breaking news
-
కింగ్ ఫిషర్ బీర్ల నిలిపివేత.. అందుకేనా?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేయడానికి యునైటెడ్ బ్రూవరీస్(UB) తీసుకున్న నిర్ణయం పలు ప్రశ్నలు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. బీర్లకు సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.బీర్లకు సంబంధించిన బకాయిలను బెవరేజెస్ కార్పొరేషన్(TGBCL) చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందన్న హరీష్ రావు.. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హినెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారని చెప్పారు.బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్ -
పీఏసీ భేటీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి8) గాంధీభవన్‌లో జరిగిన పొలిటికల్ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ప్రభుత్వ కార్యక్రమాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.రేవంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశాంమన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందిపాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాంజనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నాం వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.12వేలు అందించబోతున్నాంకొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వబోతున్నాంమొదటి ఏడాదిలోనే 55143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాంరూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాంఏడాదిలో రూ.54వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశాంరూ .500 లకే సిలిండర్ ఇస్తున్నాం200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాంమహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాంఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందిత్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాంప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి -
మోదీతో పెట్టుకుంటే కేసీఆర్‌కు పట్టిన గతే: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందని,ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పార్టీ ఇంకొక పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంఘటన లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం(జనవరి 8) రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ‘పథకం ప్రకారమే బీజేపీ ఆఫీసుపై దాడి జరిగింది. రేవంత్ ప్రభుత్వం ఇంత బలహీనంగా ఉందా? అనుభవం ఉన్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నారు.రేవంత్ అధికార భ్రమలో ఉన్నారు. రేవంత్.. మేము తలచుకుంటే మీరు ఉండరు. మేము దాడి చేస్తే తుక్కు తుక్కవుతారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందా! దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. రేవంత్..మోదీని చూసి పరిపక్వత తెచ్చుకో. తెలంగాణలో ప్రతి గడపలో సీఎంను చీదరించుకుంటున్నారు. హై కమాండ్ మెప్పు కోసమే ఈ చిల్లర పని.రేవంత్ ప్రజల దృష్టిలో చిల్లరగాడిలా మిగిలిపోతారు. జనరల్ గా పార్టీ ఆఫీసులో అధ్యక్షుడు ఉంటారు.నిన్న మేము పార్టీ ఆఫీస్ లో ఉంటే పరిస్థితి ఏంటి? కేంద్రాన్ని అడిగేటప్పుడు మర్యాద పాటిస్తారు.బయటికి వచ్చాక చిల్లరగాళ్ళలా వ్యవహరిస్తారా? దేశంలో ఎక్కడ లేని విధంగా చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం జరిగింది. సీఎం ఇక్కడే ఉండి చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్‌కు రాకుండా వర్చువల్‌గా పాల్గొన్నారు. కానీ చిన్న ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కి మాత్రం వెళ్లే సమయం ఉందా? మోదీతో పెట్టుకుంటే కేసిఆర్‌కు పట్టిన గతే పడుతుంది. మీ విధానాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.బేషరతుగా సీఎం,సీపీ బీజేపీ ఆఫీసు మీద దాడి పట్ల క్షమాపణ చెప్పాలి’అని ఈటల డిమాండ్ చేశారు. -
హేమంత్ సోరేన్లా పట్టం కడతారు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డిది రివేంజ్ అని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం(జనవరి 8) తెలంగాణభవన్‌లో జరిగిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.‘ఇప్పుడుఉన్న పరిస్ధితుల్లో ఇబ్బంది ఏం లేదు.పార్టీ పెట్టినప్పుడున్న ఉన్న పరిస్ధితి, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమర వీరులు చేసిన త్యాగాలతో పొల్చితే ఇప్పుడున్న పరిస్ధితి ఇబ్బందేం కాదు.ఇప్పుడున్న కేసు లొట్టపీసు కేసు. రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఈ అక్రమ కేసుకు భయపడుతామా.జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ పైన కేంద్రం కక్ష కడితే ప్రజలకోసం,రాష్ట్రం కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు…40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పొల్చితే మనకున్న పరిస్ధితి పెద్ద ఇబ్బందేం కాదు. మనం ఇబ్బందిలో ఉన్నామని అనుకోవద్దు.మనం చేయాల్సింది రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలి.ప్రతి రైతుకి కాంగ్రెస్ ఎకరానికి రూ.17 వేలు బాకీ ఉందని చెప్పాలి. రైతు రుణమాఫీ,కౌలు రైతులకిచ్చిన కాంగ్రెస్ హమీలను ప్రశ్నించాలి.రానున్న సంవత్సరం మెత్తం రైతన్నలకు,తెలంగాణ ప్రజలకిచ్చిన హమీల అమలు,ప్రభుత్వ మోసంపైనే మాట్లాడుదాం.అంతేకానీ నాపై పెట్టిన అక్రమ కేసు గురించి అలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపైన నేను చట్టప్రకారం కొట్లాడుతా.తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయ పడేది లేదు. హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ.కాంగ్రెస్ పార్టీ నేతలు డీల్లీలోనూ అబద్దాలు అడుతున్నారు.తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు.తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం.ఈ సంవత్సరాన్ని మెత్తంగా పోరాట నామ సంవత్సరంగా చేసి ప్రభుత్వంపైన పోరాటం చేద్దాం.ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్‌గా మారి పోరాటం చేయాలి.కాంగ్రెస్ చేస్తున్న అప్పుల తప్పులు,సాగునీటి ప్రాజెక్టులపైన చేస్తున్న దుప్ఫ్రచారంపైన మాట్లాడుదాం.రానున్న సంవత్సర కాలంలో నూతన కమీటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అద్యక్షుని ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది..హైకోర్టు షరతులు -
‘కాంగ్రెస్ వినాశకర పాలన.. ఏడాది మొత్తం దారుణాలే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ(AICC) ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ దారులు, విధ్వంసకారులు, అబద్ధాల పార్టీగా మారిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్(Congress Party) వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సంజయ్ ట్విట్టర్లో..‘ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు. మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. అంతేకాకుండా ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%పెరిగాయి. కిడ్నాప్‌లు, అపహరణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు. కాంగ్రెస్ దోపిడి దారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. AICC is filled with fake news peddlersTelangana women didn’t get even ₹1 from Congress govt. Instead of empowering women, they are crushing them - demolishing homes, targeting vegetable vendors, and forcing pregnant women onto the streets.This isn’t governance - it’s… https://t.co/mfkOGU1rF7— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 8, 2025 -
నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race)లో తన క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇదే సమయంలో తనపై ఏసీబీ పెట్టింది అక్రమ కేసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, హైకోర్టు విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదని అన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నాపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారు. నాపై పెట్టింది అక్రమ కేసు. ఏసీబీ(Telangana ACB)ది తప్పుడు ఎఫ్ఐఆర్. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంత మంది మంత్రులైతే వాళ్లే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. వారే తీర్పులు చెబుతున్నారు. మంత్రులకు అంత ఉలికపాటు ఎందుకు?. క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు. మీలాగా దివాళాకోరు పనిచేసే ఖర్మ నాకు పట్టలేదు. హైకోర్టు(telangana High Court) విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదు. తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్ పారిపోయారు. రేవంత్ ఇంట్రెస్ట్ ఫార్ములా.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఇచ్చిన హామీలపై చిట్టి నాయుడు దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో లాయర్లతో విచారణకు వెళ్లాను. రాజ్యాంగపరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటాను. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్ల కలిసి విచారణకు తప్పకుండా వెళ్తాను. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను. నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరు అవుతాను. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలాగానే కనబడుతుంది. ఇది.. ఆరంభం మాత్రమే. చివరికి న్యాయమే గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘రేవంత్ డైరెక్షన్లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్లో ఈడీ’
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి రేవంత్‌రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్ ప్లాన్ చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు.‘‘బీఆర్ఎస్ ఆందోళనలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్ఎస్ సంబురాలు చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసులు పెట్టీ సంబురాలు చేసుకుంటుంది...కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ నిర్దోషి గా మల్లెపువ్వు లాగా, కడిగిన ముత్యం లాగ బయటకొస్తాడు...ఈ ఫార్ములా కారు రేస్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్లా పడటం ఖాయం. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి లాయర్లను వెంట బెట్టుకొని వెళ్తారు. కేటీఆర్ లాయర్లతో ఏసీబీ విచారణకు వెళ్ళొద్దా?. రాహుల్‌కి ఒక చట్టం.. కేటీఆర్‌కి ఒక చట్టం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే.. రేవంత్ డైరెక్షన్లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్లో ఈడీ పనిచేస్తోంది’’ అంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ -
యూత్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్(Youth Congress leaders) నాయకుల దాడిపై టీపీసీసీ(TPCC) సీరియస్ అయ్యింది. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన ఉండాలి.. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే. కానీ యూత్ కాంగ్రెస్ఇ లా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.యూత్ నేతలను పిలిచి మందలించనున్న మహేష్ కుమార్ గౌడ్.. బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా.. ప్రజాస్వామ్యంలో దాడులు పద్ధతి కాదు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలి’’ అని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.కాగా, ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. యూత్ కాంగ్రెస్ నేతలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.ఇదీ చదవండి: హైకోర్టులో ఎదురుదెబ్బ..కేటీఆర్ రియాక్షన్ ఇదే..! -
Congress Vs BJP: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీసుపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో, మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు కాషాయ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ దాడి దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. తిరగబడి మేము కూడా దాడి చేస్తే ఢిల్లీలో మీ జాతీయ నాయకులు ఎక్కడ దాక్కుంటారు. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలి.కేటీఆర్ తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతారు. చంచల్గూడా వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళితే సానుభూతి రాదు. డబ్బులు ఎక్కువై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం భయంకరమైన అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ లేదు. దానిపై నన్ను ఎవరూ అడగలేదు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దుండగులు దాడి చేయడం దారుణం. దాడుల వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు అధికారులను బలి పశువులను చేస్తున్నారు. నాడు కేటీఆర్ అధికారులను భయపెట్టి పని చేయించుకున్నారు. కేటీఆర్ నిర్దోషి అయితే నిలబడి ఎదుర్కోవాలి. అంతేగానీ కోర్టులకి వెళ్లి తప్పించుకోవడానికి చూడకూడదు.కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది?. ధరణి స్కామ్‌పై ఏం కేసులు పెట్టారు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి చిన్న కేసులు పెడుతున్నారు. పెద్ద కేసుల నుంచి బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
హైకోర్టులో ఎదురుదెబ్బ..స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన తర్వాత కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ విషయమై మంగళవారం(జనవరి 7) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘నా మాటలను నమ్మండి, ఈ ఎదురుదెబ్బ కంటే నా పునరాగమనం బలంగా ఉంటుంది.మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి. సత్యం..కాలంతో పాటు ప్రకాశిస్తుంది.నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనే అచంచలమైన నమ్మకం నాకుంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. ప్రపంచమే దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.Mark my words, Our comeback will be stronger than this setback Your lies won't shatter meYour words won't diminish meYour actions won't obscure my visionThis cacophony won't silence me!Today's obstacles will give way to tomorrow's triumph.Truth will shine brighter with…— KTR (@KTRBRS) January 7, 2025మరోవైపు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని సమాచారం. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఎలాంటి నిర్ణయం వెలువరించే ముందైనా తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు -
కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ కోరింది. నిజానికి కేటీఆర్ ఈడీ ఎదుట మంగళవారం(జనవరి 7)విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు వచ్చేందుకు సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో ఈడీ సమయమిచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఈడీ తాజాగా కేటీఆర్‌కు మళ్లీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.కాగా, గురువారం(జనవరి 9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. అయితే తన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.కేటీఆర్ వేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: సుప్రీంకు ఫార్ములా ఈ కేసు పంచాయితీ -
కాంగ్రెస్ వాళ్లు ఒక్కరూ కూడా బయట తిరగలేరు.. ఖబడ్దార్: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan Reddy) తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.బీజేపీ(Telangana BJP Office) రాష్ట్ర కార్యాలయంపై దాడి నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం.రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీసుపైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదు. ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి.రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కానీ.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు ఢిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ బిదూరీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా?.గతంలోనూ ప్రధానమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా?. ఈ వ్యాఖ్యలకు ఒక్కసారి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా?. అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేం దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు. కానీ ఇది మా సంస్కృతి కాదు. మీ సంస్కృతిని మార్చుకోండి అంటూ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ ఆఫీసు వద్ద ఉదద్రిక్తత.. -
‘ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి’
కొడంగల్(వికారాబాద్ జిల్లా): ప్రధాన మంత్రి అవస్ యోజన కింద ఇల్లు లేని పేదల కోసమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని,. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna). అమృత్ 2 పథకం ద్వారా నిధులు కేటాయింపుపై కొడంగల్ లో మాట్లాడిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.నిరుపేదలు ఇళ్లు లేకుండా ఉండకూడదనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని డీకే అరుణ స్పష్టం చేశారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలానే చేశారని ఆమె మండిపడ్డారు.పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలి..గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అందులో కేవలం కాంగ్రెస్ పార్టీ వారినే పరిమితం చేయొద్దన్నారు. ఈ కమిటీల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎవరైతే నీడలేని పేద ప్రజలు ఉంటారో అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద ప్రజలు ఉండకూడదని, పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు డీకే అరుణ.జనాభా ఆధారంగానే అమృత్ 2 పథకం నిధులుఅమృత్ 2 పథకం(amrut 2 scheme) కింద దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు డీకే అరుణ. ఈ పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ నిధులు వాడుకోవచ్చన్నారు. కొడంగల్ మున్సిపాలిటీకి కూడా రూ. 4.50 కోట్లు మంజూర చేయడం జరిగిందని, మున్సిపాలిటీలో ఉన్న జనాభా ఆధారంగా చేసుకొనే నిధులను విడుదల చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పంచాయతీ, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని, అందులో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్(NREGS) పథకం ద్వారా సీసీ రోడ్డు, రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇవ్వడం జరిగిందన్నారు. -
రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (priyanka gandhi) పై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ (congress party) కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో ఓ బీజేపీ (bjp) కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.దాడులపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ బిదూరి ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎందుకు నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని యూత్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరసన చేసేందుకు వచ్చిన తమపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. కాగా, రమేష్ బిధూరి (Ramesh Bidhuri) ప్రియాంక గాంధీపై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ ఆమె పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆ వివాదం కొనసాగుతుంది. -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
బిల్డప్ బాబు.. తగ్గేదే లే అంటున్న రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారా? జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపే ప్రయత్నం చేస్తున్నారా?. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే ఈ అనుమానాలు రాకపోవు. ‘‘నేను మారా.. మీరూ మారాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు నా వద్ద ఉన్నాయి’’. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించా..నా ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నా..దానిని అందరికి అందచేస్తా..’’, ‘‘హైదరాబాద్‌లో ఉంటున్న నాకు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నాకు అన్నీ తెలుసు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో తప్పులు ఏమీ జరగలేదు..పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే నా దృష్టికి తీసుకు వస్తే సరిదిద్దుకునేందుకు వెనుకాడను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేశా.. మంత్రులు కూడా అలాగే పని చేశారు.. రేషన్ డీలర్లు, అంగన్వాడీల ఎంపిక జోలికి వెళితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయి.. వచ్చే పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి. అవి కీలకం. పదవుల గురించి తొందరపడవద్దు..అన్నీ జరుగుతాయి.." అని రేవంత్ అన్నట్లు వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాక.. ‘‘మొదటి సారి గెలవడం ఓకే .. రెండో సారి గెలవడమే గొప్ప.., సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్ లు వస్తాయి..’’ అని కూడా అన్నారంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం అంతా పరిశీలించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్న స్టైల్లోనే, అందులోను చంద్రబాబు నాయుడు సరళిలోనే రేవంత్(Revanth) వ్యవహార శైలి ఉన్నట్లు కనిపిస్తుంది. 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసేవరకు తన వర్గ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం పనిచేసిన చంద్రబాబు సీఎం అయ్యాక మొత్తం సీన్ మార్చేశారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి మొదట్లో కొన్ని ట్రిక్స్ అమలు చేసినా, వారిపై పట్టు వచ్చాక స్టైల్ మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలకు ఆయన టైమ్ లోనే ప్రాధాన్యత వచ్చింది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని లీకులు ఇప్పించే వారు. అవసరమైతే ఆయనే ఆయా మీడియా సంస్థలలోని కాస్త కీలకమైన జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు. .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు కలిసినా, 'అలా అన్నారు..ఇలా అన్నారు.."అంటూ పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కవరేజీ వచ్చేలా చేసుకునే వారు. కేబినెట్ సమావేశాలలో సైతం అదే ధోరణి. తాను మారానని, మీరూ మారాలని చెబుతుండే వారు. కాకపోతే ఆయన ఏమి మారారో, తాము ఎక్కడ మారాలో అర్థ అయ్యేది కాదు. తాను అవినీతి లేకుండా పనిచేస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కానీ పార్టీలోని ఇతర నేతలకు వాస్తవాలు తెలుసు. అయినా ఎవరికి వారు తమ అవసరాల రీత్యా ఆయన వద్ద మాత్రం తలూపి వచ్చేవారు. అక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అక్రమం చేసినా బయట పడకుండా జరగాలన్నది చంద్రబాబు సిద్దాంతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మంత్రులు కూడా పనిచేయాలని, అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని చెప్పేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తద్వారా తాను ఒక్కడినే కష్టపడుతున్నానన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు. అదే ప్రకారం ప్రచారం చేయించుకునేవారు. విశేషం ఏమిటంటే గత టరమ్ లో మొదటి ర్యాంకు వచ్చిందని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి ఆ తర్వాత టిక్కెట్లు ఇవ్వలేదు. అది వేరే సంగతి. రేవంత్ వ్యాఖ్యలు చదివితే అచ్చం తన గురువు దారిలోనే ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ బలహీనంగా ఉండడం రేవంత్ కు కలిసి వచ్చిన పాయింట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రుల, ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో మినహాయించి మిగిలిన సీఎంలకు అంత స్వేచ్చ ఉండేది కాదు. పైగా వర్గపోరు ఉండేది. వైఎస్ కు కూడా వర్గాల తలనొప్పి ఉన్నా, అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసేవారు. రేవంత్ కూడా ఇప్పటికైతే వర్గపోరు లేకుండా పాలన సాగిస్తున్నారు. కాని అవకాశం వస్తే ఆయనపై అధిష్టానంపై ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్దంగానే ఉంటారు. ఇంతకీ రేవంత్ ఏమి మారారో ఎవరికి తెలియదు. నిజానికి పీసీసీ(PCC) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తీరుకు చాలా తేడా ఉందన్నది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. రుణమాఫీ విషయంలో కొంతవరకు సఫలమైనా, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కొన్ని వాగ్దానాలను నెరవేర్చినప్పటికి ఆరు గ్యారంటీలలో కీలకమైన హామీల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ గురించి ప్రజలు అడిగితే జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో ఆశించిన రీతిలో రియల్ ఎస్టేట్ సాగడం లేదు.హైడ్రా కూల్చివేతలు, మూసి హడావుడి వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా, వాటిపై నిర్దిష్ట కార్యాచరణ అంతంతమాత్రంగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినా, దాని వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో.. తన ప్రభుత్వంలో తప్పులే జరగలేదని, ఏవైనా జరిగితే అవి పొరపాట్లేనని రేవంత్ అంటే పైకి అవునవును అని చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విషయాన్ని మరీ తెగేదాక లాగడం చాలామంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. సినిమా పరిశ్రమను నష్టపరిచేలా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. కాని ఇప్పుడు రేవంత్ వారిపైకి దూకుడుగా వెళ్లారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని అంటున్నారు. భాష విషయంలో కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరులోనే ఉండడం కొంతమందికి రుచించడం లేదు. సాధారణ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవుతోందని, దానిని గుర్తించి సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. చంద్రబాబు మాదిరి 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే నమ్మడం కష్టమే నని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సి.ఎమ్.లు ఉదయం పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి విధానపరమైన నిర్ణయాలు చేసి,ఫైళ్లు ఏమైనా ఉంటే చూసి ఇంటికి వెళ్లిపోయేవారు. అక్కడనుంచి ఏవైనా అత్యవసర పనులకు అటెండ్ అయ్యేవారు.ప్రజలను, పార్టీ వారిని కలిసేవారు. చంద్రబాబు వచ్చాక ఈ ధోరణి మార్చుకున్నారు. పని ఉన్నా, లేకపోయినా ఆఫీస్ లో గడపడం అలవాటు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. తెల్లవారు జామున అధికారులతో భేటీ అవుతుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు తెల్లవారేసరికల్లా ప్రజలను గడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేవారు. కేసీఆర్ ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేవారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. నిజానికి ఏ సీఎం అన్ని గంటలు పనిచేయవలసిన అవసరం ఉండదు. అంత పని కూడా ఉండదు. చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా ఇతర పార్టీల నేతలతో అంతరంగికంగా సంబంధాలు పెట్టుకున్నారన్నది కొందరి భావనగా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. అందువల్లే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటివారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయే, ఐఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని ఒక కాంగ్రెస్ నేత చమత్కరించారు. అంతేకాదు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పాత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని, చంద్రబాబు, రేవంత్ లు రాజకీయంగా సహకరించుకుంటున్నారని ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా రేవంత్ లో నిజంగా ప్రజలకు ,పార్టీకి ఉపయోగపడేలా మార్పు వస్తే మంచిదే. కాని ఆయన కూడా అధికార దర్పంతో ఉంటే అందరికి నష్టం అనే అభిప్రాయం నెలకొంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు వస్తారా?
సాక్షి,ఆదిలాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనకి.. ఏడాది కాంగ్రెస్ పాలనకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు వస్తారా..అంటూ బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమయ్యాం. వచ్చే నాలుగేళ్లలో అకుంఠిత దీక్షతో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం సీట్లు గెలుచుకునేందుకు కృషి చేస్తాం. ఇప్పటి నుంచే ఈ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం ’అని చెప్పారు. ఒక్క కుర్చి.. ముగ్గురు కొట్లాట బీఆర్ఎస్లో ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారని మహేశ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఇటు కేటీఆర్..అటు కవిత ప్రయత్నిస్తుంటే మధ్యలో హరీశ్‌రావు గోవిందా అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వేరే పార్టీ చూసుకోవడం ఖాయమన్నారు. ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని, మొదట పనికిరాని కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖచిత్రం ఉండదన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ కవిత ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారని ఎద్దేవా చేశారు. సంక్రాంతి తర్వాత తీపి కబురు.. సంక్రాంతి తర్వాత పార్టీ నేతలకు తీపి కబురు ఉంటుందని మహేశ్‌కుమార్ అన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ పిటిషన్..రేపే హైకోర్టు తుది తీర్పు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు. ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్ ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్ కోరారు.క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా -
‘ఈనెల 9న న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన’
హైదరాబాద్: దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈనెల 9వ తేదీన న్యూ ఎనర్జీ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఈరోజు(సోమవారం) జెన్ కో ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.‘దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ పాలసీ(New Energy Policy) దోహదం చేస్తుంది. మిగులు విద్యుత్‌తో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. గత పది సంవత్సరాలుగా న్యూ ఎనర్జీ పాలసీని గత సర్కార్ విస్మరించింది. 20 వేల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నాం. ఒడిస్సా నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం,. రామగుండంలో జెన్ కో- సింగరేణి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర జీఎస్డీపీలో ప్రధాన పాత్ర ఎనర్జీదే. దీనిపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్(BRS Party) దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు’ అని తెలిపారు.కేలండర్ ప్రకారమే ఉద్యోగాలురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదని.. తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం బిహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. -
రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం(జనవరి6) తెలంగాణభవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.‘గ్రీన్ కో కంపెనీ దేశంలో 7,8 పార్టీలకు ఎలక్ట్రోలర్ బాండ్లు ఇచ్చింది.కేసు రూ. 55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించింది.ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి ఎక్కడా లాభం జరగలేదు.ఏసీబీ కేసుకు ,గ్రీన్ కో కంపెనీకీ ఏం సంబంధం.రైతు భరోసా ఎగగ్గొట్టిన విషయం డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు.ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడు.గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రో బాండ్లు చట్టం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.ఇందులో దాపరికాలు ఏం లేవు.రేవంత్‌రెడ్డి ఇందులో కనిపెట్టింది ఏం లేదు. కేటీఆర్‌పై కుట్ర కేసులో ప్రభుత్వానికి ప్రతిసారి షాక్ తగులుతోంది.ప్రభుత్వం బొక్క బోర్లా పడుతోంది. కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి,చిల్లర ప్రయత్నం చేసింది ప్రభుత్వం.ప్రభుత్వం వద్దే అన్ని ఫైల్స్ ఉన్నాయి.కేటీఆర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి ఏవో ఫైల్స్ దొరికాయని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని ఏసీబీ ప్రయత్నం చేస్తోంది.చట్టం,రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: ఇది రేవంత్ టీఎం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్ -
అప్పు చేసి రుణమాఫీ చేశాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి,జగిత్యాల జిల్లా: అప్పు చేసి మరీ రెండు లక్షల రుణమాఫీ చేశామని,రైతుభరోసా కూడా రెండు పంటలకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు. సోమవారం(జనవరి 6) జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతు భరోసా రెండు పంటలకు రూ. 12 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12000 ఆర్థిక భరోసా ఇస్తాం. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని మంచి చేస్తే హర్షించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తాం. ఏక మొత్తంగా రుణ మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రైతులకు రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేక చేతులెత్తేసింది. కేసీఆర్ రుణమాఫీ చేయలేక ఎన్నికల ప్రణాళికలో కూడా రుణమాఫీ అంశాన్ని చేర్చలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే చేయలేదంటారు. చేస్తేనేమో విమర్శిస్తారు.పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారా..వద్దనుకుంటున్నారా..?పంజాబ్ లో 33 నెలల్లో 50 వేల ఉద్యోగాలను గొప్పగా చెప్తున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో 12 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: మీరెన్ని కేసులు పెట్టినా భయపడం -
‘మీరెన్ని కేసులు పెట్టినా మేం భయపడం’
సాక్షి,హైదరాబాద్ : ప్రజల పక్షాన గళం విప్పే వారిపై రేవంత్‌రెడ్డి (revanth reddy) ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఆరోపించారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ (brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఉదయం కేటీఆర్ తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ హైడ్రామా నడింది. ఈ తరుణంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వడంపై కవిత స్పందించారు. ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాపై పెట్టిన కేసులకు మేం భయపడం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఆమొత్తాన్ని రూ.12,000 రూపాయలకు తగ్గించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా చెల్లించాలనే మా డిమాండ్’ అని కవిత అన్నారు. BRS MLC K Kavitha says "The Revanth Reddy Govt is filing illegal cases against those who raise their voices on behalf of the people. The government is acting vengefully against our party’s Working President KTR with false cases. We are not afraid of cases filed against us. Our… https://t.co/QPEa6zAEhC pic.twitter.com/bQTbdODpVF— ANI (@ANI) January 6, 2025 -
నా ఇంటిపై ఏసీబీ దాడులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని, తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన.సోమవారం ఉదయం తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులను నిలదీశారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే.. అందుకే లాయర్‌తో వచ్చా. నాతో పాటు లాయర్ వస్తే వాళ్లకేంటి(పోలీసులకు) ఇబ్బంది ఏంటి. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో జరిగిందే నా విషయంలో జరగబోతోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదు.. నిజాయితీగా ఉన్నా. అందుకే చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా.రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఎందుకీ డ్రామాలు(కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది). అయినా నేను కేసులకు భయపడను. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతాం’’ అని కేటీఆర్ అన్నారు. -
‘రాజమౌళి కంటే అద్భుతంగా కథలు’.. కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్మెంట్ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇందులో తప్పేంటి?: కేటీఆర్అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన. నోటీసుల్లో.. కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.బీఆర్ఎస్ నేతల సంఘీభావంఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.