breaking news
-
‘అల్లు అర్జున్ను ఆరోజు ఎందుకు అడ్డుకోలేదు?’
హైదరాబాద్, సాక్షి: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ వేళ.. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్‌తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్‌కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు. అంబేద్కర్ ఇష్యూపై..కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం. అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్ మండిపడ్డారు. -
అల్లు అర్జున్ కేసు..హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సినీ హీరో అల్లు అర్జున్(AlluArjun)ను సీఎం రేవంత్‌రెడ్డి(Revanthreddy) పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ఆరోపించారు. ఈ విషయమై హరీశ్‌రావు మంగళవారం(డిసెంబర్ 24) మీడియాతో మాట్లాడారు.‘రేవంత్‌రెడ్డి సొంత అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే,రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే మాట్లాడటానికి రేవంత్‌రెడ్డికి సమయం లేదు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉంది’అని హరీశ్‌రావు అన్నారు.కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లుఅర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సీఎం రేవంత్ అసెంబ్లీలో ఈ కేసు విషయమై చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అనంతరం మంగళవారం అల్లు అర్జున్ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. ఇదీ చదవండి: కేసీఆర్,హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట -
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్‌రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్‌రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్‌రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్‌రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఇది సీఎం రేవంత్ వ్యూహంలో భాగమా?
రాజకీయ నేతలు తమకు లాభం ఉందనుకుంటేనే ఏదైనా వివాదాన్ని రేకెత్తిస్తుంటారు. తమకు నష్టం చేస్తుందని భావిస్తే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలని కయ్యానికి దువ్వుతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఆక్రోశాన్ని బయటపెట్టాయనిపిస్తుంది.రేవంత్ ను తెలివైన రాజకీయ నేతగానే అంతా చూస్తారు.కాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన అధికార దర్పమో,లేక ఎవరైనా సలహాదారుల ప్రభావమో కాని,అనవసర వివాదాలను తెచ్చి పెట్టుకుంటున్నారనిపిస్తుంది. బహుశా ఇది ఆయన వ్యూహం కావచ్చు.లేక సినిమావారిని తన దారిలో పెట్టుకోవాలన్న లక్ష్యం కావచ్చు. లేదా అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో సినీ పరిశ్రమవారు, ఇతర ప్రముఖులు కలవడం పై ఆయనకు కలిగిన ఉక్రోశం కావచ్చు..ఏదైనా కావచ్చు.రాజకీయంగా చూస్తే ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఉన్న కష్టాలు కూడా ఒక కారణం అనుకోవచ్చు.ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదో ప్రయత్నమా అన్న భావన కలగవచ్చు. లేదా తాను ఎవరిపైన అయినా దూకుడుగా వెళ్లగలనని నిరూపించుకోవాలన్న తాపత్రయం కూడా ఇందులో ఉండవచ్చు. సంధ్యా ధియేటర్(Sandhya theater Incident) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ రేవంత్ ప్రభుత్వం కేసు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆయనను అరెస్టు చేసింది.ఈ క్రమంలో ఎక్కడా అర్జున్ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వెళ్లింది.సాధారణంగా పోలీసులు ఇలాంటి కేసులలో ముఖ్యమంత్రి ఏమి చెబితే అది చేస్తుంటారు. దానిని నిర్దారిస్తూ శాసనసభలో రేవంత్ ప్రసంగించినట్లు అనిపిస్తుంది.నిజానికి ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లింది.అలాంటప్పుడు ప్రభుత్వంలోని వారు కోర్టులో కేసు ఉంది కాబట్టి అని చెప్పి దాని గురించి మాట్లాడకుండా తప్పించుకుంటారు.కాని రేవంత్ మాత్రం పనికట్టుకుని అర్జున్ ను తిట్టడానికే అవకాశం కల్పించుకున్నట్లుగా ఉంది.శాసనసభ జరిగిన ఈ ఐదు రోజులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం, చివరి రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తడం,దానిపై రేవంత్ ఘాటుగా మాట్లాడడం చూస్తే అంతా ప్లాన్ ప్రకారమే సాగిందన్న అభిప్రాయం కలుగుతుంది.ఈ సందర్భంలో రేవంత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా?కిడ్ని పోయిందా?అంతమంది ఎందుకు పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు?అంటూ వితండ వాదన తీసుకు వచ్చారు.నిజానికి ఎవరిని ఇలా అనరాదు.అందులోను సెలబ్రెటిగా ఉన్న వ్యక్తి పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడవలసిన అవసరం ఏమిటో తెలియదు. అంటే అర్జున్ కు ఏదైనా జరగాలని కోరుకున్నట్లుగా ఉందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు.ఇక్కడే అసలు విషయం బోధ పడిందనిపిస్తుంది.తన ప్రభుత్వం అర్జున్ను అరెస్టు చేస్తే, ఆయనను పలకరించడానికి ఇంత మంది సినీ పెద్దలు ఆయన వద్దకు వెళతారా?అన్న భావన ఏదో ఏర్పడి ఉండాలి. చిరంజీవితో సహా అనేక మంది బంధువులు, రాఘవేంద్రరావు తదితర సినిమా పెద్దలు ఇలా కలిసినవారిలో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫోన్ చేసి పరామర్శించారని వార్తలు వచ్చాయి.ఈ పరామర్శల వల్ల అర్జున్ పట్ల ప్రజలలో సానుభూతి ఏర్పడిందని అనిపించి ఉండాలి. అలాగే ప్రభుత్వంపై నెగిటివ్ వచ్చిందని ఫీడ్ బ్యాక్ ఉండి ఉండాలి.అందుకే ఈ ఉదంతం జరిగిన పది రోజుల తర్వాత మళ్లీ తనది పైచేయి అనిపించుకోవడానికి రేవంత్ మాట్లాడినట్లుగా ఉంది.ఈ క్రమంలో అర్జున్ రోడ్ షో చేశారని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని,తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిందని తెలిసినా ,పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మరో వైపు అల్లు అర్జున్ దీనిపై మీడియా సమావేశం పెట్టి తన వాదన తెలిపారు.అయితే ఆయన కాస్త జాగ్రత్తగా ముఖ్యమంత్రి రేవంత్ పై నేరుగా ఎక్కడా విమర్శలు చేయకుండా మాట్లాడారు.తాను రోడ్ షో చేయలేదని, పోలీసుల సూచన మేరకే చేతులు ఊపుతూ అబిమానులకు ఇబ్బంది లేకుండా చేయడానికి యత్నించానని వివరించారు.తనపై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.అర్జున్ ఈ తొక్కిసలాటకు తాను ఎలా కారణం అవుతానని చెప్పడానికి యత్నించారు.అలాగే మరణించిన మహిళ కుటుంబాన్ని, గాయపడ్డ వారి కుమారుడు శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లాలని అనుకుంటే తనపై కేసు పెట్టినందున అలా వెళ్లడం లీగల్‌గా కుదరదని చెప్పారని ఆయన వివరించారు.రేవంత్ చేసిన వాదనలో హేతుబద్దత కనిపించదు. ఒక సినిమా నటుడు సినిమా ధియేటర్ కు వెళ్లకూడదన్నట్లుగా ఆయన మాట్లాడారు. అదే సూత్రం కరెక్టు అని అనుకుంటే ఆయా ఉత్సవాలలో తొక్కిసలాటలు జరిగి కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి.మరి ఆ ఉత్సవాలను పూర్తిగా నిలిపివేస్తున్నారా?ప్రముఖ రాజకీయ నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చేపమందు పంపిణీలో , నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్ లో గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి.అయినా వాటి నిర్వాహకులపై కేసులు పెట్టలేదే!అరెస్టులు చేయలేదే! మరి నేతలు రోడ్ షో లను ,సభలను ఆపివేస్తున్నారా.ఇక అర్జున్ ఎవరూ పరామర్శించకూడదని అనుకుంటే ఎలా? ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి కొన్నాళ్లు జైలులో ఉన్నారు.ఆయన బెయిల్ పై విడుదలయ్యాక చర్లపల్లి జైలు నుంచి ఊరేగింపుగా ఎందుకు వచ్చారు? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.అర్జున్ను టార్గెట్ చేయడం సరికాదని బిజెపి నేతలు,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వ్యాఖ్యానించారు. రేవంత్ గురువుగా భావించే చంద్రబాబు నాయుడు సభలలో తొక్కిసలాటలు జరిగి పదకొండు మంది మరణించారు. అయినా అప్పుడు అది పోలీసుల వైఫల్యం అని ఆయన డబాయించారు.పు ష్కరాలలో ఆయన కుటుంబం స్నానాలు చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోండి.కుంభమేళాలలో చనిపోవడం లేదా?రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా?పూరి జగన్నాధ్ రథం వద్ద తొక్కిసలాట జరగలేదా అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో రేవంత్ మాత్రం అర్జున్ దే పెద్ద తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు.అర్జున్ ఒక్కరే కాదు..సినీ నటులంతా మొదటి షో కు వెళ్లి అబిమానులను ఉత్సాహపరుస్తుంటారు. బెనిఫిట్ షో లకుఅనుమతి ఇవ్వబోనని చెబుతున్నారు. తొలుత అధిక ధరలకు టిక్కెట్ అమ్ముకోవచ్చని అనుమతి ఇవ్వడానికి, ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వనని అనడానికి కారణాలు ఉండాలి కదా? సినీ పరిశ్రమవారిని తనకు సరెండర్ అయ్యేలా చూసుకోవడానికి ఏమైనా రేవంత్ ఈప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.రేవంత్‌కు ఇక్కడ టీడీపీ మీడియా మద్దతు ఇస్తోంది కాబట్టి సరిపోయింది.లేకుంటే ఈ పాటికి సినిమా పరిశ్రమపై రేవంత్ దాడి చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ల రేట్లు పెంపుదలకు కొన్ని షరతులు పెడితేనే నానా యాగీ చేశాయి. పవన్ కళ్యాణ్ వంటివారు ఎన్ని ఆరోపణలు చేశారో చూశాం. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ప్రముఖ హీరోని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాటీడీపీ మీడియా కాని, పవన్ కళ్యాణ్ వంటివారు కాని నోరు విప్పడం లేదు.వ్యతిరేకంగా ఎవరూ ట్వీట్లు కూడా చేయడం లేదు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీతో సహా సినీ పరిశ్రమ ఎక్కువగా ఇక్కడే ఉంది కనుక.రేవంత్ ఇంకేదైనా చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని భయపడుతుండవచ్చు.కాని సినీ పరిశ్రమకు రేవంత్ తెలియకుండానే నష్టం చేస్తున్నారు.ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఆయనకు అంత కలిసివచ్చేది కాకపోవచ్చు. ఒకసారి కేసు పెట్టాక దాని మానాన దానిని వదలివేయకుండా ఇలా కెలకవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఆయన మెప్పు కోసం కొందరు అబ్బో అదిరింది అని పొగడవచ్చు. రేవంత్ ఫైర్ మాదిరి వ్యవహరిస్తున్నారని డబ్బా కొట్టవచ్చు.కాని తేడా వస్తే వీళ్లే ఘోరంగా ప్రచారం చేస్తారు. రేవంత్ సరళి ఫైర్ మాదిరి ఉంటే ఉపయోగమో,లేదో కాని, ఫైర్‌తో గేమ్ ఆడితే చేతులు కాలతాయన్న సంగతి గ్రహించడం మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
TG: 30న కేబినెట్ భేటీ.. రేషన్‌కార్డులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఈనెల 30వ తేదీన భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశం సందర్భంగా తెలంగాణలో రైతులకు రైతు భరోసా, రేషన్ కార్డుల విధి విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ‘ఈనెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా రైతు భరోసా, రేషన్‌కార్డుల విధివిధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భూమిలేని పేదలకు నగదు బదిలీపై కేబినెట్లో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ సీఎంగా రేవంత్: హరీష్ రావు
సాక్షి, వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణాలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అన్నీ డిపార్ట్మెంట్సలో పేదలకు అందుబాటులో ఉండాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాం. గతంలో నేను వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. భవన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. ఒక కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా 2000 పడకల ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు.ఈ ఆసుపత్రి నిర్మాణం.. 2024 జూన్ వరకు రెడీ కావాలని ప్రతిపాదనలు చేశాం. ఇప్పుడూ ఎలా ఉందో చూస్తున్నాం. పేదలకు సరైన వైద్యం అందడం లేదు. వరంగల్ జిల్లాలో హైటెక్ టవర్‌లో వైద్య సేవలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. 14వ ఫ్లోర్లో హాస్పిటల్, 10 ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఉండేలా ప్లాన్ చేశాం. మన ఆసుపత్రి ఎత్తు 91 మీటర్లు. ఇక్కడ గుండె, కిడ్నీ, లివర్, క్యాన్సర్‌కు అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించాలనుకున్నాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం ఓపిక పట్టాం. ఎలాంటి అభివృద్ధి లేదు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి.తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న పథకాలను నిలిపేశారు. కొత్త పథకాలు ఇవ్వడం లేదు. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అంటూ ఆరోపించారు. -
పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. -
రేవంత్.. పదవులు శాశ్వతం కాదు: కేఏ పాల్
సాక్షి, నిజామాబాద్: పదవులు శాశ్వతం కాదు అనేది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. సీఎం రేవంత్ సద్ధాం హుస్సేన్‌లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ కామెంట్స్ చేశారు.కేఏ పాల్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేనే కనుక అల్లు అర్జున్ అయితే బాధితల కుటుంబానికి రూ.300కోట్లు ఇచ్చే వాడిని. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ.25కోట్లు ఇవ్వమనడం తప్పా?. సీఎం రేవంత్ ఒక సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. 422 బిల్డింగ్స్‌ను అక్రమంగా కూల్చివేశారు. కానీ, సొంత తమ్ముడి భవనాన్ని మాత్రం కూల్చివేయలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు. రెండు ప్రభుత్వాల హాయంలో సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు.మీకేమో లక్షల కోట్లు, సర్పంచ్‌లకు మాత్రం లక్షల అప్పులా?. నిజంగా సర్పంచ్‌లకు బుద్ధి ఉందా?. ఇంకా కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఎందుకు నమ్ముతున్నారు. ప్రజల సంక్షేమం కోసం వచ్చిన వ్యక్తిని నేను. పదవులు శాశ్వతం కాదు.. ఇది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. అందరం కలిసి పనిచేద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వచ్చే సోమవారం డిసెంబర్ 30న నిజామాబాద్‌లో సర్పంచ్‌లతో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తాను. 100 రోజుల్లో జీవితాలను మార్చేస్తాను. మే 10వ తేదీలోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాను. మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు ఖాయం. కులాన్ని అమ్ముకొని ఆర్. కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ బ్రతుకుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
హైదరాబాద్, సాక్షి: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, నటుడు అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి.. పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు భంగపాటే ఎదురైంది. సోమవారం ఉదయం గాంధీభవన్‌కు చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లోనూ పని చేశారు. ప్రస్తు కాంగ్రెస్ నుంచి నాగార్జున సాగర్ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి 2011 మార్చి 6వ తేదీన వివాహం జరిపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది.ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో హైడ్రామా -
ఫార్ములా ఈ-కేసు..డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేసుల కేసుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ విషయమై డీకే అరుణ సోమవారం(డిసెంబర్23) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బీజేపీకి సంబంధం ఏంటి ?ఈ కార్ రేసుల కేసులో ఈడీ తన పని తాను చేస్తోంది. హీరో అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా కావాలని రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా. ఈ విషయంలో ఎంఐఎం,కాంగ్రెస్ ఒక్కటై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎం రేవంత్‌రెడ్డి కావాలని ప్రశ్న అడిగించారు’అని డీకే అరుణ చెప్పారు. ఇదీ చదవండి: కేటీఆర్‌కు త్వరలో నోటీసులు..? -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్ నివాసం వద్ద దాడి ఘటనపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఎక్స్ వేదికగా పిలుపు ఇచ్చారు.‘‘సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారాయన. అయితే.. అంతకు ముందు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానుప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది.— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 23, 2024అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమని, ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. -
Allu Arjun Controversy: రాజకీయ రగడ
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, దానికి కొనసాగింపుగా నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణ ‘రాజకీయ చిచ్చు’ రాజేసింది. నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ఆదివారం రాళ్ల దాడికి దిగగా.. ఘటనను ఖండిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అల్లు అర్జున్ తీరును అధికార కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎవరేమన్నారంటే..సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. .. అల్లు అర్జున్‌కు ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అల్లు అర్జున్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు రద్దు చేస్తున్నామని.. టికెట్ ధరల పెంపునకు అను మతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అందులో భాగంగానే చిత్రపురి కాలనీలో జూనియర్, పేద ఆరి్టస్టులకు ప్లాట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఎంపీ కిరణ్, ఎమ్మెల్సీ వెంకట్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే సంధ్య థియేటర్ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమోనని అనుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ చెప్పారు. కానీ ఆయన రియల్ హీరోలా కాకుండా.. రీల్ హీరోలా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఎంపీ కిరణ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్జున్ ఏదో స్క్రిప్టు తీసుకొచ్చి చదివినట్టు మాట్లాడారన్నారు. అసలాయనేం చెబుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకుని.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మర్నాడు.. అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆరోపించారు. వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారశైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలను తప్పుపట్టేలా మాత్రమే ఆయన తీరు ఉందని, రేవతి కుటుంబంపై కనీస సానుభూతి కూడా ఆయన చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నారని, మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణం ఐసీయూలో ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్న విషయం అరవింద్‌కు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ కారణంగా జరిగిన తప్పును సమరి్థంచుకోకుండా సరిదిద్దుకోవాల ని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎలీ్పలో ఆయ న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అల్లు అర్జున్ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: 'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తారా? : బీఆర్ఎస్ నేత శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను వదిలేసి.. సినిమా పరిశ్రమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వారు ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించక, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. వాటిపై చర్చ జరపకుండా అసెంబ్లీలో సినీ నటుడు అల్లు అర్జున్ను తిట్టేందుకు గంటల కొద్దీ సమయం కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. దేవాల యం లాంటి చట్టసభలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.తెలుగు సినీ పరిశ్రమపై సీఎం పగ : బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సమస్య సద్దుమణుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులతో పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతుంటే ఎన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆదివారం రాత్రి సంజయ్ పరామర్శించారు. అనంతరం బాలుని తండ్రితో కొద్దిసేపు మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బండి వెంట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు ఉన్నారు. పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలుతీస్తాం పంజాగుట్ట (హైదరాబాద్): సినీ నటుడు అల్లు అర్జున్ను ఉద్దేశించి స స్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఏదైనా పశువు చనిపోయినా ఏం జరిగిందని ఆరా తీస్తాం. తన సినిమా చూసేందుకు వచ్చి, తొక్కిసలాటలో మహిళ చనిపోయి, పసిపిల్లాడు ప్రాణాపాయస్థితిలో ఉంటే పరామర్శించకుండా వెళ్లిపోయిన అల్లు అర్జున్‌కు మానవత్వం లేదు. ఆయనలో సక్సెస్ మీట్స్‌కు వెళ్ల్లలేకపోతున్నాననే ఆవేదనే తప్ప మనుషులు చనిపోయారన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు’’అని ఓ ప్రెస్మీట్లో పేర్కొన్నారు. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ మాట్లాడాలన్నారు. తొక్కిసలాటతో ఎవరికీ సంబంధం లేదని, అది ప్రమాదమేనని అల్లు అర్జున్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు, నాయకులు పోలీసులపై అనుచితంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. అలా మాట్లాడితే తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం: డీజీపీ ఆఫీసు డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టారని ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. -
రైతు భరోసా ఎగవేత కుట్రలు ఎదిరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎగవేసేందుకు చేస్తున్న కుట్రలను ఎదిరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో రైతుబంధు పథకంపై అబద్ధాలతో దు్రష్పచారం చేశారని, చివరికి అన్నంపెట్టే రైతన్నను దొంగలా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. కోతలు, కొర్రీలతో రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు.. పెద్ద దోఖా జరగబోతోంది.. ‘రైతుబంధును బొంద పెట్టి పనికిమాలిన షరతులతో అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్మల్ని నిండా ముంచే ఒక పెద్ద దోఖా జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి మమ అనిపించి, పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టేలా ఘోరాలు చేయబోతున్నారు. వంచనను గ్రహించి, ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన సమయం వచి్చంది. ఇప్పుడు మేల్కొనకపోతే భరోసా ఉండదు గోస మాత్రమే మిగులుతుంది. రైతుబంధుతో రూ.73 వేల కోట్లు జమ వానాకాలం.. యాసంగి రెండు పంటలకు అవసరమైన పైసలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడే ఒక అపురూపమైన ఆలోచనకు ఆచరణే రైతుబంధు. మొత్తం 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవినీతికి, లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. ఇక రుణమాఫీ కింద రూ.28 వేల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఈ రెండు పథకాల ద్వారానే అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి. రైతులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ రైతుబంధు కింద కేసీఆర్ ఎకరానికి ఏటా రూ.10 వేలే ఇçస్తున్నాడని, మేం వస్తే రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా ఇంతవరకూ రైతు భరోసా జాడా పత్తా లేదు. రైతుబంధు కింద ఇచ్చే రూ.10 వేలను ఊడగొట్టారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయి మూడో సీజన్ కూడా వచ్చేసింది. రేవంత్‌రెడ్డి సర్కారు మొత్తంగా ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ పడింది. రైతులకు హక్కుగా రావాల్సిన ఈ సొమ్మును వదులుకోవద్దు. ఏ పంట పైసలు వేస్తారు? ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా వానాకాలం పైసలా? యాసంగి పైసలా? ఏడాదికి ఒకే పంటకు ఇస్తారా? రెండు పంటలకు వేస్తారా? ఈ కుట్రను రైతాంగం గుర్తించాలి. ఇప్పుడు వేయాల్సింది ఎకరానికి రూ,7,500 కాదు..రూ.17500 డిమాండ్ చేయాలి. పీఎం కిసాన్తో లింక్ చేస్తే సగం మందికి కూడా రాదు ఆదాయం పన్ను కట్టేవాళ్లకు, పాన్ కార్డు ఉన్న వాళ్లకు రైతుబంధు కట్ అని పత్రికల్లో కథనాలు రాయించారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇక భూమితో బంధం తెంపేస్తారా? పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు. 70 లక్షలకు పైగా రైతన్నలు ఉంటే 30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ రావట్లేదు. రైతులను అవమానపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంరూ.22 వేల కోట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, క్రషర్లకు ఇచ్చారనే దు్రష్పచారంతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది. వానా కాలంలో పోలి్చతే యాసంగిలో సాగు తగ్గుతుంది. పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు రెండు సీజన్లు వేయడం సాధ్యం కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం యాసంగిలో కూడా వానాకాలం లెక్క ప్రకరామే రైతుబంధు పైసలు జమ చేసింది. అయితే యాసంగిలో వేసిన రైతుబంధు పైసలను దుర్వినియోగం లెక్కల్లో వేసి కాంగ్రెస్ సర్కారు అన్నదాతలను దొంగలుగా చూపుతోంది. రైతులందరికీ రైతుభరోసా అమలు చేయాలి. రైతులకు ఇస్తున్నది భిక్ష కాదు, వారి హక్కు అని ప్రభుత్వం తెలుసుకోవాలి. మేం రైతులకు అండగా ఉంటాం’అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన కిషన్‌రెడ్డి
ఢిల్లీ : అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ఈ ఆందోళన కాంగ్రెస్‌కు మద్దతుగానా?, లేక స్పాన్సర్డ్గానా అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. The incident of stone pelting at actor Allu Arjun's residence in Hyderabad highlights the shocking failure of law and order under the Congress government in the state. Incidents reflect the administration's inability to protect & ensure the safety and security of citizens.… pic.twitter.com/xhRMmNs1mj— G Kishan Reddy (@kishanreddybjp) December 22, 2024 ‘స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్’.. సోషల్ మీడియాలో వైరల్అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి -
అల్లు అర్జున్‌కు అండగా బండి సంజయ్
సాక్షి, ఢిల్లీ: తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కామెంట్స్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు బాసటగా నిలిచారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద ఘటనలో మహిళ మరణాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ కోరుకోవడంతోపాటు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని మరీ.. సినిమా లెవల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోంది. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే ఏనాడైనా పరామర్శించారా?. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా బాధ్యత వహించారా?. మీకో న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా?. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సినిమాను తలపించిన అసెంబ్లీ సమావేశాలు: పొన్నాల సెటైర్లు
సాక్షి, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన అంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలు సినిమా చూసినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ పేరుతో సినిమా చూపెట్టారు.. అందులో హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంట్రాక్టర్లు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా?. అదానీతో రేవంత్‌రెడ్డికి అంతర్గత ఒప్పందం ఉంది. అందుకే రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి రేవంత్.. అదానీపై ఫిర్యాదు చేయలేదు. ప్రజలను తప్పు దారిపట్టించేందుకు.. అసెంబ్లీ వేదికగా మోసం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం గవర్నర్‌ను కలిశారా అని ప్రశ్నించారు.రాష్ట్ర ఆదాయం మూడున్నర రెట్లు పెరిగింది. నిజ జీవితంలోనూ లోన్ అనేది ఒక భాగం. అప్పులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అంటున్నారు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇలా లేదు. లోన్లు పరిమితులకు లోబడే వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? లేక క్లోజ్ చేస్తారా?. అప్పులు, పెట్టుబడుల గురించి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. మంత్రులు, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదారి పట్టించారు. బీఆర్ఎస్ పాలనలో 27 రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. కాంగ్రెస్ నేతలు వస్తారా చూపిస్తాను. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయలేదు. అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రవర్తన చాలా బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు.మరో బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..‘పదేళ్ల పాటు అన్ని పండుగలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా జరిపారు. బతుకమ్మ పండుగకు చీరలు.. రంజాన్, క్రిస్మస్ పండుగలకు గిఫ్ట్స్ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. హైడ్రాతో పేదలను రోడ్డున పడేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధికారంలో ఉంటే అబద్దాలు నిజమవుతాయా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా? అని ప్రశ్నించారు. అలాగే, రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? అని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారువందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం.రుణమాఫీ కానీ రైతన్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు?రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లిరా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్ధనోరా రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదాంరుణమాఫీ మాయరైతుభరోసా రూ. 7500 మాయతులం బంగారం మాయమహిళలకు రూ.2500 మాయరూ.4000 ఆసరా ఫించన్లు మాయరూ.6000 దివ్యాంగుల ఫించన్లు మాయజాగో తెలంగాణ జాగో అంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారు వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం .. రుణమాఫీ కానీ రైతన్నలకు ఏం సమాధానం చెబుతుంది ?… pic.twitter.com/QmWuYgmFmK— KTR (@KTRBRS) December 22, 2024 -
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేను తొక్కుకుంటూ వచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను నల్లమల నుంచి వచ్చా. క్రూరమృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చా. తొక్కుకుంటూ వచ్చా. ఇక్కడున్నోళ్లను తొక్కితే అక్కడ తేలిన్రు. నేను అయ్య పేరుమీదనో, మామ పేరుమీదనో వచి్చనోడిని కాదు. స్వశక్తిని నమ్ముకొని పైకొచ్చినవాడ్ని. అమెరికాలోనో, గుంటూరులోనో చదువుకున్న చావు తెలివితేటలు వాళ్లకుంటే ఉండొచ్చు. నాకు సామాన్యుడి తెలివితేటలు ఉన్నాయి. నా వ్యక్తిగత కోపతాపాలు చూపవద్దని ఇంతకాలం ఓపికతో ఉన్నా.ఈ ఆర్థిక విధ్వంసకారులను నియంత్రించే శక్తి, క్రూరమృగాలను కూడా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉంది’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు రేవంత్ మాటల్లోనే... ‘‘తెలంగాణపై కమిట్మెంట్ ఉన్నోళ్లు కూడా కొందరు అటువైపు ఉన్నారు. వారికి చెప్తున్నా.. దొంగలకు సద్దులు మోసేవాళ్ల సావాసం మంచిది కాదు. వాళ్లు ఇదే నగరంలో పుట్టినవారు. హైదరాబాద్ కూడా Éఢిల్లీలా కాలుష్యం కోరల్లో చిక్కుకోవాలా? నల్లగొండకు ఫ్లోరైడ్ నుంచి మోక్షం వద్దా? బావాబామ్మర్దులిద్దరూ రండి. నల్లగొండకో, రంగారెడ్డికో, భువనగిరికో, మునుగోడుకో, ఎల్బీనగర్కో, సూర్యాపేటకో పోదాం. మూసీ పునరుజ్జీవం చేయాలా? వద్దా? ప్రజలను అడుగుదాం. నేను, రాజగోపాల్‌రెడ్డి గన్‌మన్ లేకుండా వస్తాం. మీరూ రండి. జనం మధ్యనే తేల్చుకుందాం. వాళ్లలా ఇస్తే ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు భరోసాకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే రైతుబంధు కేవలం పెట్టుబడి సహాయ పథకం మాత్రమే. ఆ రూపంలో రూ.72,816 కోట్లు ఇస్తే.. అందులో రూ.22,606 కోట్లు సాగులోనే లేని రాళ్లురప్పలకు, గుట్టలకు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమల స్థలాలకు ఆయాచితంగా చెల్లించారు. గిరిజనులకు అందించిన పోడు భూములకు బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలు రూపొందించి రైతుబంధు పొందారు. ఇప్పుడు మేం కూడా అలా చెల్లించాలంటూ బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం కదా. ఇక వారి నేత ఆయన చేసిన అద్భుతాలపై ప్రశి్నస్తారన్న భయంతో సభకే రావడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు ఆయన. ఉపాధ్యక్షుడు.. అదే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పారు. ఇక వారు చేసిన రుణమాఫీ వడ్డీలకే మాత్రమే సరిపోయింది. అదికూడా ఔటర్ రింగురోడ్డును తెగనమ్మి రూ.7,500 కోట్లు తెచ్చి రుణమాఫీకి వాడేశారు. మేం కేవలం 27 రోజుల్లో రూ.17,869.21 కోట్లు రుణమాఫీ చేశాం. సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికోసం నవంబర్‌లో రూ.2,747 కోట్లు విడుదల చేశాం. మొత్తం 25,35,963 మందికి రూ.20,616 కోట్లు మాఫీ చేసి వారి రుణం తీర్చుకున్నాం. స్విస్ బ్యాంకు కూడా అప్పులిస్తారు.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేం. రూ.8 వేల కోట్లు కావాలి. మా దగ్గర నల్లధనం లేదు అని నాటి సీఎం అన్నారు. నల్లధనం ప్రభుత్వం వద్ద లేదేమోగానీ వారి వద్ద ఎందుకుండదు? అంతా అక్కడికే కదా చేరింది. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే సామర్థ్యం వాళ్లది.ఆయన కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా..గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.7,11,807 కోట్లు. మేం అధికారంలోకి వచ్చాక రూ. 1,27,208 కోట్లు అప్పు చేశామంటున్నారు. రెండూ కలిపితే దాదాపు 8.39 లక్షల కోట్లు కావాలి. రెండు రోజుల క్రితం తీసుకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు మొత్తం రూ.7,22,788 కోట్లే. 58 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లే. గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిల భారం లేకపోతే.. మేం అద్భుతాలు సృష్టించి ఉండేవాళ్లం. గత పదేళ్లలో కనీసం హాస్టళ్లకు భవనాలు కూడా కట్టలేకపోయారు. దీనిపై ముక్కు నేలకు రాసి దళిత, గిరిజన, మైనారిటీ పిల్లలకు క్షమాపణ చెప్పాలి. ముఖం చాటేస్తున్న ఆయన సభకు వస్తే అడిగి, కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నా.అన్నీ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా? నా ప్రాంతం కాకున్నా కొడంగల్‌లో ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడే మళ్లీ గెలిచి సీఎం అయ్యా. ఆ వెనకబడ్డ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నా, పరిశ్రమలు తేవాలని నిర్ణయించా. ఓ 50 వేల మందికి ఉద్యోగాలు రావటంతోపాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనుకున్నా. దీన్ని సహించలేని కొందరు డబ్బు, మద్యం పంచి అధికారులపై దాడులు చేయించారు. మూసీ వద్దంటారు, మెట్రో పొడిగిస్తామంటే వద్దంటారు, ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, పరిశ్రమలు వద్దంటారు.. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించడం ఎలా సాధ్యం. తెలంగాణ పురోగతిని అడ్డుకునే వాళ్లను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
రుణమాఫీపై సీఎం రేవంత్‌తో చర్చకు సిద్ధం: హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తాను చర్చకు సిద్ధంగా ఉన్ననాని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని, అబద్ధాల్లో ఆయన గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు హరీష్.రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌లపై క్లారిటీ ఇవ్వలేదని, ఏడాది దాటినా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇక సంద్య థియేటర్ ఘటన చాలా బాధాకరమన్న హరీష్.. వాంకిడి హాస్టల్లో విషాహారం తిని బాలిక చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో బాలిక కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదన్నారు. ఒక వ్యక్తి సీఎం సోదరుడి కారణంగా చనిపోతే చర్యలు మాత్రం శూన్యమని మండిపడ్డారు హరీష్.సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.శనివారం(డిసెంబర్21) అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు.‘రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. సీఎం వంద శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. వారి ఎమ్మెల్యేలు మాత్రం 70,80 శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. రేవంత్ మాటల్లో చిత్త శుద్ధి లేదు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. రైతులను మోసం చేశారవు. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఓటు నోటుకు దొంగ రేవంత్‌రెడ్డి సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నాడు.పత్తి, కంది సాగు చేసే రైతులకు రెండో పంటకు రైతు బంధు వేయరా. రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండని మేము అడిగితే ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు.రైతు ఆత్మహత్యల మీద అబద్ధాలు చెప్పింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రైతు బంధు ఇచ్చిన తరువాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు. తెలంగాణ ఎప్పటికీ సర్ ప్లస్ స్టేట్.పదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ,రైతు బంధు ద్వారా ఇచ్చాము.పాన్ కార్డులు, ఐటీ ఉద్యోగులు ,ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వం అంటే ఎలా.ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు.రైతు భరోసా మీద వేసిన కమిటీలు అన్ని కాలయాపన కోసమే. ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. గుణాత్మకమైన మార్పు కోరుకున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా జరుగుతోంది.కాంగ్రెస్ వస్తే రైతు బంధు కట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు కట్ అయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు నిలదీయాలి.సంక్రాంతి తరువాత ఎన్నికలు అంటున్నారు ఏ సంక్రాంతి అనేది చెప్పడం లేదు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకువెళ్లి చూపించండి. 420 హామీలు,ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నిన్ను వదలం.ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం.ఈడీకి,మోడీకి మేము భయపడం’అని కేటీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్కు పొంగులేటి వార్నింగ్.. కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్ఎస్పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం. -
మీరు కోరినట్లు చేస్తే మేం ప్రతిపక్షంలో ఉంటాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు భరోసా మీద సలహాలు ఇస్తారని అనుకున్నానని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారు. లేఅవుట్లు వేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు.మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారు. మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షం లో ఉంటాం. ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన సభకు రాలేకపోతున్నారు..గుట్టలు, రోడ్డు, రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధం గా ఉంది. బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం’ అని రేవంత్ అన్నారు.అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన, చిత్ర విచిత్ర వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు వచ్చారు.మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రైతుభరోసాపై సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అలా జరగడం లేదు.గత పదేళ్ల పాలనపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభకు రావడం లేదేమోఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ మేం మీలా కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. -
అది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ: సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అలాగే, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా సభలో మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ నేతలకు కౌంటరిచ్చారు. సభలో సీతక్క మాట్లాడుతూ.. కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా?. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా. అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్ అవుతారా? అని అన్నది ఎవరు?. ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి.వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయి. 5,6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు. గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు 30వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది.భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు?. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. వందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా?. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అనేది అన్ని గ్రామాల్లో స్పష్టంగా వివరాలు ఉంచాలి అని కామెంట్స్ చేశారు.