అర్ధమవుతోందన్నారు. ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి, 37 చైర్మన్ పోస్టులలో ఒక్కటి కూడా ఓయూ ఉద్యమకారులకు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. -
కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవా రం మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె మహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పురాణం సతీశ్ కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎంను కలిసిన సతీశ్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్‌లో కృతజ్ఞత సభ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకుగాను రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల నేతృత్వంలో 60 కమ్మ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కమ్మవారి సేవాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం హైదరాబాద్‌లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని కమ్మ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఒక స్థానాన్ని తమ సామాజికవర్గానికి కేటాయించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో సమాఖ్య ప్రధానకార్యదర్శి గంగవరపు శ్రీరామకృష్ణప్రసాద్, నేతలు కండపనేని రత్నాకర్, బొడ్డు రవిశంకర్ తదితరులున్నారు. సీఎంను కలిసిన మత్స్య సొసైటీల చైర్మన్ ఇటీవల రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సొసైటీల సమా ఖ్య చైర్మన్‌గా నియామకమైన మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్‌ను కలిశారు. తనకు చిన్న వయసు లోనే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశమి చ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
టార్గెట్ కాంగ్రెస్!.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘టార్గెట్ కాంగ్రెస్’ వ్యూహంతో బీజేపీ ముందుకెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచిన, ఇటీవలి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల నుంచి రాష్ట్ర ముఖ్యనేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ తదితరుల దాకా అంతా హస్తం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీ లకు లోక్‌సభ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు సీట్లు తగ్గేలా, అదే సమయంలో తాము మెజార్టీ స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. క్రమంగా విమర్శల దాడిని పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోందని.. ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు ఏమైందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’.. పేరిట క్యాంపెయిన్! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను నిలదీసేందుకు, వ్యతిరేక ప్రచారం చేసేందుకు.. ఆరు గ్యారంటీలు, వాటి అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వపరంగా, కాంగ్రెస్ పార్టీపరంగా చేసిన ప్రకటనలనే బీజేపీ వినియోగించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు, గ్యారంటీలు పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందంటూ.. ప్రత్యేకంగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ..’ పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలైన పింఛన్ల పెంపు, గొర్రెల పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు తీరును ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి చేస్తూ.. ఆయా పథకాల కింద లబ్ధి ఆశిస్తున్న వారిని సమీకరిస్తోంది. వారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా ‘ప్రశ్నిస్తున్న రైతు..’ కార్యక్రమాన్ని కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ‘ప్రశ్నిస్తున్న మహిళ.. ప్రశ్నిస్తున్న నిరుద్యోగి.. ప్రశ్నిస్తున్న వ్యవసాయ కూలీ..’ అంటూ కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టోలలో పొందుపరిచిన అంశాలను ఎత్తిచూపేలా ప్రణాళికలను బీజేపీ రూపొందించింది. ఘాటు విమర్శలతో దాడి తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతోందని తమ సర్వేల్లో వెల్లడైందని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అంతర్గత భేటీలో అమిత్‌షా వెల్లడించారు. 12న ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ కమిటీలు, ఆపై అధ్యక్షులతో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో రైతులు, ఓబీసీలు, యువత, మహిళలు, పేదల అభ్యున్నతి గురించి కాంగ్రెస్‌కు ఏమాత్రం పట్టదంటూ విరుచుకుపడ్డారు. ఇక ఈనెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్చెరులో, 16న నాగర్‌కర్నూల్‌లో 18న జగిత్యాలలో జరిగిన సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా.. కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులతో దోపిడీకి పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ భూములు, ఇతర ఆస్తుల కైంకర్యానికి దిగుతోంది. తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఐదేళ్లు చాలు..’’ అని ఆరోపణలు చేయడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం చేయడం సాధ్యం కాదని, తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లలో బీజేపీ కమలం పువ్వును వికసించేలా చేయాలని కూడా పిలుపునిచ్చారు. డబుల్ డిజిట్ ఇవ్వాలంటూ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 15 చోట్ల అభ్యర్థులను బీజేపీ ఇప్ప టికే ప్రకటించింది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూనే.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు హామీల అమల్లో విఫలమైందంటూ ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీ య స్థాయిలో చేసేదేమీ లేదని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ అవి నీతి, అక్రమాల పాలన వస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలప్పుడు బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెండింతలు చేశారని.. ఈసారి డబుల్ డిజిట్లో ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అదనంగా మరో రెండు స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించింది. -
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా?.. .. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న మీకు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku — KTR (@KTRBRS) March 20, 2024 -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్