breaking news
-
వీడియో: పాడి కౌశిక్‌రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామునే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) విచారణ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 5:30కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. @BRSparty pic.twitter.com/bFtbUFGYt0— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 6, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్(BRS Party) ఎమ్మెల్యే కేటీఆర్ ఈకేసులో నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకున్నారు. దీంతో, కేటీఆర్ విచారణకు వెళ్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కేటీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులను అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. -
రైతు భరోసా కుదింపు వంచనే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుభరోసా సాయాన్ని ఎకరానికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు రూ. 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రామగ్రామాన ఎండగట్టేందుకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతోపాటు రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని కోరారు. నాడు బిచ్చం అన్నావు.. నేడు ముష్టి వేస్తున్నావా? ‘ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ రైతులకు ఏటా రూ. 10 వేలు ఇస్తే దాన్ని రేవంత్ ‘బిచ్చం’అన్నాడు. మరి నువ్వు ఇప్పుడు పెంచిన మొత్తం మాటేమిటి? రైతులకు ముష్టి వేస్తున్నావా? తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన మోసంతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఎక్కడ? ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలి. మేనిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు రైతుభరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ రైతుబంధుగా నిలిస్తే రేవంత్ రాబందుగా మిగులుతారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రకటన చేశారు. ఎన్నికల తరువాత ఎత్తేసే కుట్ర జరుగుతుంది. రైతుబంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి కాదు... రేవంత్ మానసిక పరిస్థితి బాగాలేదు ‘రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు.. దివాలా తీసింది రేవంత్‌రెడ్డి మెదడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది ఆయనే. రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. సంవత్సరంలో రూ. లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు. 2014లో రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లతో మాకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే 2023లో రూ. 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేం రాష్ట్రాన్ని అప్పగించాంం. అప్పుల పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అన్యాయం చేస్తున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగుల పరిస్థితులు బాగుండేవంటూ రేవంత్‌రెడ్డి తెలంగాణను కించపరిచారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ పాలనలో అత్యధిక జీతాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. -
కేసీఆర్ .. మీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?
సాక్షి,హైదరాబాద్ : రైతు భరోసా చెల్లింపుల కోసం భూముల్ని తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పుగా తెచ్చారు. మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలిందని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ (kcr).ఆయన బాటలోనే రేవంత్ (revanth reddy) ప్రభుత్వం నడుస్తోంది.ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిసి ఎకరాకు రూ.18 వేల బకాయి చెల్లిస్తారా?.70 లక్షల మంది రైతులకు రూ.12 వేల 600 కోట్లు జనవరి 26న చెల్లిస్తారా? లేదా?.రైతు భరోసా (rythu bharosa) సొమ్ము చెల్లించేందుకు టీఎస్ఐఐసీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు? మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలింది?లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓట్లేయించుకునేందుకే అప్పు తెచ్చి రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఎన్నికల తర్వాత రైతు భరోసా ఆపేయడం ఖాయం.తెలంగాణ ప్రజాలారా..కాంగ్రెస్ మోసాలను తెలుసుకోండి.ఫాంహౌజ్‌లో పడుకునే కేసీఆర్..మీకు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు?.ప్రజా సమస్యలపై స్పందించని మీరే ప్రతిపక్ష నేత? చేతనైతే ఆ పదవిని హరీష్, గంగుల, తలసాని, జగదీష్ రెడ్డిలలో ఎవరికైనా ఇచ్చే దమ్ముందా?.ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, పేదలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది’అని బండి సంజయ్ ఆరోపించారు. 👉ఇదీ చదవండి : ‘రేవంత్‌ను వదిలిపెట్టం’ -
‘రేవంత్‌ను వదలిపెట్టం’
సాక్షి,తెలంగాణ భవన్ : మోసానికి, నయ వంచనకు కాంగ్రెస్ (Congress) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) మండిపడ్డారు. ప్రస్తుత, రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మోసం,నయ వంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ మోస పూరిత హామీలు ఇచ్చింది. సోనియా గాంధీ మాటగా రూ.15 వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ రైతు బంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా (Rythu bharosa) కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రూ.12 వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోంది. దేశంలోనే కేసీఆర్ రైతుబంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా మిగిలిపోతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. 👉చదవండి : రైతు భరోసాపై రేవంత్ పేచీ..ఓడ దాటేంత వరకు ఓడ మల్లన ..ఓడ దాటగా బోడ మల్లన అన్నటుగా కాంగ్రెస్ ప్రభుత్వ నైజం మరోసారి బయట పడింది. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను కించ పరిచేలా, చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారు. పథకాలు హామీల విషయంలో రేవంత్‌వి దివాలాకోరు మాటలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితే బాగలేదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని రైతులను,మహిళలను,ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి పోయాయి. రుణ మాఫీ, రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్పితే ..రైతుల గురించి పట్టించుకోవడం లేదు. రూ.5,493 కోట్ల రెవెన్యూ సర్ప్లేస్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించాం. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు ఎగ్గొట్టేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి.ప్రతి రైతుకు రూ.17,500 ఎకరాకి ఇచ్చే వరకు రేవంత్‌ను వదిలి పెట్టం.రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరసనలురైతులకు సంఘీ భావంగా రేపు అన్ని జిల్లాలో, నియోజక వర్గాల్లో, మండలాల్లో నిరసనలు చేపడుతాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకే ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ డ్రామా ఆడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పధకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టె ప్రయత్నం చేస్తోంది’ అని కేటీఆర్ ఆరోపించారు. -
మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇదే సమయంలో రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వంమోసానికి మారు పేరు కాంగ్రెస్ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వంఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దంరాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకంప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలుసిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు.. మోసగాళ్ల బెదిరింపుల మేళాఅబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్.. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అంటూ కామెంట్స్ చేశారు.అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి మారు పేరు కాంగ్రెస్ ధోకాలకు కేరాఫ్… pic.twitter.com/oE7ziV5UlI— KTR (@KTRBRS) January 5, 2025 -
కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పేరుతో ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రైతుల ఆశలను అడియాశలు చేసింది. రైతు భరోసా పథకాన్ని రైతు గుండె కోతగా మార్చారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.6 వేలకు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. మోసానికి పర్యాయపదం రేవంత్‌రెడ్డి అనే విషయం నగ్నంగా బయటపడింది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కేబినెట్లో కౌలు రైతుల ఊసేలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా గుండెకోత మిగిల్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘కౌలు రైతులకు కూడా రెండు వ్యవసాయ సీజన్లలో కలిపి ఎకరా కు రూ. 15 వేలు పంట పెట్టుబడి సహాయం అందిస్తా మని కాంగ్రెస్ ప్రమాణం చేసింది. కానీ తాజా కేబినెట్ సమావేశంలో ఈ అంశమే చర్చించలేదు. కౌలు రైతులకు గుండె కోత కలిగిస్తూ దారుణంగా ధోకా చేశారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు’అని హెచ్చరించారు. -
స్థానిక ఎన్నికలకు ‘భరోసా’ దిశగా..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్ విమర్శించారు. -
ఓ చెత్త కేసు కేటీఆర్‌పై పెట్టారు.. ఈడీపై జగదీష్ రెడ్డి ఫైర్
సాక్షి, సూర్యాపేట: దేశంలో ప్రధాని మోదీ సహకారంతోనే కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేటీఆర్‌పై పెట్టింది ఒక చెత్త కేసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రైతులు నిలదీయాలి అంటూ సూచించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు. బడే భాయ్.. చోటే భాయ్ కలిసి కేసులు పెట్టారు. మోదీ సహకారంతోనే కేసులు పెడుతున్నారు. బ్లాక్ మనీ వైట్ చేస్తే.. ఈడీ రావాలి. అంతేకానీ.. తీసుకున్నది ఎవడో తెలియదు కానీ.. ఇచ్చినోడి మీద కేసులా?. ఇది తాత్కాలిక ఆనందం.. శునాకనందం తప్ప ఏమీలేదు.రైతు భరోసా ఎగొట్టడానికే కేసుల వ్యవహారం చర్చ తీసుకువచ్చారు. పక్కదారి పట్టించడానికే ఇవన్నీ చేస్తున్నారు. రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. ఈ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది. ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్రానికి అప్పులు చేసి ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్‌లో మాట్లాడినట్టు రైతు భరోసా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. దేశంలోనే చెత్త సీఎం రేవంత్ రెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తే రేవంత్‌కు అసలు విషయం తెలుస్తోంది. ఆయనపై దాడి చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రైతులు, తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. కేటీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టాలన్న ఆలోచన తప్ప మరేమీ లేదు. కాంగ్రెస్ నేతలు చివరకు సెక్రటేరియట్ కూడా అమ్ముకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి’ అంటూ సవాల్ విసిరారు. -
రేవంత్.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం!మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా.. నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు!కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావని!లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశావని!అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా…నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం! అంటూ కామెంట్స్ చేశారు. ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం! మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా…నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం! ఇప్పుడైనా… pic.twitter.com/GHVRj3fokN— KTR (@KTRBRS) January 4, 2025 -
ప్రమాణ పత్రాలు అడగడం సిగ్గుమాలిన చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతుబంధు పథకం అమలు చేయడం చేతకాకపోతే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. గతంలో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు తలొగ్గి ఏడాది తర్వాత వెనక్కి తగ్గి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను రాజులుగా శాసించే స్థితికి తీసుకెళ్తే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం వారిని యాచించే స్థాయికి దిగజారుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరి పేయడమే లక్ష్యంగా రైతుబంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి కేటీఆర్ విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ‘రైతు భరోసా కోరు కొనే రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పడం సిగ్గు మాలిన చర్య. ప్రభుత్వానికి దమ్ముంటే రైతు రుణమాఫీ, వరికి బోనస్, ధాన్యం కొనుగోలుకు డబ్బు చెల్లింపు, రైతు బంధు పథకంపై ఊరూరా ‘ఇమాన పత్రాలు’ ఇవ్వాలి. ఏడాది నుంచి గ్రామాలవారీగా ఎందరు కౌలు రైతులు, రైతు కూలీలకు లబ్ధి జరిగిందో జాబితాలు ప్రదర్శించాలి. రైతు బంధులో రూ. 22 వేల కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ వివరాలు కూడా గ్రామాల వారీగా బయట పెట్టాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.దరఖాస్తులపై ప్రభుత్వాన్ని నిలదీయండి‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల కోసం అభయ హస్తం పేరిట 1.06 కోట్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇటీవల కులగణన పేరిట నిర్వహించిన ఇంటింటి సర్వేలోనూ రైతుల పూర్తి వివరాలు సేకరించింది. అలాంటప్పుడు రైతుల నుంచి మళ్లీ ప్రమాణ పత్రాలు కోరాలనే అలోచన దుర్మార్గం. గతంలో ఇచ్చిన దరఖాస్తులపై అధికారులను రైతులు నిలదీయాలి. పత్తి, కంది, చెరుకు, పసుపు, మిర్చితోపాటు ఇతర ఉద్యాన పంటలకు రైతుబంధు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రమా ణ పత్రాలను తెరపైకి తెచ్చింది. క్రషర్లు, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గుట్టలు, రాళ్లు రప్పలకు రైతుబంధు ఇచ్చారని ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఊరూరా ఆ వివరాలు బయట పెట్టాలి. ఏడాది కాలంగా రైతుబంధు ఇవ్వకుండా ఎగవేసిన ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 17 వేలు చొప్పున బకాయి పడింది. ఒక ఎకరా మొదలుకొని ఏడు ఎకరాల వరకు లెక్కతీసి రైతుబంధు రూపంలో రైతులకు రావాల్సిన బకాయిలపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం. రైతుభరోసాలో కోతలు విధిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రైతులతో కలిసి ఉద్యమిస్తాం’అని కేటీఆర్ హెచ్చరించారు. తమ హయాంలో రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా, ఆఫీసుల చుట్టూ వారు తిరిగే అవసరం లేకుండా 11 సీజన్లలో రూ. 73 వేల కోట్లను రైతుల ఖాతాలో వేశామన్నారు. -
కోతలే తప్ప చేతలు లేవు
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. ఆశచూపి వెన్నుపోటు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
ప్రజావాణి ప్రహసనం.. ప్రజాపాలన డొల్ల: మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చిన ప్రజాపాలన డొల్లగా మారి, ప్రజాపీడన జరుగుతోందని, ప్రజావాణి ఉత్త ప్రహసనంగా తేలిపోయిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతీరోజూ ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రకటించి, ప్రజావాణిగా పేరు మార్చారన్నారు. ఏడాది కాలంలో సీఎం రేవంత్(Revanth Reddy) కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజావాణికి హాజరై.. పది నిమిషాల పాటు పాల్గొన్నారన్నారు. గాం«దీభవన్‌కు వెళ్తున్న మంత్రులకు ప్రజావాణికి వచ్చే తీరిక లేదని ఎద్దేవా చేశారు. ప్రజావాణిపై ఆర్టీఐ చట్టం కింద సేకరించిన సమాచారంలో ఈ కార్యక్రమం ప్రహసనంగా మారిన వైనం బయటపడిందన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు(Harish Rao) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజావాణిని చివరకు ఔట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగులతో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రజావాణిలో దరఖాస్తుల సమర్పణ వృథా ప్రయాస అనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ (సమస్యలు) కిందకు వస్తాయని మిగతావి వాటి పరిధిలోకి రావని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు సమాచారం ఇచ్చారు. అలాగే పరిష్కారం అయినట్లుగా చెపుతున్న దరఖాస్తుల్లో చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి’అని పేర్కొన్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి హైదరాబాద్‌కు వచ్చిన ప్రజలకు న్యాయం జరగడం లేదని హరీ‹Ùరావు విమర్శించారు. -
వారి ఉచ్చులో పడితే.. నష్టపోయేది మీరే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కష్టకాలంలో బాధ్యతలు చేపట్టామని.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామన్నారు.‘‘ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడంలేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన రూ. 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల 22500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది’’ అని సీఎం రేవంత్ వివరించారు.‘‘గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!ఈ ప్రభుత్వం మనది.. ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి. పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే..ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలి. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదు’’ అని రేవంత్ చెప్పారు. -
‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం’
సాక్షి,హైదరాబాద్: ‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని’ కాంగ్రెస్ (congress) ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘రుణ మాఫీ వచ్చే నాలుగేళ్లలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. 35 రోజుల క్రితం రుణమాఫీ చెక్కు ఇచ్చినా..ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది.పండిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేదా ? రైతులంటే పట్టింపు లేదా ? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుంది ?.రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ భారం అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. రైతులపై భారం పడకుండా రైతు పక్షపాతిగా మోదీ (narendra modi) ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు. -
అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కవిత
సాక్షి, హైదరాబాద్: జనగణనలో భాగంగా కుల గణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర బీసీ మహా సభలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలేదు. మండల్ కమిషన్ రిపోర్ట్‌ను బీరువాలో పెట్టారు. మండల్ కమిషన్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి?. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగింది. అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని కవిత సవాల్ విసిరారు.‘‘దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు. బీసీల కోసం పని చేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు’’ అని కవిత చెప్పారు.‘‘కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు’’ అని కవిత అన్నారు. -
రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఇవ్వాలని అంటున్నారు.. రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రైతు భరోసా (Rythu Bharosa) కింద రైతులకు ఇవ్వలేదు.. రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు కుల గణన డ్రామా చేశారని దుయ్యబట్టారు.‘‘ఊరూరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఏ ఊళ్లో ఎంత రుణమాఫీ చేశారో లిస్ట్ బయటపెట్టాలి. ఏ ఊళ్లో ఎంతమందికి బోనస్ ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ ఊళ్లో రైతు కూలీలకు ఎంత బాకీ పడ్డావో ఆ లిస్ట్ కూడా బయటపెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుక్కను చంపే ముందు పిచ్చిదని ముద్ర వేయాలని.. రైతు బంధు పథకాన్ని కూడా బొందపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. రూ.22 వేల కోట్లు ఎక్కడ దారి మళ్లాయో లిస్ట్ బయటపెట్టాలి. ఈ ప్రభుత్వం పచ్చి దొంగ మాటలు మాట్లాడుతోంది. ఈ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగండి...ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం 17,500, ఊరూరా పోస్టర్లు వేసి మరీ రైతులకు తెలిసేలా చేస్తాం. రైతు బంధును లేకుండా చేయాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుక్కుంటారా అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వ ధోరణి ఆలోచన చాలా దారుణంగా ఉంది’’ అని కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు!‘‘రేపటి(శనివారం) నుండి రైతులను చైతన్య పరుస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. వరుసగా 11 సార్లు రైతులకు సమయానికి రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం వేసింది. రూ.73 వేల కోట్లు రైతు భరోసా కింద రైతులకు నేరుగా వేశాము. ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద వేయలేదు. కాంగ్రెస్ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతొ బిల్డప్ ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది? వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ప్రజా పాలన కింద కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ డిటైల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర వున్నా.. మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకు??రైతులు ఏ పంట వేసారో అని ప్రమాణ పత్రం ఇవ్వాలని ఈ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది.. ప్రమాణ పత్రాలు ఎవ్వరూ ఇవ్వాలి .. ఈ ప్రభుత్వం ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. కౌలు రైతులకు , భూ రైతులకు రైతు భరోసా ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. 22 వేల కోట్లు దుర్వినియోగం అని దొంగ మాటలు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. 22 వేల కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళాయో ఈ ప్రభత్వం చెప్పాలి.. చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా ??’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
కార్యకర్తలే పార్టీకి పునాది రాళ్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు పునాది రాళ్లు, మూల స్తంభాలు కార్యకర్తలేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గులాబీ జెండాకు వెన్నెముకలా ఉంటూ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు మీరేనంటూ కార్యకర్తల్లో ‘ఎక్స్’వేదికగా ఉత్సాహం నింపారు. ‘ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబుట్టువులారా.. ఏడాదిగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరాట స్ఫూర్తిని చూపినందుకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. గెలుపోటములతో సంబంధం లేకుండా మీరు చూపిన ఉత్సాహం రాష్ట్రస్థాయిలో నాయకత్వానికి కొండంత స్ఫూర్తినిచ్చింది. ప్రజల పక్షాన కార్యకర్తలు విరామం లేకుండా పోరాడుతున్నారు. రైతులు, నేత కార్మికులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించడంతో పాటు.. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. మూసీలో మూటల వేట మొదలుకుని లగచర్ల లడాయి వరకు జరిగిన ఉద్యమాల్లో బాధితుల పక్షాన నిలిచారు. అదానీకి రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేయటం, లగచర్ల అంశంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడంలో పార్టీ యంత్రాంగం విజయం సాధించింది. అక్రమ కేసులతో ప్రభుత్వం వేధించినా పార్టీ వెంట కార్యకర్తలు నిలిచిన తీరు అపూర్వం, అసాధారణం’అని కేటీఆర్ అన్నారు. -
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు‘‘బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం’’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’’ అంటూ మహేష్ కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా.?..బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?..జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?..గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?. ఎమ్‌బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?..గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?’’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలు సంధించారు. -
రెండు రోజుల్లో సర్కార్ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని.. 2 రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయటపడపెడతానంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కుంభకోణంలో మంత్రుల హస్తం ఉందని.. పూర్తి అధారాలతో కుంభకోణాన్ని బయటపెడతానన్నారు.‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కనీసం కొత్త సంవత్సరం అయినా గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలి. ఏడాది పాటు ప్రజలను ఇబ్బందులు పెట్టి కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలేదు. ఈ దుర్మార్గాలను ఇకనైనా వీడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. గత ఏడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసింది’’ అని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.గత ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేదు.. ఇప్పుడు రబీ సీజన్లో అయినా ఇస్తారా?. మాయమాటలతో మోసం చేయడం తప్పా.. వారికి మంచి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు ఉందా?. ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయింది. వారికి ఇవ్వకుండా ఆయన్ను అడ్డుకునేది ఎవరు?. లేదా ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా?. మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట ఇచ్చారు.. ఏమైంది?’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటింది. అయినా దానికి సంబంధించిన విధి విధానాలు ఎందుకు ఇవ్వలేకపోయారు. 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటిలోగా ఇస్తారో తేదీ కూడా అదే రోజు ప్రకటించాలి. 15 వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క సీజన్‌కు 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్లు బకాయి ఉంది. కానీ సర్కార్ బడ్జెట్లో 15 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మిగిలినవి ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి’ అని మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు. -
మొదటిసారి గెలవడం ఓకే.. రెండోసారి గెలవడమే గొప్ప
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్ క్లాస్ తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటిసారి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం సరదాగా మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధిగా మీరు చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతుంటాయి. అన్ని విషయాలను వారు గుర్తుపెట్టుకుంటారు. మొదటిసారి మీపై చాలా అంచనాలతో గెలిపిస్తారు. అది గొప్ప విషయమేమీ కాదు. మీరేంటో తెలిసిన తర్వాత, మీ పనితీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి. కార్యకర్తలతో మమేకం కావాలి. మీరు ఈజీగా తీసుకుంటే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ప్రజలు ఒకసారి ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత అసలు రాజకీయమంటే ఏంటో అర్థమవుతుంది’అని క్లాస్ తీసుకున్నారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఉద్దేశించి.. ఆయన ఎలా గెలుస్తున్నారో అడిగి తెలుసుకోవాలని సూచించారు. మీరే మాట్లాడండి.. కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. తాను కూడా మరింత పట్టుదలతో పనిచేస్తానని చెప్పారు. ఉదయం నుంచి మంత్రులకు, పార్టీ నేతలకు తానే ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపండి. వీలున్నప్పుడల్లా వారితో మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌ను కలుపుకుని ముందుకెళ్లండి. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి’అని సూచించారు. నా రిపోర్టు నా దగ్గరే ఉంది తన పనితీరుకు 100కి 100 మార్కులు వేసుకోబోనని సీఎం రేవంత్ అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని, తన రిపోర్టు కూడా తన దగ్గరే ఉందని తెలిపారు. ఈ రిపోర్టులను త్వరలోనే అందరికీ పంపిస్తానని కూడా చెప్పినట్టు తెలిసింది. సీఎంగా అధికారిక బాధ్యతలు అలవాటు అయినందున.. ఇక నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకోవద్దని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలకు స్పష్టంచేసినట్లు తెలిసింది. అంగన్వాడీలు, రేషన్ డీలర్ల నియామకంలో తమకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఓ మంత్రి కోరిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. సీఎం మాటలు స్ఫూర్తినిచ్చాయి: ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ప్రజాప్రతినిధి హోదాలో తొలిసారి సీఎం రేవంత్‌ను కలవడం స్ఫూర్తినిచ్చిందని, ఆయన చెప్పిన మాటలు తన బాధ్యతను మరింత పెంచాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ను ఎప్పుడు కలిసినా ఏదో ఉత్తేజం వస్తుందని, ఈసారి మాత్రం రాజకీయ అనుభవాల గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. -
నేను మారాను.. మీరూ మారండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. ‘‘మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. నేను మారాను.. మీరూ మారండి’’ అంటూ సీఎం సూచించారు.కొందరు ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. అతి చేస్తే సహించేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వండి. కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృత ప్రచారం జరగాలి’’ అని రేవంత్ చెప్పారు.సీఎం రేవంత్‌రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సు జరగనుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. -
బాబు.. పవన్.. ఊసరవెల్లి.. సిగ్గు సిగ్గు!
అందితే జుట్టకు.. అందకుంటే కాళ్లు అని సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విద్య వెన్నతో పెట్టిందేనని చాలాకాలంగా అందరికీ తెలుసు. అయితే ఈమధ్యకాలంలో ఆయనకు పవన్‌కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమే కాదు.. రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమెలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి! అల్లూ అర్జున్ అరెస్ట్ విషయంలో పవన్ వ్యాఖ్యలు, వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తోంది. గతంలో సినిమా టిక్కెట్ల నియంత్రణకు జగన్ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తున ఎగిరిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్! జగన్ సినిమా వాళ్లను అగౌరవ పరిచారని, టిక్కెట్ ధరలకూ.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలుపెట్టారు. అసత్య ప్రచారం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్ ఆయన చాలా గొప్ప అని పొగిడేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని పవన్ పంచెలూడదీసి కొడతానని బహిరంగంగా ప్రకటించడం!!! పవన్ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లూ అర్జున్ అరెస్ట్‌ను కూడా తప్పు పట్టలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుద్దులు కూడా వల్లెవేశారు. చట్టంపై అంత గౌరవమున్న మనిషే అయితే.. గతంలో చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదేం? పైగా ఎందుకు రోడ్లపై పడి దొర్లారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారం యావకు 29 మంది నిండు ప్రాణాలు బలైతే.. నోరెత్తని పవన్ అల్లూ అర్జున్ విషయంలో మాత్రం ముందు వరుసలోకి వచ్చారే? ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం. మానవత్వం. ఒకసారి ఒకలా.. ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటల వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టిన రోజుకో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్‌కు అభిమానులు మరణించిన ఘటనలున్నాయి. మానవత్వం ఉన్న వారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసుండేవారు. బిజెపి మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ పొగడడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లుగానే ఉంది. బీజేపీ నేతలు ఒకపక్క అల్లు అర్జున్ను సమర్థిస్తూంటే పవన్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకోవడం వారికి అసంతృప్తి కలిగించింది. అందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ ఎందులో గొప్పవాడిగా కనిపించారని అడిగారు. రేవంత్ సినిమా వారి పట్ల కర్కశంగా వ్యవహరించినా, వారికి బెనిఫిట్ షో లు ఇచ్చే ప్రసక్తి లేదని, రేట్లు పెంచబోమని ప్రకటించినా పవన్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు. ఏపీలో గతంలో వేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఎద్దేవ చేస్తున్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. ‘‘నువ్వూ రెడ్డివే..జగన్ రెడ్డే.. మీరు, మీరు మాట్లాడండి’’ అని పెద్ద గొంతుకతో చెప్పారు. కాని ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ ను పొగిడేసి తెల్ల జెండా ఎత్తేశారన్నమాట. అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాతో పాటు తన సినిమాలు, బాలకృష్ణ వంటివారు నటించిన సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ చేయలేకపోయారు. ఎలాగొలా రేవంత్ ను ప్రసన్నం చేసుకుని మళ్లీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల విషయాలలో సానుకూల నిర్ణయం కోసం ఈ పాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా నటుడుగా ఉన్న ఆయన జనసేన పార్టీ పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి బాగానే లబ్ది పొందారని చెప్పాలి. కేంద్రస్థాయిలో బీజేపీతో జత కట్టడం, ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పినా, తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను అవినీతిపరులుగా ఆరోపించి, ఆ తర్వాత మళ్లీ వారితోనే స్నేహం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, వామపక్షాలతో కలిసి పోటీచేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదలివేశారు. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్ ఘనాపాటినే అనిపించుకున్నారు. చెగువేరా అభిమానిని ప్రచారం చేసుకుని, అనంతర దశలో మోడీ అంటే చాలా అభిమానం అని చెప్పుకున్నారు. వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందూవాదినని పోజు పెట్టగలిగారు. ఒకసారి ఓటమి పాలైనా, సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని, ఒక సామాజికవర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసినా రేవంత్ ను అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సినీ ప్రముఖుల మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్ లోనే ఆస్తిపాస్తులు ఉండడం వల్లే భయపడ్డారన్న వాదన ఉంది. గతంలో కెసిఆర్ ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెబుతారు. ఇలా రాజకీయాలను ,సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పాలి. ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు. విలువలు లేని రాజకీయం కావచ్చు..ఏమైతేనేం .. అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి. ఇటు సినిమాలలో వ్యాపారం పండాలి..ఈ వైఖరి తోనే పవన్ నడక సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడాన్ని సమర్దించుకున్న తీరు విడ్డూరమే .గతంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని,తన ఇంటిలోని వారికెవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు స్వరం మార్చారు. నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెబుతున్నారు.నాగబాబు మాదిరికాని, మంత్రి నాదెండ్ల మనోహర్ లాగా కాని బిసి,ఎస్సి,ఎస్టి నేతలెవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట.అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా, వారు శ్రమపడలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. అన్నిటికి మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలరో చెప్పకనే చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాలలో దిట్ట అని, అబద్దాలు ఆడడంలో బహు నేర్పరి అని అంతా అంటుంటారు. ఇప్పుడు పవన్ ఆయనను దాటి పోతున్నట్లుగా ఉంది.ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలోకాని, రాజకీయాలలో కాని, సినిమాలలో కాని విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.ఎవరితో అంటకాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపార పరంగా లాభమో ఆలోచించాలి. ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ చేసినట్లే అనుకోవచ్చేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీఎం రేవంత్‌కు పాస్ మార్కులు కూడా రాలే!
సాక్షి, హైదరాబాద్ /సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ఎన్ని సంస్థలు సర్వేలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాస్ మార్కులు కూడా రావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎ మ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గ్యారంటీల అ మలుకు బదులుగా ప్రభుత్వం గారడీ విన్యాసా లు చేస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘డిక్లరేషన్ల అమలుకు బదులుగా డైవర్షన్ రా జకీయాలు చేస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. పంటలకు బోనస్ అంటూ ఇప్పడు బోగ స్ మాటలు చెప్తున్నారు. లబి్ధదారులకు ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలపై క్షణాల్లో కేసులు నమోదు చేస్తూ, కాంగ్రెస్ నేతలపై వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను వక్రమార్గం పట్టిస్తూ.. అయితే లూటీ లేకుంటే లాఠీ అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో కాంగ్రెస్, బీజేపీ స్నేహం మరింత బలపడింది’ అని హరీశ్‌రావు విమర్శించారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఆరు వేల మంది రిసోర్స్ పర్సన్ల కు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని మండిపడ్డారు. వారి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బట్టలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అమలు చేయలేక విఫలమవుతోందని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం ఆయన విద్యార్థులకు దుప్పట్లు, టీషర్టు లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మెనూకు.. హాస్టళ్లలో అమలవుతున్న మెనూకు సంబంధమే లేదని అన్నారు. పిల్లలకు ఇప్పటివరకు కనీసం బట్టలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మొటిక్ ఛార్జీలు ఇప్పిస్తానని, మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించినవారికి తన సొంత ఖర్చులతో ఐప్యాడ్లు అందజేస్తానని, మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు. -
రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను వాడకండి: దిల్ రాజు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. రాజకీయ దాడి, ప్రతి దాడులకు చిత్రపరిశ్రమను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. ‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదు.. అందరికీ తెలిసే జరిగింది. తెలుగు చిత్రపరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్రపరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్రపరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారు.హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని చిత్రపరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని దిల్ రాజు ట్వీట్ చేశారు. కాగా, ఓ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి కేవలం ప్రచారం కోసమే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించాడని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి అసెంబ్లీ అలా మాట్లాడారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు.pic.twitter.com/m6VhQmda0C— Chairman - Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024