breaking news
-
కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slanderEither Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T— KTR (@KTRBRS) April 2, 2024 -
నీటిని విడుదల చేయకపోతే ఉద్యమం చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా.. రైతులకు అపాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కుందన్నారు. ఆయన సిద్దిపేట కలెక్టరేట్లో మాట్లాడారు. ‘నాడు ఉద్యమాల ద్వారా మెల్కొంది బీఆర్ఎస్. కేసీఆర్ పర్యటన తర్వాత నిన్న(సోమవారం) నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 25 వేల నష్ట పరిహారం అందించాలి.100 రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారు. డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తామని చేయలేదు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది. ...బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమే.. భారత రైతు సమితి. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కూడవెళ్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలి. 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. లో వోల్టేజీ కరెంట్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. ..బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.కాంగ్రెస్ పార్టీ వచ్చినంక నీళ్లు తగ్గినయి, కన్నీళ్లు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల కష్టాలు పట్టవు. రైతులను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు తీరిక లేదా?. బీఆర్ఎస్ పార్టీ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంది’ అని హరీశ్‌రావు అన్నారు. -
కేసీఆర్‌పై విమర్శలు చేయను: కడియం శ్రీహరి
సాక్షి, హన్మకొండ: బీఆర్ఎస్ నేతలకు, బీజేపీకి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని అవి బయటపెడితే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కాగా, కడియం శ్రీహరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ.. సీబీఐ, ఈడీలను ప్రయోగించి నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో చేరితే పునీతులవుతారు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అడ్డుకోవాల్సి అవసరముంది. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నికల్లో నన్ను గెలిపించిన విధంగానే, కావ్యను కూడా గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ను వీడటం కొంత బాధగానే ఉంది. కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్‌పై నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. చాలా మంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపై పార్టీ నేతలు స్పందించలేదు. కానీ, నాపై మాత్రం బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, వారు మాట్లాడే పద్దతి బాగోలేదు. జిల్లా స్థాయి నేతలు కూడా నాపై అనవసర కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. నిన్ను పాలకుర్తి ప్రజలే చీకొట్టారు. ఇలాంటి అహంకార మాటల వల్లే ఓడిపోయావు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఇలాంటి దుస్థితికి రావడానికి కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలే కారణం. పల్లా వంటి వ్యక్తి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించని రోజున జనగామలో నిన్ను బట్టలు ఊడదీసి నిలుచోపెడతాను. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి కిషన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించారు. బుద్ధి లేకుండా అనవసర మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీలాంటి అందరి చరిత్రలు నాకు తెలుసు. మీరు చేసిన దారుణాలు బయటపెడితే మీరు భరించలేరు, తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు. Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T — KTR (@KTRBRS) April 2, 2024 -
లీకు వార్తలు.. ఫేక్ ప్రచారాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: హామీలు అమలు చేయలేక రోజుకో కొత్త నాటకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అన్నీ లీక్ వార్తలు, ఫేక్ ప్రచారాలే తప్ప హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయారని విమ ర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేని బీజేపీ మరోసారి రాముడు, దేవాలయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేత లు అవకాశవాద రాజకీయాలతో పార్టీలు మారి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా చింతగట్టు క్యాంపు సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో.. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అ«ధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయ తోరణాన్ని ముట్టుకోవద్దు కాంగ్రెస్ నాయకులు ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు అనుకుంటే.. వంద రోజుల్లో ఉద్దెర మాటలే తప్ప ఉద్ధరించింది ఏమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ చిహ్నాలు, గుర్తులను చెరిపేయా లని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టు కుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని అభివర్ణించారు. రాముడికి అందరం మొక్కుతాం ‘మాట వింటే జోడీ.. వినకపోతే తెల్లారే ఈడీ దాడి’ అనే విధంగా పదేళ్లలో దేశంలో రాజకీయ పరిస్థితిని బీజేపీ మార్చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ఆకలి, పేదరికం, నిరు ద్యోగం పెరిగిపోయాయన్నారు. ‘బీజేపోళ్లు ఏమన్నా అంటే రామాలయం అంటారు. రాముడికి అందరం మొక్కుతాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. బీజేపోళ్లకు వస్తదో.. రాదో తెల్వదు కానీ.. నేను హనుమాన్ చాలీసా రెండు నిమిషాల్లో చదువుతాను (చదివి వినిపించి)’ అని చెప్పారు. హరీశ్ కాళ్లపై పడిన కార్యకర్త సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా ఓ కార్యకర్త వేగంగా స్టేజీపైకి చేరుకుని ఆయన కాళ్లపై పడ్డారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. నేతలు, గన్మన్లు కలిసి అతన్ని కిందికి దింపారు. కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన ఆయ న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డిని దొంగతో పోల్చి, చివరకు ఆ దొంగతోనే కాంగ్రెస్ కండువా కప్పించుకున్నా రని, ఈ వయసులో ఇంత దిగజారుడు రాజ కీయాలు అవసరమా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ ఎస్ తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, బçస్వ రాజు సారయ్య, మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు «గండ్ర వెంకటరమణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ అభివృద్ధి ఎజెండాతోనే ఓట్లు అడుగుతాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వ అభివృద్ధి ఎజెండా ఆధారంగానే ప్రజలను ఓట్లు అడుగుతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత పదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పూర్తి భిన్నంగా నీతివంతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను మోదీ అందించారన్నారు. బీజేపీ ప్రత్యర్థులు కూడా మోదీ, కేంద్ర మంత్రులపై ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయారంటే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. సోమవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2004–14 మధ్య కాంగ్రెస్ హయాంలో ‘పాలసీ పెరాలసిస్’ (పాలనాపర మైన వైఫల్యం) సాగిందని మండిపడ్డారు. ఆనాడు తాత్కాలిక ప్రయోజనాల కోసమే ప్రజలకు కాంగ్రెస్ ఉచితాలు ఇచ్చిందన్నారు. యూపీఏ (కాంగ్రెస్) పాలనలో అమలైన పథకాలు నినాదాలకే పరిమితమయ్యాయని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయాయని విమర్శించారు. గత పదేళ్ల మోదీ సర్కార్ పాలనలో మన దేశమే చాలా దేశాలకు చేయూతనందిస్తుందని, అనేక విష యాల్లో చేదోడువాదోడుగా నిలుస్తోందన్నారు. రూ.34 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందాయి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓ ప్రభావవంతమైన ముందడుగు పడిందన్నారు. ఎన్నికల్లో గెలి చేందుకు ఉచితాలు ఇవ్వడం వంటి ఆలోచనల నుంచి బయటపడి, దీర్ఘకాలంలో సామాజికంగా లాభం చేకూర్చే కార్యక్రమాలను రూపొందించిందన్నారు. కులమతాలకు అతీతంగా రూ.34 లక్షల కోట్ల విలువ చేసే సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అందించిందన్నారు. కేంద్రం తీసుకొచ్చి న సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా సరాసరి 22 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అత్యంత తక్కువ సమయంలో బీఆర్ఎస్ అంతర్థానం అత్యంత తక్కువ సమయంలో అంతర్థానం కాను న్న పార్టీ బీఆర్ఎస్ అని కిషన్‌రెడ్డి ఒక ప్రశ్నకు బదు లిచ్చారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పర్యటనపై స్పందించాల్సింది ఏమీ లేదని చెప్పా రు. రాష్ట్రంలో ఎన్టీపీసీ ప్లాంట్ శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్, ప్రారంభోత్సవానికి రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తే సీఎంగా కేసీఆర్ ఏ మాత్రం సహకారం అందించలేదని చెప్పారు. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య లపై ఆయన్ను చూసి మనమందరం జాలి పడాల్సి ఉందన్నారు. తాను సీఎం అయినట్టు కేటీఆర్ కలలు కన్నారని, చివరకు అవి విఫలం అయ్యా యని, కేసీఆర్, కేటీఆర్‌ల తప్పిదాల వల్లనే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. -
ఈసారి ఆ తప్పులు చేయొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్టీపరంగా చోటు చేసుకున్న లోపాలు, లోటుపాట్లు ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా కమలదళం జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు పకడ్బందీగా కార్యాచరణ అమలుకు చర్యలు చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక నిర్వహించిన సమీక్షల్లో పార్టీనాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం అనేది ఓటమికి ప్రధాన కారణమని ముఖ్యనేతలు తేల్చారు. మరీ ముఖ్యంగా శాసనసభ ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న పోలింగ్ బూత్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే విషయం కూడా నాయకత్వం దృష్టికి వచ్చింది. అప్పుడు జరిగిన తప్పులేవంటే.. అప్పట్లో మొక్కుబడిగా పోలింగ్‌బూత్ కమిటీలు ఏర్పాటుకావడంతో వాటి నిర్వహణ సరిగా జరగలేదనేది స్పష్టమైంది. అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా.. అందులోని ఒక్కో పోలింగ్ బూత్‌లో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వివిధ వర్గాల మద్దతును కూడగట్టే దిశగా బూత్ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయలేదని వెల్లడైంది. పోలింగ్ సందర్భంగా కూడా ఈ కమిటీల పని విధానం సరిగ్గా లేదని, సభ్యులు అంకితభావంతో బాధ్యతలు నిర్వహించలేదని తేలింది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా బూత్ కమిటీలను ఏర్పాటు చేయకపోయినా పేపర్‌పై వేసినట్టు చూపడం, గతంలో ఎప్పుడో వేసిన కమిటీలే ఎన్నికల నాటికి పనిచేస్తున్నట్టు చూపడం, ఆయా కమిటీల సభ్యులు తమకు బాధ్యతలు అప్పగించిన చోట్ల పనిచేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. వీటితో పాటు బూత్ కమిటీల స్థాయిల్లో మెరుగైన సమన్వయానికి ఉపయోగపడే వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయకపోవడం, ఇంటింటికి వెళ్లి ‘ఓటర్ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్’వంటివి చేపట్టకపోవడం వంటివి ప్రధాన లోపాలుగా నాయకత్వం గుర్తించింది. ఈసారి కాల్‌సెంటర్ ద్వారా బూత్‌ల పర్యవేక్షణ తాజాగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో...గతంలో చేసిన తప్పులు మళ్లీ చోటుచేసుకోకుండా మెరుగైన సమన్వయ, పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు రాష్ట్రంలో పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు పకడ్బందీగా కార్యాచరణ అమలుకు కసరత్తు ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ ద్వారా పోలింగ్ బూత్ కమిటీల కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పార్టీ నుంచి ఒక్కోబూత్‌కు ఒక్కొక్కరికి సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిల్లోనే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కో రాష్ట్రనాయకుడికి పోలింగ్‌బూత్ సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ ద్వారా 17 ఎంపీ సీట్ల పరిధిలో బూత్ కమిటీల నియామకం పూర్తిస్తాయిలో జరిగిందా లేదా ? వాటిలో ఎంత మంది సభ్యులున్నారు.. వారికి అప్పగించిన బాధ్యతలు సక్రంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం సమీక్షించనుంది. -
రైతు ఎజెండాతో జనంలోకి బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంపై భారత్ రాష్ట్ర సమితి దృష్టి సారించింది. ‘రైతు ఎజెండా’తో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. దీనిపై ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో తాము రైతు సంక్షేమం లక్ష్యంగా అమలు చేసిన పథకాలను గట్టిగా ప్రస్తావించాలని భావిస్తోంది. వచ్చే రెండు నెలల పాటు రైతాంగం వరి కోతలు, ధాన్యం అమ్మకాల్లో నిమగ్నం కానుండటంతో ప్రచారంలో ఇవే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే సమర శంఖం పూరించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ తయారవుతోంది. కాళేశ్వరం జలాలు, విద్యుత్ కోతలు, ఎండుతున్న పంటలు, ధాన్యం కొనుగోలుపై బోనస్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ హామీలపై కూడా రైతు ఎజెండాతో పాటు ఆసరా పింఛన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, మహిళకు రూ.2,500 వంటి హామీలపై కాంగ్రెస్ తీరును క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ దిశా నిర్దేశం చేస్తోంది. అదే సమయంలో రామమందిరం అంశాన్ని బీజేపీ సానుకూలంగా మలుచుకుంటుందనే అంచనాతో తామూ రాముని భక్తులమేనని ప్రతిచోటా చెప్తున్న బీఆర్ఎస్ నేతలు.. రామమందిరం పేరిట బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందంటూ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలని నిర్ణయించింది. ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచార సభల షెడ్యూలును ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈలోగా లోక్‌సభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థి, ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాల బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఇప్పటికే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఏకపక్ష విజయాన్ని అందించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్షేత్ర స్థాయి ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు హరీశ్‌రావు మెదక్, వరంగల్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ భేటీలకు హాజరవుతున్నారు. ఉగాది పండుగ లోగా లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉగాది, రంజాన్ పండుగల తర్వాత బహిరంగ సభల ద్వారా కేసీఆర్ ప్రచార పర్వంలోకి అడుగు పెడతారు. ఈ నెల 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభ అనంతరం మరిన్ని సభల నిర్వహణకు షెడ్యూలు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. -
నీ పక్కనే డేంజర్‌గాళ్లు.. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మీకు డేంజర్ నల్లగొండ, ఖమ్మం బాంబులతోనే.. బీఆర్ఎస్తో మీకేం డేంజర్ లేదు. మేమేమీ మీ ప్రభుత్వాన్ని పడగొట్టం. ఏక్నాథ్ షిండేలు మీ పార్టీలోనే ఉన్నారని బీజేపీ వాళ్లే చెబుతున్నారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘మీ వాళ్లే మీ ప్రభుత్వాన్ని పడగొడతారు. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుసగుసలు పెడుతున్నరట. నేనొస్తా.. నేనొస్తా.. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అంటున్నడట. నీ పక్కనే ఉన్నారు డేంజర్ గాళ్లు. మేము కాదు.. ఐదేళ్లు సీఎంగా ఉండు. 450 హామీలు అమలు చెయ్.. లేదంటే వదిలి పెట్టేది లేదు’అని కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత రేవంతే బీజేపీలోకి వెళ్తారు లోక్‌సభ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయట పడటం కోసం రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళతారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయం పదిసార్లు అన్నా రేవంత్‌రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భయమా? భక్తా.. మోదీ దగ్గరకు వెళ్లేందుకు మార్గం వేసుకుంటున్నా రనే సీక్రెట్ బయట పడిందనే ఇబ్బందా చెప్పాలన్నారు. రాహుల్‌గాంధీ ఢిల్లీలో మోదీని దొంగ అని విమర్శిస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం మోదీ మా పెద్దన్న అని అంటున్నారని గుర్తు చేశారు. గుజరాత్లో అంతా స్కామ్‌లు జరుగుతున్నాయని రాహుల్ విమర్శిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తానంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకే ఓటమి పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశా మని కేటీఆర్ అన్నారు. అయి తే చేసిన అభివృద్ధి చెప్పుకోక పోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినట్లుగా ఓయూ విద్యార్థుల సర్వేలో తేలిందని తెలిపారు. పదేళ్లలో 1,63,283 ఉద్యోగాలు ఇచ్చా మని, ఈ విషయాన్ని యువ తకు, నిరు ద్యోగులకు, ప్రజలకు చెప్పి వారి మనసు గెలుచుకోలేకపోయామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, పెళ్లి చేసుకుని సంసారం చేస్తేనే పిల్లలు పుడతారు కదా.. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకే వాళ్లు ఉత్తర్వులు ఇచ్చారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 73 శాతం మేర జీతాలు పెంచినా, నెలలో మొదటి రోజు జీతాలు పడటం లేదని వారు దూరమయ్యారని అన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులతో ఇవ్వలేకపోతున్నామని ఉద్యోగులకు సర్ది చెప్పడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే కరువు 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నల్లగొండ రూరల్: ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఏర్పడిన కరువు’అని కేటీఆర్ చెప్పారు. పంటలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతుంటే సీఎం, మంత్రులు రైతులకు ధైర్యం చెప్పడం లేదని, పొలాలను పరిశీలించడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామానికి చెందిన రైతులు గన్నెబోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డి నివాసాలకు ఆయన వెళ్లారు. మల్లయ్య యాదవ్‌కు బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఇచ్చిన రూ.లక్ష చెక్కును అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో రెండు పంటలకు సాగునీరు అందేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని, ఎండిన వరికి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని, క్వింటాల్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ఈ నెల 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. ‘చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు అది కూడా కూలిపోయింది. నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బకాయిలు చెల్లిస్తాం. డిఫాల్ట్ కాబోము. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. ఐఐటీలో చదివిన ఐఏఎస్‌లను డిస్కంలకు చీఫ్‌లను చేశాం. కేసీఆర్ మాత్రం ఒక అకౌంటెంట్‌ను సీఎండీ చేశారు’ అని భట్టి విమర్శించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి -
‘కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి’
నల్లగొండ: జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, జేబుదొంగలే ఆ పని చేస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్లగొండ లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటున్నారు. బోటీ కొట్టేవాళ్లే ఆ పని చేస్తారు. ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నల్లగొండ, ఖమ్మంలో ఉన్నవారితోనే నీకు(సీఎం రేవంత్‌రెడ్డి) ప్రమాదం ఉంది. కేసీఆర్ పర్యటన వీడియోలు చూస్తుంటే నల్లగొండలో ఎలా ఓడిపోయామని అనిపించింది.ఎన్నికల ముందు నల్లగొండ జిల్లాలో జరిగిన సభలకు హాజరైతే జనాలు బ్రహ్మాండగా వచ్చారు. నల్లగొండ జిల్లాలో ఏడెనిమిది సీట్లు వస్తాయని అనుకున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా ఆత్మవిమర్శ చేసుకుందాం. భారతదేశంలోనే అత్యధికంగా లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి కూడా వారి మనసు గెలుచుకోలేదు. ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చానని రేవంత్ అంటున్నారు. నోటిఫికేషనే ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారో రేవంత్ చెప్పాలి.పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు 70-80 శాతం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేశారు. 73 శాతం జీతం పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఒకటిన జీతాలు ఇవ్వకపోయినందుకు బీఆర్ఎస్కు దూరం అయ్యారు. రైతులకు కేసీఆర్ చేసినంత మేలు దేశంలో ఎవరూ చేయలేదు. రైతుబంధు, 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. రైతులు కూడా బీఆర్ఎస్కు దూరం అయ్యారు. జిల్లాలో ఫ్లోరోసిస్ బూతాన్ని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీ. ఆ బూతాన్ని తరిమికొట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నాయకులు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు.బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి ప్రజల తప్పు కాదు నాయకులదే. పదేళ్ల నిజం ఎదుట వంద రోజుల అబద్ధం కనిపిస్తోంది.ముషంపల్లికి చెందిన రైతు మల్లయ్య మాట్లాడిన వీడియో చూస్తే బాధనిపించింది. గతంలో పది అసెంబ్లీ సీట్లు గెలిస్తే రెండు లోక్ సభ సీట్లు ఓడిపోయాం. నల్లగొండలో రెండు లోక్ స్థానాలను గెలవాలి. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ అన్నారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి. మోసపోయినవాళ్లు బీఆర్ఎస్కు ఓటేయండి. 110 రోజులు అయినా రైతుబంధు రాలేదు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కొమటిరెడ్డి అంటున్నారు. ఇంకో మంత్రి ఉత్తమ్ రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు రూ. 15 వేలు కావాలన్నా క్వింటాల్‌కు రూ. 500 బోనస్ రావాలన్నా, రుణమాఫీ కావాలన్నా బీఆర్ఎస్కు ఓటేయండి.రేవంత్ మోదీ కోసం పనిచేస్తుండా లేక రాహుల్ కోసమా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌కు దేశంలో నలభై సీట్లు గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ అంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే. వరి పండించే విషయంలో నల్లగొండను దేశంలో నంబర్ వన్‌గా నిలిపాం. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని రాహుల్, రేవంత్ అన్నారు.. మోదీ దొంగ అని రాహుల్ అంటున్నారు. రేవంత్ మాత్రం మోదీని పెద్దన్న అంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. -
‘కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి’
నల్లగొండ: జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, జేబుదొంగలే ఆ పని చేస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్లగొండ లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటున్నారు. బోటీ కొట్టేవాళ్లే ఆ పని చేస్తారు. ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నల్లగొండ, ఖమ్మంలో ఉన్నవారితోనే నీకు(సీఎం రేవంత్‌రెడ్డి) ప్రమాదం ఉంది. కేసీఆర్ పర్యటన వీడియోలు చూస్తుంటే నల్లగొండలో ఎలా ఓడిపోయామని అనిపించింది. ఎన్నికల ముందు నల్లగొండ జిల్లాలో జరిగిన సభలకు హాజరైతే జనాలు బ్రహ్మాండగా వచ్చారు. నల్లగొండ జిల్లాలో ఏడెనిమిది సీట్లు వస్తాయని అనుకున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా ఆత్మవిమర్శ చేసుకుందాం. భారతదేశంలోనే అత్యధికంగా లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి కూడా వారి మనసు గెలుచుకోలేదు. ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చానని రేవంత్ అంటున్నారు. నోటిఫికేషనే ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారో రేవంత్ చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు 70-80 శాతం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేశారు. 73 శాతం జీతం పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఒకటిన జీతాలు ఇవ్వకపోయినందుకు బీఆర్ఎస్కు దూరం అయ్యారు. రైతులకు కేసీఆర్ చేసినంత మేలు దేశంలో ఎవరూ చేయలేదు. రైతుబంధు, 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. రైతులు కూడా బీఆర్ఎస్కు దూరం అయ్యారు. జిల్లాలో ఫ్లోరోసిస్ బూతాన్ని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీ. ఆ బూతాన్ని తరిమికొట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నాయకులు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు.బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి ప్రజల తప్పు కాదు నాయకులదే. పదేళ్ల నిజం ఎదుట వంద రోజుల అబద్ధం కనిపిస్తోంది. ముషంపల్లికి చెందిన రైతు మల్లయ్య మాట్లాడిన వీడియో చూస్తే బాధనిపించింది. గతంలో పది అసెంబ్లీ సీట్లు గెలిస్తే రెండు లోక్ సభ సీట్లు ఓడిపోయాం. నల్లగొండలో రెండు లోక్ స్థానాలను గెలవాలి. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ అన్నారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి. మోసపోయినవాళ్లు బీఆర్ఎస్కు ఓటేయండి. 110 రోజులు అయినా రైతుబంధు రాలేదు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కొమటిరెడ్డి అంటున్నారు. ఇంకో మంత్రి ఉత్తమ్ రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు రూ. 15 వేలు కావాలన్నా క్వింటాల్‌కు రూ. 500 బోనస్ రావాలన్నా, రుణమాఫీ కావాలన్నా బీఆర్ఎస్కు ఓటేయండి. రేవంత్ మోదీ కోసం పనిచేస్తుండా లేక రాహుల్ కోసమా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌కు దేశంలో నలభై సీట్లు గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ అంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే. వరి పండించే విషయంలో నల్లగొండను దేశంలో నంబర్ వన్‌గా నిలిపాం. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని రాహుల్, రేవంత్ అన్నారు.. మోదీ దొంగ అని రాహుల్ అంటున్నారు. రేవంత్ మాత్రం మోదీని పెద్దన్న అంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. -
కడియంను ఓడించాలనే కసి మీలో కనిపిస్తోంది: హరీశ్‌రావు
సాక్షి, హన్మకొండ: కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్ పెరిగిందని, ఆయనకు గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్ రావు కడియంపై మండిపడ్డారు. ‘కడియంకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. కడియంపార్టీ ఎందుకు మారారో చెప్పాలి. కాంగ్రెస్‌లో కడియం ఇంకో గ్రూప్ పెడతారా?. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి’ హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తనకు కుమార్తెకు ఎంపీ టికెట్ అడిగి.. చివరి నిమిషంలో బీఆర్ఎస్కు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హరీష్ కోరారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కావ్య మా నాన్న(కడియం) బ్రాండ్ అంటోంది.. వెన్నుపోటు పొడవటంలోనా బ్రాండా? ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం. ఆరూరి రమేష్, పసునూరి దయాకర్‌ను వెళ్లగొట్టిందే కడియం. కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరు. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’అని పల్లా మండిపడ్డారు. -
బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్‌కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కి లేదు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. -
ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్‌గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్‌రావు తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు -
రేపే ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసింది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, రఘువీరారెడ్డి, జెడి శీలం హాజరయ్యారు. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించారు. ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్‌లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేయగా.. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఖారారు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు పార్లమెంటు స్దానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థులపైనా ఇవాళో, రేపో స్పష్టత వచ్చే అవకావం ఉంది. -
మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం
సనత్‌నగర్: బీజేపీకి గల్లీగల్లీలో బలమైన నాయకత్వం ఉందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బేగంపేట, భగవంతాపూర్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీ, బ్రాహ్మణవాడీ బస్తీలతో పాటు బేగంపేట ఆర్యసమాజ్ భవన్ ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం ధర్నాలు చేసేవారని, 6 గంటల కంటే ఎక్కువగా కరెంట్ వాడితే పరిశ్రమలు మూసివేస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే మోదీ వచ్చాక విద్యుత్ కోతలు లేని దేశం ఆవిష్కృతమైందన్నారు. గత పదేళ్లుగా దేశంలో మత కలహాలు, బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు లేవన్నారు. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. బేగంపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లతో పాటు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మోదీ పాలనతో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో బేరీజు వేయాలన్నారు. -
కరువుతో కేసీఆర్ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా? అని మాజీ సీఎం కేసీఆర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అథోగతికి మీరు కారణం కాదా? అని ప్రశ్నించారు. కేవలం రైతుబంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఒక్క రైతునైనా ఆదుకున్నారా? అని నిలదీశారు. కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన రూ.10,000 అయినా నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా? కేవలం మెదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు జీవో ఇచ్చి డబ్బు విడుదల చేయలేదని గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ కాదా? అని తుమ్మల నిలదీశారు. -
ఇక్కడ బీజేపీకి ఒక్క ఎంపీ సీటూ రావొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తొందని... మతోన్మాద వాతావరణాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీ ఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం జరగ్గా ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గద్దెదించడం తక్షణ రాజకీయ కర్తవ్యమన్నారు. బీజేపీలో ఉంటే నీతిపరులు లేదంటే అవినీతిపరు లు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019లో వచ్చిన ఫలితాలు రావేమోననే భయంతోనే బీజేపీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిందని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ అప్రజాస్వామికం: ఎస్ వీరయ్య ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం అప్రజాస్వామికమని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవితో పాటు కరువు ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా కు రూ. 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరిన వీరయ్య.. మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్ల మెంటు ఎన్నికల్లో సీపీఐ వైఖరిని ప్రకటించాలని ఆయన కోరారు. అవసరమైతే సీపీఐ, సీపీఎం సంప్రదించుకుంటాయని, వర్తమాన రాజకీయ పరిణామాలను చూసి ఎవరికి మద్దతివ్వాలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వీరయ్య వెల్లడించారు. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోవుడే!
సాక్షి, కామారెడ్డి: ‘‘ఎన్నికల హామీ లను విస్మరించిన కాంగ్రెస్ ప్రభు త్వంపై తక్కువ రోజుల్లోనే ప్రజ ల్లో వ్యతిరేకత మొదలైంది. దీంతో లీకులు, ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెల వాలని చూస్తున్నరు. పొరపాటున ఈసారి కూడా వాళ్లకు ఓటేస్తే మోసపోవుడే. రూ.2 లక్షలు రుణం మాఫీ చేయకున్నా, రూ.5 వందల బోనస్ ఇవ్వకున్నా, మహి ళలకు రూ. 2,500 జమ చేయకు న్నా తమకు ప్రజలు ఓట్లేశారని తప్పించుకునే ప్రమాదం ఉంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యా ఖ్యానించారు. ఆదివారం కామా రెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి, లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావే శాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లా డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో నాలుగు కూడా పూర్తి చేయని సీఎం రేవంత్‌రెడ్డికి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. కడియం, దానం రాజీనామా చేయాలి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. నాలుగు రోజులైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లలో వాళ్లు తన్నుకుంటారన్నారు. సగం జిల్లాలు తగ్గిస్తడట పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ కొత్త జిల్లాల ను ఏర్పాటు చేశారని, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పు డు సీఎం రేవంత్‌రెడ్డి 17 జిల్లాలు సరిపోతాయని అంటుండని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ జిల్లా రద్దవుతుందని ఆయన హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన బీబీ పాటిల్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా, లింగంపల్లిలో ఎండిపోయిన వరి పంటను హరీశ్‌రావు పరిశీలించారు. ఎండిపోయిన పంటలకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేసీఆర్
ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్టేసినట్టుగా బంద్ అవుతదా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేం టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖను నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టే సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్‌ను నియమించారు. వారికి విషయం పట్టుబడదు.. మంత్రులు పట్టించుకోరు. తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉందిగానీ.. ప్రజల కోసం తీరిక లేదు. సీఎం ఎక్కడ పడుకున్నరు? గత డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్లయింది? నాలుగు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నరు? ఎక్కడ పడుకున్నరు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8 శాతం ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమికొడతాం. నిద్రపోనియ్యం. వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసమర్థ, తెలివిలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడుతామన్నారు. ధర్నాలు చేస్తామని.. అవసరమైతే ఎక్కడికక్కడ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏప్రిల్ 2, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించా. చాలాచోట్ల రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే నమ్మి పంటలు వేశామని.. మొదటే ఇవ్వబోమని చెప్పి ఉంటే వేసుకునే వాళ్లం కాదని వాపోయారు. ప్రభుత్వం మొదట ఇచ్చి తర్వాత బంద్ చేసి నష్టం చేకూర్చిందని బాధపడ్డారు. మేం ఏడెనిమిదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణతో, స్పష్టమైన విధానాలతో రైతులు బాగుపడేలా చేశాం. ఇన్నాళ్లూ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో వంద రోజుల్లోనే దుర్భరమైన పరిస్థితిని చూస్తామనుకోలేదు. రైతులు ఇంతగా ఏడ్చే పరిస్థితి వస్తుందనుకోలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం.. మేం రూ.35వేల కోట్లు వెచ్చించి అగ్రగామిగా నిలిపిన విద్యుత్ రంగం.. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఉన్న వ్యవస్థను ఉన్నట్టు నడిపించలేని ఈ అసమర్థత ఏందీ? ఉన్న దాన్ని ఉన్నట్టు నడిపించే తెలివిలేకపోతే ఎలా? ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యమే. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మేం పవర్‌గ్రిడ్‌కు అనుసంధానించి.. కరెంట్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ తీసుకునే విధంగా చేశాం. 7వేల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని 18 వేల మెగావాట్లకు పెంచాం. అదనంగా 1,600 రామగుండంలో, 4 వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో కలిపి 5,600 మెగావాట్లు అదనంగా వచ్చే పరిస్థితి కల్పించాం. ఈ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్‌ను పట్టించుకోవడం లేదు. పట్టించుకుని ఉంటే రెండు యూనిట్ల ద్వారా సొంతంగా మరో 1,500 మెగావాట్లు వచ్చేది. ఇంత ఉజ్వలమైన పవర్ సిస్టం ఉన్నా ఎందుకు ఇబ్బంది అవుతోంది? అవసరమైనప్పుడు కరెంటు కొనాలె.. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వం అప్పులు చేయాలె. పీక్ అవర్స్‌లో ఎంత షార్టేజ్ ఉంటే అంత కరెంటు కొనాలి. రైతులకు ఇవ్వాలి. మేం అదే చేశాం. అందుకే ఆనాడు రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మేం ఉన్నప్పటికంటే ఇప్పుడు లోడ్ ఐదారు వందల మెగావాట్లు డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వం అవసరమైనంత కొంటలేదు. అందుకే కరెంటు వస్తలేదు. ఎనిమిదేళ్లుగా కాలిపోని మోటార్లు ఇప్పుడు కాలిపోతున్నాయని చాలా మంది రైతులు చెప్పారు. రోజుకు ఆరేడుసార్లు వస్తోంది, పోతోంది. అయినా సర్కారుకు చీమ కుట్టినట్టు లేదు. మేం రైతుల గురించి రూ.20, 30 వేల కోట్లు అయినా పెట్టాం. గట్టిగా పంటలు పండితే అవి నాలుగేళ్లలో తీరిపోయాయి. పంటలు ఎందుకు ఎండుతున్నాయి రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లానే లేదు. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. ప్రతి ఊళ్లో 200 నుంచి 400 ఎకరాల దాకా ఎండిపోతోంది. సాగర్ ఆయకట్టు ఎందుకు ఎండుతోంది? ఈ రోజు కూడా సాగర్‌లో మినిమమ్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్) కంటే పైన 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కింద మరో ఏడెనిమిది టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 14, 15 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ తెలివి హీనంగా సాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించి, సాగర్ కట్టమీదకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చారు. ప్రభుత్వం మెడలు వంచుతాం ఖమ్మం, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. రూ.500 కోట్లను రైతులకు అందించాం. అప్పుడు అది సరిపోదని, రూ.20 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే వడగళ్ల వాన పడి నష్టపోతే అడిగే దిక్కులేదు. అకాల వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్నా.. మాట్లాడేవాళ్లు లేరు. మంత్రి పోడు, ఎమ్మెల్యే పోడు.. ఎంపీలు పోరు, అధికారుల బృందాలు పోవు.. దొంగల్లా ముఖం చాటేస్తారు. ముఖ్యమంత్రికి పట్టింపే లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఏయే జిల్లాల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతెంత పంట ఎండిపోయిందనే లెక్కలు తీయాలి. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం. ఎక్కడికక్కడ మంత్రులు, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి. కచ్చితంగా లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజారుకీడుస్తాం. హామీ ఇచ్చినట్టుగా వరికి రూ.500 బోనస్ కూడా ఇవ్వాలి. ఇందుకోసం కోసం ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాం. హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యేలు, మేము ఇస్తాం. 6వ తేదీన నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేస్తాం. కళ్లాల వద్ద నిలదీస్తాం. ఆత్మహత్యలు చేసుకోవద్దు నేను రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. మీ తరపున పోరాడుతాం. నేను మీ వెంటే ఉంటా. హక్కులను సాధించుకుందాం..’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చిల్లర రాజకీయాలతో కాళేశ్వరంలోని నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీల్లో నీటిని వదిలిపెట్టి, సీపేజీలో పోయే నీటిని ఫొటోలు తీసి, వీడియోలు తీసి, ప్రాజెక్టు ఖతం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. నిన్న యూపీలోనో, బిహార్‌లోనో బ్రిడ్జి కూలిపోయింది. ప్రపంచం మునిగిపోయిందా? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాట్లాడుతున్నరు. నాగార్జునసాగర్ కుడివైపు కుంగలేదా? పునరుద్ధరించలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలో ఓ డ్యాం నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వారు విడిచిపెట్టారా? కొందరు ఇంజనీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన సమస్యతోనో, జియాలజీ సమస్యతోనో ఓ పిల్లర్ కింద ఇసుక కొట్టుకపోతే.. ప్రపంచం బద్ధలైనట్టు, ప్రళయం వచ్చినట్టు చిల్లర కథలు చెప్పి నీళ్లివ్వడం లేదు. మరి సమ్మక్క బ్యారేజీకి ఏమైంది. దేవాదుల నుంచి ఎందుకు పంప్ చేయట్లేదు. ఒక్కసారిగా నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలు కొనియాడిన మిషన్ భగీరథ ఉండగా ఎందుకు మంచి నీళ్ల కొరత వచ్చింది? ఐదేళ్లు బ్రహా్మండంగా నడిచిన పథకంలో ఎందుకు లోపం వస్తుంది? ఎందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్? ఎందుకు నీటి సమస్య వస్తోంది. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది? ఇందుకు కారణం సీఎం, మంత్రులే. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే సమీక్ష చేయడం లేదు. వారికి పట్టింపు లేదు. పథకాన్ని వాడుకునే తెలివి లేదు. ఏదైనా పాడైతే ఇప్పుడు 15 రోజులైనా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలంటే నాణ్యమైన విద్యుత్ 24 గంటల సరఫరా ఉండాలి. దానిపై దృష్టి లేదు. జూన్ దాకా అంటే మరో మూడు నెలల వరకు వానలు పడే అవకాశం లేదు. ఇంకా నీటి సమస్య తీవ్రం కాకుండా మిషన్ భగీరథను పునరుద్ధరించాలి. -
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్రావు నిజామాబాద్- సుదర్శన్‌రెడ్డి ఆదిలాబాద్-సీతక్క కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్‌బాబు హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్-సంపత్, చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి మల్కాజ్గిరి-మైనంపల్లి హన్మంతరావు మెదక్- కొండా సురేఖ జహీరాబాద్-దామోదర రాజనర్సింహ -
ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కూటమి డిమాండ్ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సొరేన్‌లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్‌పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, హేమంత్‌సోరేన్ భార్య కల్పన సోరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి -
వంద రోజుల్లో తెలంగాణ అస్తవ్యస్తమైంది: కేసీఆర్
సాక్షి,సూర్యాపేట: కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిపెట్టి నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. తమకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. మూడు నెలల్లోనే ఈ పరిస్థితంటే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే భయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ‘చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్’ అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న చేస్తానన్న రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 వెళ్లి ఎన్నిరోజులైందని నిలదీశారు. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ‘రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థత, తెలివితక్కువతనమే ఈ పరిస్థితికి కారణం. రైతులు నష్టపోతే ప్రస్తుత ప్రభుత్వంలో పట్టించుకునేవాడు దిక్కులేడు. ఎండిపోయిన పంటలపై నివేదిక తెప్పించుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఊరుకోదు. వెంట పడతాం. మెడలు వంచుతాం. ఒకరిద్దరని గుంజుకుని చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ఎండిన పంటలకుగాను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మూడు నెలలు ఓపిక పట్టి నాలుగో నెలలో మాట్లాడుతున్నాం. వాగ్దానాలు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదు. రైతులకు రూ.500 బోనస్, రుణమాఫీ ఇతర హామీలపై దీక్షలు, ధర్నాలు చేస్తాం. నీళ్లిస్తామంటే నమ్మి పంటలు వేశామని రైతులు పొలంబాటలో నాతో చెప్పారు.రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మా హయాంలో నీరు,24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం చేశాం. కొనుగోలు కేంద్రాలు, రైతు బీమా అమలు చేశాం. 2014లో 30-40 లక్షల టన్నుల ధాన్యం కూడా పండకపోయేది. కానీ ఆ తర్వాత మూడు కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించాం. త తక్కువ కాలంలో రైతులు బాధపడతారు అనుకోలేదు.జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించాం. కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు.నీళ్ళు ఇస్తామని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు ఓట్లు వేయించుకొని నీళ్ళు ఇవ్వలేదు.ముందే తెలిస్తే ఓట్లు వెయ్యకపోయే వాళ్లమంటున్నారు. రైతులకు కావాల్సింది నీళ్ళు,పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, పంట కొనుగోలు చేయటం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రాజకీయనాయకులు రాష్ట్రం మేలు కాంక్షించాలి. రాజకీయాలన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. స్వల్ప కాలంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. హైదరాబాద్‌లో నీటి కటకట ప్రారంభం అయ్యింది. నీటి ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి హైదరాబాద్ ప్రజలకు వచ్చింది. మా హయాంలో తెలంగాణలో బిందె పట్టుకున్న ఆడబిడ్డ కనిపించలేదు. ఇప్పుడు నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి. మళ్లీ స్టెబిలైజర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. న్యూయార్క్, లండన్ లో కరెంట్ పోతుంది కానీ తెలంగాణ లో పోదు అనే స్థాయికి తెచ్చా’ అని కేసీఆర్ చెప్పారు. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీనికి స్పందించిన కేసీఆర్ కరెంటు ఇట్లా వస్తూ పోతుందన్నారు. ఇదీ చదవండి.. జనగామలో పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ -
కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడియం శ్రీహరి, కావ్యకు దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కే. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఫిరాయింపులు మొదలయ్యాయి. పలువురు నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వరసగా కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటం ప్రతిపక్ష బీఆర్ఎస్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారి విజయం సొంతం చేసుకున్న కాంగెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అధిక సీట్ల గెలుపే టార్గెట్‌గా పావులు కదుపుతోంది.