breaking news
-
నా సోదరి పార్టీకి వెన్నుపోటు పొడిచింది
సాక్షి, హైదరాబాద్: పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధినేత కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన తన తండ్రి కె. కేశవరావు (కేకే) పార్టీని వీడటం బాధాకరమని ఆయన కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ నేత దాసోజు శ్రవణ్‌తో కలసి శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడిన సమయంలో దుర్భాషలాడిన సీఎం రేవంత్‌రెడ్డి తన తండ్రిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్‌లో ఆత్మస్థై ర్యం నింపేందుకు కేకే తన నిర్ణయాన్ని పునఃసమీ క్షించుకోవాలని సూచించారు. అలాగే తన సోదరి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. పార్టీకి వెన్ను పోటు పొడిచిందని విప్లవ్ మండిపడ్డారు. ఆమెకు మేయర్ పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. తన తండ్రి, సోదరి బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో కి వెళ్లాలని డిమాండ్ చేశారు. అభివృద్ది కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానంటూ తన సోదరి చేసిన వ్యా ఖ్యలను విప్లవ్ తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో చేరకుంటే విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను సీఎం అభివృద్ధి చేయరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని... ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బీఆర్ఎస్ను వీడేది లేదని విప్లవ్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చుతున్నాడని తానూ ఆరోపణలు చేయగలనని పేర్కొన్నారు. దానం.. ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: దాసోజు బీఆర్ఎస్లో ఆత్మగౌరవం లేదని తమ పార్టీ ఖైర తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ తప్పుబ ట్టారు. ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా అవమానించిన రేవంత్‌రెడ్డి దగ్గర ఆత్మగౌరవం దొరుకుతుందా? అని ప్రశ్నించారు. దానం ఎన్నోమార్లు కేసీఆర్ కు పాదాభివందనం చేశారని, ఆయన ఆత్మగౌరవా న్ని కించపరిస్తే ఎందుకు కాళ్లు మొక్కారని నిలదీ శారు. బాత్రూంలో జారిపడటంతో ఆసుపత్రిపా లైన కేసీఆర్ తాత్కాలికంగా ఉండేందుకు తన ఇళ్లను ఇచ్చేందుకు దానం ముందుకొచ్చారన్నారు. కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని దాసోజు డిమాండ్ చేశారు. లౌకికవాదం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు దానం చెప్పడాన్ని పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, బైండ్ల విజయ్‌కుమార్, నారాయణ పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ బెదిరింపు రాజకీయాలు
షాద్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే అక్రమ దందా వ్యవహారాలు బయటపెడతామంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం పాలమూరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చిత్తశుద్ధితో జరగడం లేదన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కాంట్రాక్టర్లను డొనేషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి రాష్ట్రంలో రాహుల్ గాంధీ ట్యాక్స్‌ను విధిస్తున్నారని నిందించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని, న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
కాంగ్రెస్ పోరాటం బీజేపీతోనే కాదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది కేవలం బీజేపీతో మాత్రమే కాదని, ప్రమాదంలో పడిన రాజ్యాంగ హక్కులను కాపాడే దిశగా పోరా టం కొనసాగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, ఆ దిశలో పార్టీ నేతలు కృషి చేయాలని ఆమె కోరారు. శుక్రవారం టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలో పేతం చేసేందుకు గాను రాష్ట్రంలో అత్యధిక స్థానా ల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీపీసీసీ ప్రచార కమిటీ ప్రతినిధులు పనిచేయాలని, పదేళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలన, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్, మోదీల పదేళ్ల దుర్మార్గ పాలన, రేవంత్ 100 రోజుల ప్రజాపాలన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి పవన్, ప్రచార కమిటీ కో కన్వీనర్ తీన్మార్ మల్లన్న, సభ్యులు రమ్యారావు, ఆనంద్, వజీర్ ప్రకాష్ గౌడ్, దయాకర్ పాల్గొన్నారు. -
సీఎం రేవంత్‌ను కలసిన కేకే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జన రల్, ఎంపీ కె.కేశవరావు శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కేకే చాలాసేపు రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, కేకే కుమారుడు వెంకట్ కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నారు. మరోవైపు స్టేషన్‌ఘ న్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. సీనియర్ నేతలు మల్లు రవి, ఎస్.సంపత్‌కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనా రాయణ తదితరులు మున్షీ వెంట ఉన్నారు. వారు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యతో భేటీ అయి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. నేడు చేరికలు! ఎంపీ కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కేకే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరుతారనేది స్పష్టతలేదు. ఇక నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి కూడా శుక్ర వారం రేవంత్‌ను కలిశారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నేతలు కూడా.. నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన నేతలు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలంతా కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు రేవంత్ పలు సూచనలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గా రెడ్డి, ఆమె కుమారుడు భరత్‌సాయిరెడ్డి సీఎంను కలిశారు. తనకు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి రూరల్: మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, మళ్లీ సొంతగూటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. -
దొంగలంతా ఒక్కటై నన్ను బలహీనపర్చాలని చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచాం. గద్వాలలో కూడా కాంగ్రెస్ కచ్చితంగా గెలిచేది. కానీ చివర్లో బీజేపీ అరుణమ్మ అల్లుడికి ఓట్లు వేయించింది. అక్కడ దొంగదెబ్బ తీశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారు. దొంగలంతా ఒక్కటై నన్ను రాజకీయంగా బలహీనపర్చాలని చూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు లోక్‌సభ అభ్యర్థులు వంశీ, మల్లురవిల మీద కోపం లేదు. ఉన్నదంతా నా మీదనే. నన్ను దెబ్బతీస్తే సొంత జిల్లాలో గెలవలేని వ్యక్తి రాష్ట్రమంతా ఏం చేస్తాడని ప్రశ్నించవచ్చనేది వారి ఆలోచన’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరుకు ఏమీ చేయని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏం మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న డీకే అరుణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించిన రేవంత్ పదేళ్లలో పాలమూరుకు ఏమీ చేయని మోదీ ఇప్పుడేం చేస్తారని..ఇప్పుడు ఓటేస్తే్త మోదీ చంద్రమండలానికి రాజవుతాడా అని వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఆయన మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వాల్మీకిబోయ సామాజికవర్గ పెద్దలతో సమావేశ మయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో బోయలకు రిజ్వరేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే ‘వాల్మీకిబోయలపై కాంగ్రెస్‌కు అభిమానం ఉంది. కర్ణాటకలో బోయలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వాల్మీకిబోయల డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటాం. సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి మీ సమస్యలు ఎలా తీర్చాలో చెప్పండి. మీ సమస్యలపై మాకు అవగాహన ఉంది. వాటిని తీర్చే బాధ్యత నాది. ఎన్నికల తర్వాత నేనే మీతో మళ్లీ సమావేశమవుతా. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వండి. మేం కచ్చితంగా బోయలకు న్యాయం చేస్తాం. కేసీఆర్‌లాగా మాట ఇచ్చి మోసం చేయం. వంద రోజుల పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆరు గ్యారంటీలను అమలు చేశాం. అధికారంలోకి 100 రోజుల్లో విశ్వాసం కల్పించాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ ఫలితం అనుభవిస్తారు ‘కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. చేస్తే ఏమవుతుందని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. తప్పుడు పనులు చేసిన అధికారులు ఇప్పుడు చిప్పకూడు తినాల్సి వస్తోంది. వాళ్లు దుర్మార్గులు, వాళ్ల మాటలు వినొద్దంటే ఆ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేటీఆర్ ఆంబోతులా బరితెగించి మాట్లాడుతున్నా డు. ఫలితం అనుభవిస్తాడు. ట్యాపింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంది సంసారాల్లో తొంగి చూడడానికి వీళ్లకేం పని. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు. గతంలో ఫోన్ మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టే కొడంగల్‌కు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశా. అక్కడ కూడా కచ్చితంగా గెలవబోతున్నాం. 200 ఓట్లతో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
17 సీట్లూ మావే...కమలదళం సరికొత్త నినాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలదళం ‘సారే కే సారా సత్రా హమారా’ (17 ఎంపీ సీట్లకు 17 సీట్లు మనవే) నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుందనే ధీమాతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్లాలని జాతీయనాయకత్వం దిశానిర్దేశం చేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీని 4 ఎంపీ సీట్లలో గెలిపిస్తే రూ. 9 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే అంతకు మించి అభివృద్ధి చేస్తామంటూ ప్రజల వద్దకు వెళ్లాలని సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల కార్యాచరణ అమలుకు సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున పోటీలో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులు రోజూ క్రమం తప్పకుండా పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ ముఖ్యనాయకులతో సమావేశం కావడం, నాయకులు, కార్యకర్తల మధ్య మెరుగైన సమన్వయం సాధించడంపై దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతీ బూత్కో వాట్సాప్ గ్రూప్! ఎన్నికల మేనేజ్మెంట్పై బీజేపీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణను అమలుచేస్తోంది. ఇక్కడి 17 ఎంపీ సీట్లు, వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా క్షేత్రస్థాయి నుంచి పని విధానాన్ని ఖరారు చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌బూత్‌కు ఒక వాట్సాప్‌గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బూత్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, బూత్ లెవల్ ఆర్గనైజర్, బూత్ ఆర్డినేటర్ల నియామకం ద్వారా పోలింగ్‌బూత్‌స్థాయిలో రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణ, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని బూత్‌లలో కమిటీల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కమిటీలు, బేటీ బచావో బేటీ పడావో కమిటీ, ఒక్కో పోలింగ్‌బూత్‌లోని ఓటర్ల సమాచారం, బూత్‌ల పరిధిలోనే ప్రతిరోజు బైక్‌లపై కార్యకర్తల పర్యటనలు, పార్టీపరంగా చేపడుతున్న పనులపై పర్యవేక్షణ వంటివి చేపట్టనున్నారు. దీంతో పాటు ఒక్కో లోక్‌సభ స్థానానికి విడిగా కాల్‌సెంటర్ ఏర్పాటు ద్వారా బూత్‌కమిటీలపై పర్యవేక్షణతో పాటు కేంద్ర పథకాల లబ్ధిదారుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ఇక ముందూ అదే జోష్‌తో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారుతో పాటు తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసిన జోష్‌ను ఇక ముందూ కొనసాగించాలని నాయకత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు, పోలింగ్‌బూత్‌స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని చేయగా, మరో విడతలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ ఇతర ముఖ్యనేతల పర్యటనలు చేపట్టనున్నారు. -
ఇది ఆకులు రాలే కాలం కొత్త చిగురు ఖాయం
సాక్షి, సిద్దిపేట: ‘కొంత మంది నాయకులను కాంగ్రెస్ పార్టీ కొనవచ్చు.. కానీ ఉద్యమకారులను, బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేదు. పవర్ బ్రోకర్లు, అవకాశవాదులే పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు దుబ్బాక, సిద్దిపేటల్లో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇప్పుడెవరైతే పార్టీ నుంచి వెళ్లారో.. రేపు కాళ్లు మొక్కినా మళ్లీ చేర్చుకునేది లేదన్నారు. ఇది ఆకులు రాలే కాలమని, ఆకులు పోయాక కొత్త చిగురు వచ్చి చెట్టు వికసిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పనికిరాని ఆకుల మాదిరిగా పార్టీని వీడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వాళ్లే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రూ. 2లక్షల రుణ మాఫీ, ఆసరా పెన్షన్ రూ. 4 వేలు, మహిళలకు రూ. 2,500, రైతుబంధు రూ. 15 వేలు, క్వింటాలు వడ్లకు బోనస్ రూ. 500 వచ్చిన వారే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, మిగతా వారందరూ కారుకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన హరీశ్‌రావు ఆ మేరకు గ్రామాల్లో చర్చ పెట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. వంద రోజుల పాలన రెఫరెండం అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ మాయం అవుతాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన్పటి నుంచి ఇప్పటి వరకు 105 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా వారిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. -
కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వం
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. కానీ అధికారం పోగానే స్వార్థం కోసం కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. రేపు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి వంటి వారు వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానిచ్చేది లేదు. పదేళ్లు అధికారం అనుభవించిన నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లే ముందు రెండు రాళ్లు వేసి వెళతారు. కేకే, కడియం శ్రీహరి వయస్సురీత్యా పెద్దవారు.. వారినేమీ అనలేం..విజ్ఞతకే వదిలేద్దాం..కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ కీలక నేతలతో జరిగిన భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. ‘రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు పార్టీలో నీడలా ఉంటూనే వెన్నుపోటు పొడిచారు. ఆస్కార్ అవార్డుకు మించి నటిస్తే పిచ్చోళ్లలా నమ్మాం. బయటివాడు మోసం చేస్తే బాధ అనిపించదు. కానీ నీడలా తిరిగి, కష్ట కాలంలో వెంట ఉండకుండా కేసీఆర్ కూతురు అరెస్టు అవుతున్న సమయంలో నవ్వుకుంటూ వెళ్లి రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బదలా తీర్చుకోవాలి. రంజిత్‌రెడ్డి చేసిన ద్రోహానికి చేవెళ్ల నాయకులు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ‘లీకు వీరుడు’ ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రస్తావనకు రాకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ అంటూ యూట్యూబ్ చానళ్లకు డబ్బులిచ్చి లీకులు ఇస్తున్నాడు. కేసీఆర్‌ను బొందపెడతా అని రోత మాటలు మాట్లాడుతూ చౌకబారు విమర్శలు చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేసేందుకు రోజుకో స్కామ్ అంటూ ప్రచారం చేస్తూ కేసీఆర్ అధికారం నుంచి దిగి నాలుగు నెలలైనా యూటూŠయ్బ్ చానళ్లను అడ్డుపెట్టుకొని తిట్టిస్తున్నాడు. ఆరు గ్యారంటీలు పోయి ఆరు గారడీలు మాత్రమే రేవంత్ పాలనలో మిగిలాయి. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగి హామీలు నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం, నల్లగొండ నేతలే రేవంత్ ప్రభుత్వానికి మానవబాంబులు అవుతారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా కలిపి 40 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బీజేపీని నిరోధించే శక్తి ప్రాంతీయ పార్టీల నేతలు మమతాబెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్, స్టాలిన్ వంటి వారికి మాత్రమే ఉంది’అని కేటీఆర్ అన్నారు. కార్యకర్తల కోసం కాలికి బలపం ‘ఇన్ని రోజులు పార్టీ, నాయకుల కోసం పనిచేసిన.. కార్యకర్తల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతా. పదిమంది సభ అయినా వేయిమంది సభ అయినా వచ్చి కొట్లాడతా. సైలెంట్‌గా పనిచేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. నాయకులు పార్టీని వదిలేసినా, శ్రేణుల కోసం స్వయంగా పనిచేస్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ కేంద్రీకరిస్తా. ధాన్యం బోనస్ ఇవ్వకుంటే నిప్పు రగిలిద్దాం. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండేందుకు వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్ల నుంచి కేసీఆర్ అభ్యర్థిగా భావించి పనిచేద్దాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీని వీడేది లేదు: కాలే యాదయ్య తనకు ఆస్తి లేకున్నా నైతిక విలువలు ఉన్నాయని, పార్టీని వీడే ప్రసక్తే లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తాము పార్టీని వీడుతున్నట్టు వస్తున్న పుకార్లు నమ్మొద్దని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కోరారు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ వెంట వారి అంతిమశ్వాస వరకు తమ కుటుంబం ఉందని, కేసీఆర్ వెంట అదే తరహాలో ఉంటామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రాజీనామాయే ప్ర‘దానం’!
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చినట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు మంత్రి కోమటిరెడ్డి కూడా దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభ, లోక్‌సభ మేనిఫెస్టోపై చర్చించేందుకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శుక్రవారం భేటీ అయింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కలిసిన దీపాదాస్ మున్షీ, మల్లురవి, సంపత్ కుమార్ అంతకుముందు గాం«దీభవన్ వేదికగా టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ అయింది. ఇక బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వనించారు. కె. కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా చేరేందుకు రంగం సిద్ధమైంది. నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. – సాక్షి, హైదరాబాద్ -
మళ్లీ బీఆర్ఎస్లోకి తాటికొండ రాజయ్య.. కడియంకు చెక్ పెట్టేందుకు!
లోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ రాజకీయ వలస పక్షులు పార్టీలు మారుతున్నాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది తాజాగా వరంగల్‌కు బీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత పార్టీని వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీ టికెట్ దక్కపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లారు. శనివారం సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే పార్టీలో చేరికపై తన కార్యకర్తలతో చర్చించి చెబుతానని రాజయ్య చెప్పినట్లు సమాచారం. చదవండి: కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్ కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్‌లో చేరలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా కేసీఆర్ ఆమోదించలేదు. మరోవైపు అనూహ్యంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ తాజా నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. తన ప్రత్యర్ధి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరనుండటంతో మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు రాజయ్య సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. -
ఇది ఆకులు రాలే కాలం.. పార్టీ మారుతున్న నేతలపై హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట: కీలక సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకులపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలు మారే వారిని పవర్ బ్రోకర్లుగా పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ అవకాశ వాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని, ఇదేం పార్టీకి కొత్తకాదని అన్నారు.తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని, అయినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపెట్టారని ప్రస్తావించారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని గుర్తు చేశారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరని అన్నారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్ళు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. పోయినవారిని రేపు కాళ్ళు మొక్కిన మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదన్నారు.. ఇది ఆకులు రాలే కాలమని, ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులు చెత్తకుప్పలో కలిసిపోతున్నాయని అన్నారు. ఆకులు పోయాక మళ్లీ కొత్త చిగురు వచ్చి ఆ చెట్టు వికసిస్తుందన్నారు. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటదని తెలిపారు. చదవండి: కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్ -
కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పార్టీ వీడుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వీడుతున్న వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. కానీ అధికారం పోగానే, తమ ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీలో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బీఆర్ఎస్ను వదిలి వెళ్తున్న వారు మళ్లీ పార్టీలో చేరుతామని కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వమని చెప్పారు. వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్తామని అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహేందర్‌రెడ్డికి పదవి ఇచ్చినా పార్టీ మారాడని మండిపడ్డారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 4 స్థానాల్లో గెలిచాం. పరిగిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. వికారాబాద్‌లో కూడా ఏం జరిగిందో తెలియదు కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాం. తాండూరులో గెలుపు ఏకపక్షంగా ఉంటుందనుకున్నా. ఎందుకంటే మహేందర్ రెడ్డిని బిజీగా పెట్టాం. పోటీ లేదు. ఎదురు లేదనుకున్నాం.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని పెద్దలు చెబుతారు. మంత్రిని చేశాం.. ఇక లొల్లి పెట్టడు అనుకున్నాం. చదవండి: KTR: రాజకీయ బేహారులకు జవాబు చెప్పేది వాళ్లే మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డికి సహకరిస్తాడుఅనుకున్నాం. కానీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత ఆ రెండు నియోజకవర్గాల్లో అడ్డా పెట్టి, పార్టీలోనే ఉండుకుంటూ వెన్నుపోటు పొడిచి మన నాయకులను ఓడగొట్టారు. మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి ఓటమికి మన వాళ్లే కారణం అనేది అక్షర సత్యం. 2019 లో కొండ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారాడు, ఓడిస్తాం అని చెప్పి ఓడించాం. అన్ని మంచి మాటలు చెప్పి, కేసిఆర్ కూతురు అరెస్ట్ అయిన సమయంలో ఇలాంటి నేతలు పార్టీ మారుతున్నారు. ఇలాంటి వాళ్ళని జనం క్షమించరు, వాళ్ళని పార్టీ లోకి తీసుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి వస్తామంటే కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రానివ్వం. చేవెళ్ల లో నిలబడ్డది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్. కేసీఆర్ కోసం మనం పనిచేయాలి. పార్టీ మారుతున్న నేతలు వెళ్ళేటప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పట్టించుకోవద్దు పరిగి, చేవెళ్ల బీఆర్ఎస్ సభలో నా కంటే ఎక్కువగా రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిట్టారు. పరిగిలో నాలుగైదు వేల మంది మీటింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి పోతున్నట్లు నా మీద పుకార్లు వస్తున్నాయి. నా ఒక్కని మీద వస్తలేవు.. రంజిత్ రెడడి మీద కూడా వస్తున్నాయి అని మహేందర్ రెడ్డి అన్నారు. ఇక ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారు. అద్భుతమైన స్పీచ్‌లు ఇచ్చారు. నేను ఇద్దర్నీ పిచ్చిగా నమ్మాను. చూస్తే 15 రోజుల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ చేర్చుకోం’ అని కేటీఆర్ తెలిపారు. కష్టకాలంలో పార్టీని వీడుతున్న వాళ్ళు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ పార్టీలోకి రానివ్వం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/sp5JHsXWNg— BRS Party (@BRSparty) March 29, 2024 కాగా లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు భారీ షాక్‌లు తగులుతున్నాయి. జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది. బీఆర్ఎస్ నేతలంతా ఒక్కొకరుగా వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు. ప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. సిట్టింగులు సైతం పార్టీ మారారు. ఇప్పటికే తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, ఎంపీ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి వంటి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. మరికొన్ని రోజుల్లో మేయర్ విజయలక్ష్మి, కేకే, కడియం శ్రీహరి, కావ్య, గడ్డం అరవింద్, ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరుస నిష్క్రమణలతో గులాబీ దళంలో కలవరం మొదలైంది. -
ఆర్థిక పరిస్థితి బాలేదు, కొంచెం టైం పట్టుద్ది: మంత్రి కోమటిరెట్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గం, తన శాఖ తప్ప వేరే పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని విమర్శించారు. యాదగిరగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల నేడు రాష్ట్రానికి కరువు వచ్చిందన్నారు. దేవుడి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. . బీసార్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని, అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని అన్నారు. ‘మేము గేట్లు తెరుచుడు కాదు...గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వస్తున్నారు. మా గేట్లు పలగొట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారు’ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ మిగిలరని పేర్కొన్నారు. బీజేపీ నుంచి రాకుంటే ఆపుకుంటే చాలు ఉద్యమాల పోరాట గడ్డ తెలంగాణ గడ్డ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లెక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పడకొడితే ఊరుకోం. మా ప్రభుత్వాన్ని పడగొట్టుడు తరువాత బీజేపీకి ఉన్న 8మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు రాకుండా ఆపుకుంటే చాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మేల్యేలు అందరూ ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో R అండ్ D మినిస్టర్ గణపతి రెడ్డి మాత్రమే...ప్రశాంత్ రెడ్డి కాదు. ప్రశాంత్ రెడ్డి మాత్రమే కాదు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్‌దే నడిచింది. రేవంత్‌కు తెలియక నలుగురే రావులు ఉన్నారు అనుకున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ అవినీతి చూస్తుంటే రావులందరూ ఒకే దగ్గర జమైనారు. ప్రగతి భవన్‌ను జైలులాగా మార్చి రావులందరిని వేయాల్సి వచ్చేలా ఉంది. ఒక్కరిద్ధరే అనుకున్నాం కానీ తవ్వేకొద్దీ రావులందరూ బయటకు వస్తున్నారు. కేసీఆర్ అవితిని అంతా తీయాలంటే మాకు 20 ఏళ్లు పడేటట్లు ఉంది. పార్లమెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. భగవంతుడు కూడా మమ్ములను విడదియ్యలేరు. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతీ కుటుంబంలో ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడుగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా ధరకాస్తు ఇచ్చారు. తెలిశాక వద్దు అన్నాను. వైఎస్సార్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వైఎస్ఆర్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగింది. హాలీవుడ్ లాంటి స్టూడియో పెట్టీ టూరిజం పెంచాలని చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు. రుణమాఫీ, పెన్షన్లు, లాంటి స్విమ్స్‌కు కొంత సమయం పడుతుంది. ఎలాగోలా నెట్టుకొస్తాం అనుకున్నాం. కానీ కేసీఆర్ అన్ని శాఖల్లో వేల కోట్ల బకాయిలు పెట్టీ పోయారు. రాష్ట్రం నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో పెట్టారు. విచారణ చేసి ఆ మూడు సెగ్మెంట్ల నిధుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఒక సిస్టమేటిక్‌గా ఉంటారు. కడియం శ్రీహరి కూతురు అలా చెప్పింది అంటే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ 12 సీట్లు రావడం పక్క. మా నల్గొండ, భువనగిరి సీట్లలో భారీ మెజారిటీ వస్తది. బీజేపీకి నాలుగు సీట్లు అనుకుంటున్నా. అక్కడ మేము దృష్టి పెట్టాం. దానం నాగేందర్ ఎమ్మేల్యేకు రాజీనామ చేయకుండా ఎంపికి పోటీ కష్టమే అనుకుంటా. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఇంకో పార్టీలో ఎంపిగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయి అని నా అభిప్రాయం. సినిమాలు తీసి ప్రజలను రెచ్చకొట్టడం కాదు. పార్టీ పిరాయింపులు అనేది మోదీ, కేసీఆర్ అలవాటు చేసినవనే. బ్లాక్ మనీ అన్నారు ఏమైంది? అదానీ అంబానీ నంబర్ వన్ టు ఎలా అయ్యారు? కిషన్ రెడ్డి తెలంగాణకు ఎం చేశారు? కిషన్ రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్‌కు మంచి జరిగింది. మేము 12అనుకున్నాం కానీ 14 సీట్లు కిషన్ రెడ్డి వల్ల వస్తాయి. కిషన్ రెడ్డి స్థానంలో నేను ఉంటే మూసీ అభివృద్ధి, హైదరాబాద్‌లో సైతం 30, 40వేల పనులు చేసే వాడిని’ అని తెలిపారు. -
కాంగ్రెస్‌లోకి కడియం.. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో మరో సీనియర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైంది. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతల బృందం శుక్రవారం ఉదయం కడియం ఇంటికి వెళ్లింది. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహీన్ రెడ్డి ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా కడియం నివాసంలో వీళ్లంతా సమావేశం అయ్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి, కావ్యలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం.. వీళ్లు అధికారికంగా మా పార్టీలోకి చేరతారు అని ప్రకటించారు దీపాదాస్ మున్షీ. అలాగే.. ఏఐసీసీ ప్రతినిధిగా దీపాదాస్ తమను కలిశారని కడియం చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ లో ఇంకా చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఏఐసీసీ ప్రతినిధికి చెప్పా అని కడియం మీడియాతో అన్నారు. కావ్య పేరు దాదాపు ఖరారు ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కావ్య వద్దని చెబుతూ.. కేసీఆర్‌కు లేఖ రాసింది. మరోవైపు కడియం ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరతుందనే ప్రచారం తెర మీదకు రాగానే.. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వీళ్లు చేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. రేవంత్‌తో కేకే భేటీ ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లో చేరతానని అధికారికంగా గురువారం ప్రకటించిన సీనియర్ నేత కేకే.. ఈ ఉదయం పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరికపై అరగంట పాటు వీళ్లిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కుదిరితే రేపు.. లేకుంటే ఏప్రిల్ 6వ తేదీన కేకే కాంగ్రెస్ గూటికి చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. -
దానం అవుట్.. సికింద్రాబాద్ సీటు మరొకరికి??
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ముందు ఓకే చెప్పి తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం నిర్ణయం ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
KTR: రాజకీయ బేహారులకు జవాబు చెప్పేది వాళ్లే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందర.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంకొంతమంది సైతం కాంగ్రెస్‌లో చేరవచ్చనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఈ తరుణంలో.. పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే ఒంటరిగా బయల్దేరి.. లక్షల మంది సైన్యంతో సాధించారని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించారని తెలిపారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్ ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు… — KTR (@KTRBRS) March 29, 2024 ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ పార్టీ మారుతున్న నేతల ప్రభావం బీఆర్ఎస్పై ఉండబోదంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: కారులో కలకలం -
పోటీ నుంచి తప్పుకుంటున్నా
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో బీఆర్ఎస్ గట్టి షాక్ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. పార్టీపై వచి్చన అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లోనే పోటీనుంచి విరమించుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య? కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా తప్పుకున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటివరకు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించ లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న తండ్రీకూతుళ్లు ఈ నెల 30న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలోకి దిగే అవకాశం ఉందని, కానిపక్షంలో కావ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే... ఆయన ఎంపీగా గెలిచిన అనంతరం కావ్యను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ బరిలోకి దింపవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ హామీల మేరకే శ్రీహరి, కావ్యలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత కోసం శ్రీహరి, కావ్యలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావ్య ఎపిసోడ్లో ప్రభుత్వ సలహాదారు, కడియం శ్రీహరికి చిరకాల మిత్రుడు వేం నరేందర్‌రెడ్డి చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
కాంగ్రెస్ సొంత ఇల్లులాంటిది..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యస భకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతిత్వరలో వెల్లడిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వరంగల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించాక కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్ఎస్ను వీడనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?!
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ స్టార్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ ఎంపీగా సానియా పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో.. బీజేపీ మాధవీ లతను పోటీకి దింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎంఐఎంకు పట్టున్న హైదరాబాద్ నియోజకవర్గంలో సానియా మీర్జాను పోటీకి నిలపడం ద్వారా ఒవైసీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సానియా మీర్జా.. గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్నారు. ఇక ఆమె చెల్లెలు ఆనం మీర్జా.. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కోడలు అన్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌తో 2019లో ఆనం వివాహం జరిగింది. ఫలితంగా అప్పటికే మీర్జా- అజారుద్దీన్ మధ్య ఉన్న స్నేహం.. బంధుత్వంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సానియా మీర్జా అభ్యర్థిత్వం గురించి అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. మీర్జా కుటుంబం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా.. తన భర్త షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చినట్లు మీర్జా ఫ్యామిలీ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తన కుమారుడు ఇజహాన్ బాగోగులు, టెన్నిస్ అకాడమీ అభివృద్ధి పైనే దృష్టి సారించిన సానియా మీర్జా రాజకీయంగా స్టెప్ తీసుకోనున్నారంటూ వార్తలు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన
రాజన్న సిరిసిల్ల, సాక్షి: తెలంగాణలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. గతేడాది ఇదే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అంతటా నీళ్లిచ్చింది. కేసీఆర్‌పై కోపంతోనే మేడిగడ్డకు రిపేర్ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరగడం తప్ప.. రైతుల్ని పరామర్శించే తీరిక సీఎం రేవంత్‌రెడ్డికి లేకుండా పోయింది. ఇప్పటికే 200 మంది రైతులు చనిపోయారు. ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి’’ అని కాంగ్రెస్ సర్కార్‌ను కోరారాయన. ‘ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఎకరానికి పదివేలా, 25 వేలా.. ఎంతిస్తారో పరిహారం అంత ఇవ్వండి. అధికారం నుంచి దిగేపోయేనాటికి రైతుల కోసం కేసీఆర్ రైతుబంధు పేరిట రూ.7,000 కోట్ల రూపాయలు పెట్టారు. కానీ, అవికూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు చేరవేస్తోంది. ఎన్నికల టైంలో.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వాలి. రైతులకు అండగా మేమున్నాం. కేసీఆర్ ఉన్నారు. దయచేసి ఆత్మహత్యల్లాంటి చర్యలకు రైతులు పాల్పడొద్దు’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్‌కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్‌లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Live Updates.. ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. జోగులాంబ గద్వాల.. ►జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు. ►నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి. జోగులాంబ గద్వాల.. ►స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ప్రజా ప్రతినిధులు. వనపర్తి జిల్లా.. ►వనపర్తి జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో ప్రారంభమైన పోలింగ్. ►వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్స్ :218 ►నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ►ఓటు హక్కును వినియోగించుకోనున్న 101 ఓటర్లు. వికారాబాద్ జిల్లా ►కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ►కొడంగల్ నియోజకవర్గం మొత్తం 56 ఓటర్ల తమ ఓటును హక్కును వినియోగించనున్నారు. ►మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ►ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ►ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ►ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. ►బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. ►పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. ►గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.