breaking news
-
మిస్టర్ రేవంత్.. అంత వరకు నేను ఆగను: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అంటూ విమర్శించారు. ఇదే సమయంలో తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, తాను మాత్రం ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అంటూ వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు.నీ రెండు నాలుకల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. #CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. మిస్టర్ @revanth_anumula అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024 -
ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్‌రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్‌షీట్: హరీశ్‌రావు -
కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క
సాక్షి, హైదరాబాద్: ‘పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు, వేగు చుక్క. రేవంత్‌రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిధులు పారితే రేవంత్ పాల నలో తిట్లు పారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడి తిట్ల దండకం చదువు తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం తన నివా సంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు.‘బీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఉ ద్యమ కాలంనుంచి అనేక కష్టాలను తట్టుకుని కార్యకర్తల బలంతో బీఆర్ఎస్ నిలబడింది. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే వారే నిజమైన కా ర్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమ లు చేయని తీరును ప్రజల్లో ఎండగట్టాలి’ అని కవిత దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దుర్మార్గమని అన్నారు. అఖిల భార త పద్మశాలి సంఘం నాయకులు కవితను కలిసి కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి జాగృతి సమీక్షలు...ఉమ్మడి జిల్లాల వారీగా ఈనెల 4 నుంచి తెలంగాణ జాగృతి సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్లగొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు ఉంటాయి. 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో కవిత సమావేశమవుతారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై 7న చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాలుకల మనిషి అని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ప్రజలను నిలువునా ముంచేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. పూటకో రకంగా మాట్లాడే విద్యలో రేవంత్ పీహెచ్డీ చేశాడని ఎద్దేవా చేశారు. రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సవివర చార్జిషీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, చిరుమర్తి లింగయ్య తదితరులతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది పాలనలో సీఎం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టే ఆణిముత్యాలు’ అంటూ వివిధ అంశాలపై రేవంత్ చేసిన ప్రకటనల వీడియో క్లిప్పింగులను హరీశ్‌రావు విడుదల చేశారు.ఏడాది పాలనలో ఎడతెగని వంచనతెలంగాణ ప్రజలను మోసగించడం, వంచించడం రేవంత్ నైజమని హరీశ్ విమర్శించారు. ఏడాది నుంచి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగుతోందని.. సీఎం అపరిచితుడిలా పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని... కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని ప్రకటించిన రేవంత్ ప్రస్తుతం మాట మార్చారని ఆరోపించారు.‘బతుకమ్మ చీరల పథకం, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కుల సర్వే, ఆక్రమణల కూల్చివేతలు వంటి అంశాలపై రేవంత్ మాటలు మారుస్తున్నారు. ఏక్ పోలీసు విధానం, మద్యం, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై రేవంత్ మాటలు మార్చారు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అన్నారు.. ఇప్పుడు అమ్మ అంటున్నారు. రేవంత్ అవసరమొస్తే కాళ్లు పట్టగలడు, అవసరం తీరిన తర్వాత కాళ్లు లాగగలడు..’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.నిర్బంధాలు, అణచివేతలే..కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పిందని... గత ఏడాది పాలనలో నిర్బంధాలు, అణచివేతలు, లాఠీచార్జీలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యం అయ్యాయని హరీశ్ ఆరోపించారు. న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై కేసులు, లగచర్ల గిరిజనులపై దాడులు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారని.. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాలరాసి, రాక్షస పాలన కొనసాగిస్తురని మండిపడ్డారు. విపక్ష నేతగా నక్సలైట్లపై మొసలి కన్నీరు కార్చిన రేవంత్.. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. -
ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత విద్యా, వైద్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. 7 వేల 750 మంది నర్సులకు నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఏడాదిలోపు వైద్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వైద్యశాఖలో ఉద్యోగాలు భర్తీ చేయలేదని అన్నారు. వైద్యశాఖ బలోపేతం అయితేనే తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది.హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో సోమవారం ప్రజాపాలన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఇందులో 108 కోసం 136 అంబులెన్స్‌లు, 102 కోసం 77 అంబులెన్స్‌లు ఉన్నాయి. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు. అదే విధంగా 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను, 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సహ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..గతంలో ప్రశ్నాపత్రాలు జీరాక్స సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి. గత ప్రభుత్వం ఏ రోజు చిత్తశుద్దితో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదుఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీస్వతంత్ర భారతదేశంలో ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రానికి లేదుఈ తెలంగాణ సమాజమే మా కుటుంబంవాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టినందుకే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయితెంగాణ వచ్చాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదుపదేళ్లుగా పరీక్షలు వాయిదా వేసుకుంటూ వచ్చారు.డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు చేయించారుఅధికారంలో వచ్చిన వెంటనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం.రూ. 830 కోట్లు సీఎం రిలీఫ ఫండ్ ద్వారా పేదలకు వైద్యం అందించాంరూ. 500 కే సిలిండర్ అందిస్తున్నాంరైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయి -
రేవంత్.. మీ గురువులకే చుక్కలు చూపించిన వ్యక్తి కేసీఆర్: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అంటూ కామెంట్స్ చేశారు.కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ ఒక వేగుచుక్క.రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్. గత కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవి.. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయి. బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై లేని పన్నులు.. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మాత్రం జీఎస్టీ రూపంలో విధించడం మన దౌర్భాగ్యం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. -
అన్నీ అబద్ధాలు.. అసత్య ప్రచారాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ‘ఈ సర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరు. ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడు. మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడు’అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్‌రావు పేర్కొన్నారు.సీఎం రేవంత్ అపరిపక్వత (ఇమ్మెచ్యూరిటీ), అసమర్థత (ఇన్ క్యాపబులిటీ), ప్రతికూల వైఖరి (నెగెటివ్ ఆటి ట్యూడ్)తో రాష్ట్రంలో అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొందన్నారు. ‘మేము మంచి ఆర్థిక/వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థికవృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు.కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగ ఉంది’అని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పిన విషయం. నీకు గుర్తులేకపోవచ్చు రేవంత్‌రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
బహిరంగ చర్చకు రండి.. చార్జిషీట్ సంగతి తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జిషీట్ అంటూ బీజేపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనపై ఆ పార్టీ నేతలు తమతో బహిరంగ చర్చకు వస్తే చార్జిషీట్ సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. తమతో చర్చకు వచ్చే సత్తా బీజేపీ నేతలకు ఉందా అని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో తెలంగాణలో అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాము చర్చకు రెడీగా ఉన్నామని చెప్పారు.ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని, వంద రోజుల్లో అన్ని ధరలు తగ్గిస్తామని, డాలర్‌కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, రూ.50కే లీటర్ పెట్రోల్ ఇస్తామని చెప్పిన బీజేపీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించి ప్రభుత్వాలను కూల్చా రని, దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను చేర్చు కున్న బీజేపీ నేతలు తమకు సుద్దులు చెబుతారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగ తీవ్రత ఉందని గుర్తు చేశారు.2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను తీసుకొని ఆ పార్టీ నేతలు వస్తే, తమ 2023 ఎన్నికల మేనిఫెస్టోను తీసుకొని తాము వస్తామని, ఏడాదిలో ఏం చేశామో తాము చెబుతామని, పదేళ్లలో ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని మరోమారు రుజు వైందని, సమయం వచ్చినప్పుడల్లా ఆ పార్టీలు ఏ టీం, బీ టీంలా వ్యవహరి స్తాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నందుకే తెలంగాణలో బీజేపీ అడుగంటిపోతోందని, ఇప్పుడు చార్జిషీట్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు కవల పిల్లల్లాంటివని ఈ చార్జిషీట్‌తో రుజువైందన్నారు. ఏడాదిగా తాము చేస్తున్న కార్యక్రమాలేవీ బీజేపీ నేతలకు కనపడడం లేదా అని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు. -
ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని మాల సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం ‘మాలల సింహగర్జన’ బహిరంగసభ నిర్వహించారు.చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సభకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షత వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మాల సామాజికవర్గం నేతలు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పొందుపరిచిన రిజర్వేషన్ల సూత్రాలకు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మనువాదుల అండతో ఎస్సీలను చీల్చే కుట్రకు దిగారని ఆరోపించారు. మాలలకు అండగా ఉంటా: వివేక్మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసినా వెనక్కి తగ్గలేదని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మాలలందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుల వివక్ష నుంచి దళితులకు స్వాతంత్య్రం కల్పించేందుకు బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. తన తండ్రి వెంకటస్వామి దళితుల కోసమే పోరాడారని.. మాల, మాదిగ అనే తేడా చూడలేదని తెలిపారు. మాలలు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తాను మంత్రి పదవి కోసమే మాలల పోరాటాన్ని మొదలుపెట్టానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. తాను పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు జరుగుతున్న కుట్రలను దళిత సమాజం గుర్తించాలని కోరారు. మాల, మాదిగలు కలిసి పోరాడాలి: ఎంపీ మల్లు రవిరిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి పిలుపుని చ్చారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించి, రిజర్వే షన్లను ఎత్తేసేలా చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. మాల, మాదిగలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల ని సూచించారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ల అమ లుకు ఉద్యమించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు, వర్గాలు మాలలపై దోపిడీదారుల ముద్ర వేశాయని ఆరోపించారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను తాము అడ్డుకోవడం లేదని, అందరికీ సమ న్యాయం కావాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి శంకర్ రావు చెప్పారు. మాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. సభలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే శ్రీగణేష్, పాశ్వాన్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధివిధానాల పై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. మరో నాలుగేళ్లకు అవసరమైన శక్తి లభించింది ‘2023 వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతుబంధు కింద చెల్లించాం. శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి మా ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు. తద్వారా మిగిలిన నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ఇంధనశక్తి మాకు లభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలన అనంతరం 2023 డిసెంబర్ 7న రూ.7 లక్షల కోట్ల అప్పులతో మా ప్రభుత్వం ఏర్పడింది. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా రూ.6,500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిలో మేం అధికారం చేపట్టాం. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు కలిగి ఉన్నట్టు నాటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్లు ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను వివరించాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు.. ‘రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణమాఫీని 100 శాతం పూర్తి చేశాం. బ్యాంకర్లు మాకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఏదైనా కారణాలతో బ్యాంకర్ల నుంచి వివరాలు అందక ఎవరిదైనా రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిశీలించి రుణమాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు. పంట పొలాలను తనఖా పెట్టి వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సైతం బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడంతోనే గతంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలున్నట్టు చెప్పాం. తప్పుడు సమాచారమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించడంతో బ్యాంకులు వివరాలను సరిచేసి ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు సంబంధించిన రూ.17,869 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నాలుగో విడతగా శనివారం మహబూబ్‌నగర్ సభలో రూ.2,747 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మొత్తం 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది గొప్ప రికార్డు..’ అని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ధాన్యమే పేదలకు ఇస్తాం.. ‘సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లింపు యాసంగి పంటకు సైతం కొనసాగిస్తాం. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇక్కడ పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలి. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలో సైతం తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. గుజరాత్లో మధ్య నిషేధం ఉందని బీజేపీ అంటోంది. కావాలంటే ఇక్కడి నుంచి గుజరాత్‌కు మీడియాను తీసుకెళ్లి ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తా. కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో మేమిచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ రూ.3,331 కోట్లే..‘రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఏక మొత్తంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి నాలుగున్నరేళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన రూ.11 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ నాలుగున్నరేళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద రూ.8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా రెండో పర్యాయంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ రూ.3,331 కోట్లు మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
బీజేపీ ఛార్జ్‌షీట్‌పై కాంగ్రెస్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్ : బీజేపీ ఛార్జ్‌షీట్‌పై పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలం పాలనపై .. కేంద్రంలోని బీజేపీ తన 10 ఏళ్ల పాలనపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాడి పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ బీజేపీకి పలు ప్రశ్నలు సంధించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పారు. నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేస్తాం అన్నారు. వంద రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తాం అన్నారు.. డాలర్ కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని అన్నారు.50 రూపాయలకే లీటర్ పెట్రోల్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతాం అన్నారు.. ఏమయ్యాయి?దేశంలో వందలాది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలోకి మార్చారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు.మతతత్వ రాజకీయాలు చేస్తూ.. పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు సుద్దాపూస మాటలు మాట్లాడుతుంది.రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసకోవడంతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. కాబట్టే రాష్ట్రంలో ఇలా ఛార్జ్‌షీట్ పేరుతో రాజకీయాలు చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టీంగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైంది.సార్వత్రిక ఎన్నికల్లో రహస్య ఒప్పందం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మోదీ గ్యారెంటీ పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది. 2014 నుంచి 2024 వరకు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? దీనిపైన చర్చించడానికి సిద్ధమా?కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్దమా? రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు రూ. 54 వేల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేసింది. దీనిపై చర్చిద్దామా? దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీకి కనిపించడం లేదా? -
‘రేవంత్ భాష మార్చుకుంటే మేం చర్చకు సిద్ధం’
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై చర్చకు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట కిషన్‌రెడ్డి ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భాష మార్చుకుంటేనే రేవంత్‌రెడ్డితో చర్చకు వస్తాం.కేసీఆర్ లాగా అదే భాష కాకుండా.. నిర్మాణాత్మక అంశాలపై మేము చర్చకు సిద్ధం. కుల గణనను మేము వ్యతిరేకించడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలు ఎప్పుడో పూర్తవ్వాలి. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేస్ కూడా పూర్తికాలేదు.షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు ఏదీ పూర్తవ్వలేదు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. భూసేకరణ చేపట్టవద్దని కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేశారు.కాంగ్రెస్ కూడా భూసేకరణ చేపట్టే సమయంలో పద్ధతి ప్రకారం చేయాలి.. రైతులతో మాట్లాడి పరిష్కారం చేసుకోకుండా రైతులపై దాడులా..ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి.ఫామ్ హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకుందికేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్‌లో..కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రేవంత్ దృష్టిలో ఆయన్ను ప్రశ్నించే వారు.. వార్తలు రాసేవారు కూడా మానవ మృగాలే. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలో కూడా రోడ్డు మ్యాప్ లేదు’అని మండిపడ్డారు. -
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని.. పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు‘‘తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండేది. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెల రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. మేము అధికారంలోకి రాగానే వైట్ పేపర్ విడుదల చేశాం. కాంగ్రెస్‌పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు, వివరించలేదు.మరింత మెరుగైన పాలన అందిస్తాం....వానాకాలంలో కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే మేము వచ్చాక రైతు బంధు నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం. నెలనెలా అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రైతు పండగ ఇచ్చిన ఉత్సాహంలో మరింత మెరుగైన పాలన అందిస్తాం. రైతుల మద్దతుతో మరో తొమ్మిదేళ్లు పాలన కొనసాగిస్తాం.’’ అని రేవంత్ తెలిపారు. రైతు భరోసాపై కీలక ప్రకటనరైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కొనసాగిస్తామని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం. వరికి రూ.500 బోనస్ఇ స్తాం. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశాం. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా ఇస్తాం. మారువేషంలో వచ్చే మారీచులను నమ్మకండి. రైతులు నాణ్యమైన సన్న వడ్లు పండించాలి. తెలంగాణ, సోనా, బీపీటి, హెచ్ఎంటీ వరిని పండిస్తే రైతులకు లాభదాయకం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జీషీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఛార్జీషీట్‌ను విడుదల చేశారు. ఎంపీలు డికె అరుణ, రఘునందన్ రావు, నగేష్, బీజే ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే లు హరీష్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు హాజరయ్యారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపైనే మా పోరాటం అని.. ప్రజల తరపున ఛార్జ్‌షీట్ రూపంలో ప్రభుత్వం ముందు పెట్టామని కిషన్‌రెడ్డి అన్నారు.‘‘కాంగ్రెస్ విజయోత్సవాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. వందరోజుల్లో హామీలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదైంది. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏం తేడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాపై ఉంది. ప్రజలను నమ్మించడం కోసం దేవుడిపై ఒట్లు పెట్టారు. రుణమాఫీ ఇప్పటివరకు కొంతమంది రైతులకే జరిగింది. ఏడాది పూర్తయింది.. రైతు భరోసా ఎక్కడ?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు నెరవేర్చి తీరుతాం: భట్టి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిని పట్టించుకోలేదని.. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని కుదువపెట్టారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. రైతు పండుగ సభలో ఆయన మాట్లాడా రు. కృష్ణా నీళ్లను పాల మూరుతో పాటు పక్కనున్న రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు ఇవ్వాలని ఆలో చన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకు లు ప్రజల వద్దకు వెళ్తాం. ఉద్యమాలు చేస్తాం, నిల దీస్తామని చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. పకడ్బందీగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒకాయన అంటాడు.ఇంకో ఆయన వచ్చి ఉద్యమం చేస్తానని చెప్తాడు. ఇది సిగ్గు చేటు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు అమలు చేసి తీరుతాం’’ అని భట్టి పేర్కొన్నారు. తాము రు ణమాఫీ చేయడం మాత్రమే కా కుండా... పంట నష్టపోయిన రైతు లకు పరిహారం కింద రూ. 100 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. పంటల బీమా కింద ప్రభు త్వమే రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 1,433 కోట్ల ప్రీమియం చెల్లించిందని భట్టి తెలిపారు. బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ.2,747 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదలరైతు పండుగ ముగింపు సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ కింద రూ.2,747 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అదేవిధంగా 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.రైతు సంక్షేమం మొదలైంది వైఎస్సార్ హయాం నుంచే..రైతు పండుగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకు న్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేసినది, ఉచిత కరెంట్ ఇచ్చినది వైఎస్సార్ హయాంలోనేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు రూపొందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినది వైఎస్ అని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వైఎస్సార్ హయాం నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. -
రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్: సీఎం రేవంత్
నా ప్రాంత అభివృద్ధి, 25 వేల మంది యువతకు ఉపాధి కోసం కొడంగల్‌లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకున్నా. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లగచర్లలో చిచ్చుపెట్టి అధికారులపై దాడులు చేయించారు. వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు వెళ్లారు. మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాడిని కాదు. తోడేళ్లు, పులులు ఎన్నో చూశా.. మానవ మృగాలు మీరెంత? నేను ఆనాడే చెప్పాను వాళ్లని నమ్మొద్దని. లగచర్లలో కేసులు ఎదుర్కొంటున్న వారు నా దగ్గరకు వస్తున్నారు. ఒక్క కేసీఆర్‌కే గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. మా పారిశ్రామిక వాడ కోసం 1,300 ఎకరాలు ఉండొద్దా? నాడు అధికారులపై దాడులు చేసి ఉంటే సాగర్ వంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అభివృద్ధి కోసం కొందరు నష్టపోక తప్పదు. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని...వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ నుంచి ఇప్పుడు వరి ధాన్యానికి రూ.500 బోనస్ దాకా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ వస్తారో.. మాజీ సీఎం కేసీఆర్ వస్తారో.. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలసి వస్తారో... రండి... చర్చిద్దాం..’’ అని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ‘లగచర్ల’లో చిచ్చుపెట్టి అధికారులు, కలెక్టర్‌పై దాడులు చేయించారని... వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయారని పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు, స్టాళ్లను తిలకించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ప్రజలు గమనించాలి. గత పదేళ్లలో కేసీఆర్ కేవలం సాగునీటి ప్రాజెక్టులు, కాంట్రాక్టర్ల కోసం రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అందులో కాళేశ్వరానికే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతానని చెప్పారు. కానీ సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ కుప్పకూలిపోయాయి. అదే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో కట్టిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, మంజీరా, ఎల్లంపల్లి భద్రంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాకున్నా... వరుణుడి దయవల్ల 75 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర చర్రితలో, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 లక్షల కోట్ల టన్నుల వడ్లు తెలంగాణలో పండాయి. వరి వేస్తే ఉరేనని నాడు కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. దానితో బీఆర్ఎస్ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. రైతు కుటుంబాలకు రుణమాఫీ చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, తదితరులు. కేసీఆర్ రుణమాఫీ మిత్తీలకే పోయింది.. కేసీఆర్ మొదట ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ అన్నారు. నాలుగు విడతలు అన్నారు, మిత్తి తాను కడతానన్నారు. మళ్లీ 2018–23 వరకు లక్షన్నర రుణమాఫీ చేస్తానన్నారు. మొదటి నాలుగేళ్లు పైసా ఇవ్వలేదు. ఆఖరి ఏడాదిలో ఔటర్ రింగ్ రోడ్డును రూ.7,500 కోట్లకు తెగనమ్మి మాఫీ డబ్బులు వేశారు. ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది రూ.11 వేల కోట్లే. అందులో రూ.8,596 కోట్లు మిత్తిలకే పోయాయి. రైతులకు చెల్లించింది రూ.2,500 కోట్లే. హరీశ్‌రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం. సవాల్ చేస్తున్నా... ఎవరు వస్తారో రండి.. కేసీఆర్‌కు ఈ వేదికగా సవాల్ విసురుతున్నా. 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు మొత్తం రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. మోదీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి.. అసెంబ్లీలో చర్చిద్దాం. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచి్చన చరిత్ర మాది.. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్. అసలు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పేటెంట్. పని చేయడమే మాకు తెలుసు.. పనిలోపడి చేసింది చెప్పుకోలేకపోతున్నాం. నాకీ పదవి ఆషామాషీగా రాలేదు.. కేసీఆర్.. పాలమూరు బిడ్డలు నిన్ను పల్లకీలో మోసి ఎంపీని చేశారు. పాలమూరు ప్రజలు ఆదరిస్తే సీఎం అయ్యానని చెప్పి పదేళ్లు మోసం చేశావు. నాడు పాలమూరును దత్తత తీసుకుంటా అన్నారు. కానీ పదేళ్ల పాలనలో ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఇవాళ మేం నారాయణపేట–మక్తల్–కొడంగల్ ప్రాజెక్టు చేపడితే వద్దంటున్నావ్. కాళ్లలో కట్టెలు పెడుతున్నావ్. ఎందుకీ ద్వేషం. నేను రైతు బిడ్డగా కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరి రాష్ట్రానికి సీఎంగా ఇక్కడికి వచ్చా. నాకీ పదవి ఆషామాషీగా వచ్చింది కాదు. ఒక బాధ్యత. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్ చేసిందేమీ లేదు. మేం అభివృద్ధి చేసుకోలేమా? నేను ఇక్కడే పుట్టినోడిని, ఇక్కడి మట్టిలో కలిసే వాడిని.. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేయకపోతే చరిత్ర క్షమిస్తుందా? ఎవరు అడ్డం వచి్చనా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తా. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించేవరకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మార్పు కోసం వేసిన ఓటు అభయహస్తమైందిసాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (నవంబర్ 30) పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్‌కెళ్లి మార్పు కోసం ఓటేశాడని, ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్... రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్.. రూ.1,433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొను గోళ్లు.. ఇలా ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం..’’ అని రేవంత్ పేర్కొన్నారు.పాలమూరుకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు తెచ్చుకుందాం పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డుపడుతున్నారు. ఎవరో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడం కాదు. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరి దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకోవద్దా? ఒకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్నీ తెచ్చుకుందాం. ఏడాదికి రూ.20 వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరఫున మంత్రివర్గాన్ని అడుగుతా. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చుకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా? కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు తీసుకెళ్లారు. అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచ్చుకోలేమా? కచి్చతంగా తెచ్చుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాల్లో నీరు పారించి సస్యశ్యామలం చేస్తాం. -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సభ.. తెలంగాణకు అమిత్ షా: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 6న బహిరంగ సభ ద్వారా ప్రజలకు వెల్లడించనున్నట్టు చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెప్తున్నారు. అరకొర రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని చెప్తున్నారు.రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలి. కొత్త రక్తం పార్టీలో చేరబోతుంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మీరు ధైర్యంగా ముందుకి వెళ్ళాలని ప్రధాని మాకు భరోసా ఇచ్చారు.ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అసెంబ్లీ, జిల్లలా వారీగా ఛార్జ్‌షీట్ తయారు చేసి విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. సభ ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలను వివరిస్తాం. సభకు బీజేపీ జాతీయ నేతలు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
పాలిటిక్స్‌కు తాత్కాలిక బ్రేక్..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
సాక్షి,హైదరాబాద్:ప్రతిరోజు రాజకీయాలపై ట్వీట్ చేసే కేటీఆర్ శనివారం(నవంబర్ 30) ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.తాను వెల్నెస్ కోసం కొద్దిరోజుల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.అయితే ఈ బ్రేక్‌తో తన రాజకీయ ప్రత్యర్థులు తనను అంతగా మిస్సవరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ట్వీట్ వైరల్ అవడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁— KTR (@KTRBRS) November 30, 2024 -
‘రైతుపండుగ’పై హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్‌రెడ్డి? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(నవంబర్ 30) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘మేనిఫెస్టోలో చెప్పి,రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.నేడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలి.పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
రేవంత్‌రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నారా?
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నా రా? ఉద్యమంలో ఒక్క కేసైనా ఉందా? ఒక్కనాడైనా అమరులకు పూ లు వేశారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. అలుగునూరులో కేసీ ఆర్‌ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్లు తుడుస్తావా? లేదా తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచి వేస్తావా?’అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేస్తూ శుక్రవారం సిద్దిపేటలో దీక్షా దివస్‌ను చేపట్టారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. లగచర్లలో గిరిజనులు తిరగబడితే వెనక్కి తగ్గారని, హైదరాబాద్‌లో హైడ్రా, మూసీలపై పేదలు తిరగబడటం, పోరాటాల ఫలితంగా రేవంత్ వెనక్కి తగ్గారన్నారు. డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనను ఆంధ్రవారికి తలొగ్గి కేంద్రంలోని కాంగ్రెస్ డిసెంబర్ 23న వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే సీఎం రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి చేయలేదని హరీశ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని మండిపడ్డారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రజావ్యతిరేక సర్కార్‌ను గద్దె దించుదాం కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో ఈ ప్రజావ్యతిరేక సర్కారును గద్దె దించేవరకు రైతులు, యువకులు, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొందరు దొంగలు పారీ్టలోకి వచ్చి పందికొక్కుల్లాగా తిని వెళ్లిపోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణను కాపాడాలని ఆ రోజు కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఇకపై అలాంటి వారికి పారీ్టలో చోటు ఉండదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులరి్పంచారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో చేసిన దీక్షలు, ఆందోళన ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికే పెద్దపీట
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానున్న సందర్భంగా.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ సదస్సును మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో రోజు ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు పోటెత్తారు. మరో మంత్రి తుమ్మలతో కలిసి రైతు పండుగ స్టాళ్లను పరిశీలించారు.అనంతరం రైతు అవగాహన సదస్సులో ఉత్తమ్ మాట్లా డుతూ ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. మిగిలిన కొంత మంది రైతుల రుణమాఫీపై నేటి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన చేస్తారన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని.. అందుకే రైతు లు పండుగ చేసుకుంటున్నారని ఉత్తమ్ అన్నారు. రైతు పండుగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలాఅద్భుతంగా ఉన్నాయని.. వ్యవసాయశాఖ మంత్రి అనుభవం, వారి దక్షతే ఇందుకు కారణమని కొనియాడారు. ఏది మంచిదో రైతులే చెప్పాలి: తుమ్మల రైతులకు అండగా ఉంటామని,అయితే ఏది మంచిదో రైతులే చెప్పాలని, మీ సలహాలు, సూచనలు వినడానికే ఈ రైతు సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుబంధు కంటే బోనస్ బాగుంటుందని రైతులే అంటున్నారని.. రైతుల అభిప్రాయం మేరకు వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామని తెలిపా రు. ఎండాకాలం పంటకు సంబంధించి మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయన్నారు. ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడు విడు దల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకొని.. ఇరిగేషన్ ప్లాన్ ను అమలు చేయాలని ఉత్తమ్‌ను కోరారు. ఇందుకనుగుణంగా పంట ఎలా సాగు చేయాలనే దానిపై రైతులకు వ్యవసాయశాఖ తగు సూచనలిస్తుందన్నారు.ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ గోపి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, కలెక్టర్ విజయేందిర బోయి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నా రు. ఆ తర్వాత శనివారం జరగనున్న సీఎం బహి రంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అనంతరం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు చేరుకొని ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు.మందులు పిచికారీకి బ్లేయర్ Ü ఈ మిషన్ పేరు గోదావరి బ్లేయర్. దీని విలువ రూ.లక్ష. దానిమ్మ, ద్రాక్ష, ఇతర పందిరి తోటల సాగులో ఈ యంత్రం రైతులకు అనువుగా ఉంటుంది. మందులు పిచికారీ చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. పందిరిలో రెండు వైపులా సాళ్లలో కప్పుకున్న తోటకు మంచు మాదిరిగా మందులు పిచికారీ చేస్తుంది. ఎక్కడా గ్యాప్ లేకుండా పిచికారీ చేయడం దీని ప్రత్యేకత. ఈ యంత్రం 6 హెచ్‌పీ పంపుసెట్తో 300 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు కలిగి ఉంటుంది. ఒకసారి ట్యాంకు నింపితే 18 నిమిషాల్లో ఎకరన్నర పొలంలో మందులు పిచికారీ చేయొచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చు. కలుపు తీసేందుకు టిల్లర్ Ü ఈ యంత్రం పేరు టిల్లర్. దీనిని ఉపయోగించి పంటలో కలుపు తీయొచ్చు. దీని ధర రూ.58 వేలు. ఫోర్ స్ట్రోక్ సామర్థ్యం కలిగిన ఈ యంత్రం లీటర్ పెట్రోల్‌కు 1.5 ఎకరాలో కలుపు తీయడానికి సహాయ పడుతుంది. దీనిని రైతులు సులువుగా నడిపించొచ్చు. చేతిలో పట్టుకొని కలుపు ఉన్న సాళ్ల మధ్య తిప్పితే సరిపోతుంది. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు తక్కువ ఖర్చుతో ఈ టిల్లర్ మిషన్ ద్వారా పంటలో సులభంగా కలుపు తీయొచ్చు. ఎంత మోతాదులో కలుపు తీయొచ్చో అందుకు తగినట్టుగా సర్దుబాటు చేసుకోవచ్చు. -
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
‘ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్‌లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.బాలిక మృతి బాధాకరం..ఈ మేరకు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు.‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు మాఫియా నడిపారు. సైకో రావు అండ్ బీఆర్ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత పదేళ్ళలో ఏనాడు అలా జరగలేదు.అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయంలో కస్తూర్బా ఘటన, గురుకులల్లో ఘటనలు, రెండెకెల సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్, మూసీ, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉంది. మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.అందుకే కేటీఆర్ జైలుకు వెళ్తా అంటున్నారుమహబూబాబాద్లో పసిపిల్లలు ఉన్న వాళ్లను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది. అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పులు చేశారు అని ఆయనకు తెలుసు అందుకే జైలుకు వెళ్తా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలను కలువలేదు..ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారు.’ అని కొండా సురేఖ మండిపడ్డారు.కవితకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్..కవిత జైల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కేటీఆర్‌ను పట్టించుకోవడం లేదట. కేసీఆర్ కుటుంబంలో కవిత - హరీష్ రావు ఒక్కటి అయ్యారని చర్చ జరుగుతుంది. బాల్క సుమన్, గాధరి కిషర్ అప్పట్లో ఆర్ ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పాల్పడినట్లు అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.కేటీఆరే కాదు కేసీఆర్ కూడా జైలుకే..జైలుకు పోవాలని కేటీఆర్‌కు ఉబలాటంగా ఉన్నట్లు ఉంది. సరైన ఆధారాలు దొరికినప్పుడు జైలుకు పంపుతాం. సమయం వచ్చినప్పుడు జైలుకు కచ్చితంగా పోతావు కేటీఆర్. ఆధారాలు రాగానే కవిత జైలుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా వెళ్తాడు. కేటీఆర్ మాత్రమే కాదు కవిత - కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు. -
దమ్ముంటే రా!.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెబుతారు: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్ అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని, ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్ఎస్కు వచ్చాయని తెలిపారు. కరీంనగర్‌లోని అల్గునూర్‌లో దీక్షా దీవస్ సభలో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. 1956 నుంచి 1968వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందని తెలిపారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారని చెప్పారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిన కేసీఆర్.. కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమబాట పట్టాడని పేర్కొన్నారు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని రగిల్చారని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారని చెప్పారు.‘ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటున్నారు నేడు గద్ధెనెక్కినవారు. వారు కేసీఆర్ కాలి గోరుకు సరిపోరు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా... పోదాం ఎక్కడికైనా. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.