breaking news
-
మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకు క్యూ..!
హైదరాబాద్: ఉగాది లోపు అంటే మరో రెండు రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు క్యూకడుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు తమకు మంత్రి పదవి కావాలంటే తమకు కావాలంటూ ఢిల్లీ విమానం ఎక్కేవందుకు సన్నద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఢిల్లీలో ఉండగా, ఈరోజు(గురువారం) సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు పలువురు ఎస్టీ, ఎస్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.తమ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విన్నవించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది.తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి రెండు రోజుల క్రితం హైకమాండ్ కసరత్తు చేసింది. డీనిలో భాగంగా పలువురు రాష్ట్ర ముఖ్యనేతలకు ఢిల్లీ పిలిచి క్యాబినెట్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించింది హైకమాండ్. అయితే క్యాబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి.. ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశం ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమ వంతు ప్రయత్నంలో భాగంగా పలువురు నేతలు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. -
400 ఎకరాల భూమి వేలం.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ భూముల అమ్మకం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ప్రస్తావించారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో..‘ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అని గతంలో మీరు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను.నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ల అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీశాఖ పరిధిలోకి రానప్పటికీ చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో కూడిన ఈ భూమి నగరానికి ఊపిరులూదే ఒక ఆక్సిజన్ వనరుగా ఉంది. అలాంటి ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే, భూమిలో నీటివనరులు తగ్గిపోయి, ఆయా జీవజాతులకు నష్టం జరిగి, పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉంది. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిది.ముఖ్యంగా ఈ భూమి పరిధిలో ఉన్న భారతీయ నక్షత్ర తాబేళ్ళకు, వాటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్ IV కింద భారతీయ నక్షత్ర తాబేళ్ళు సంరక్షించవలసిన జీవజాతుల కిందకు వస్తాయి. ఈ చట్టం కింద ఆయా జీవజాతుల సంరక్షణతోపాటు, వాటి ఆవాసాలను కూడా సంరక్షించాలి. ఈ నక్షత్ర తాబేళ్ళు 2016 నుంచి IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) లో దుర్బలమైన జాబితాలో చేర్చబడి ఉన్నాయి. అంటే, ఇది అంతరించిపోతున్న వాటి జీవజాతిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ నక్షత్ర తాబేళ్ళు 2019 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో అంతరించిపోతున్న వృక్ష, జంతుజాలం (CITES - కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా & ఫానా) కన్వెన్షన్ యొక్క అపెండిక్స్-I లో కూడా చేర్చబడి ఉన్నాయి.అంటే ఆయా జీవజాతులకు అంతర్జాతీయ వాణిజ్యం నుంచి అత్యున్నత స్థాయిలో రక్షణ కూడా కల్పించబడి ఉంది. కాబట్టి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.నగరంలో ఒకప్పుడు అడవులను, కొండలను తలపించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కారణంగా ఒక కాంక్రీట్ అడవిలాగా మారిపోయి సహజసిద్ధమైన వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కడా ఒక చెట్టును, పుట్టను, కొండను వదలకుండా మొత్తం కాంక్రీట్ నిర్మాణాలతో నింపేశారు. ఇవి చాలవన్నట్లు ఆర్థిక వనరుల పేరిట ఇప్పుడు పర్యావరణ వైవిధ్యంలో భాగమైన భూములను కూడా కాంక్రీట్ అడవులుగా మార్చడం స్థానికంగా నివసిస్తున్న ప్రజలు, ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఇలా ఎవరికీ కూడా ఆమోదయోగ్యం కాదు.ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోంది, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయి. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నవి. భవిష్యత్తు తరాల కోసం కొంతైనా ఈ స్థలాలను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున, ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజులు సభ జరిగింది.97 గంటల 32 నిమిషాలు సాగింది.శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారుశాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీవాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయలేదు.ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్‌కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారుగత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.ఏలేటి మహేశ్వర్‌రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీతెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిమా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను వేశారునేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.16 రోజులు నిద్రపోకుండా చేశారునా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.జైలు నుంచి ఫంక్షన్ హాల్‌కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.కక్ష్య సాదింపు ఎవరు చేశారు.నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదుచంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదులైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారుకరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారువాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడుచర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారురాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదాఅయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదునిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారుకానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాసొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాఎవరివి కక్ష సాధింపు చర్యలోతెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ కామెంట్స్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్‌పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్‌కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్‌తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్..ఈ సెషన్లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్‌తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి -
అందరి నోట.. రాజగోపాల్‌రెడ్డి మాట!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న వార్త మంగళవారం అందరి నోటా వినిపించింది. శాసనసభ హాలు, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. -
‘కమీషన్ల’పై దద్దరిల్లిన సభ!
30% కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమీషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయి- కేటీఆర్కేటీఆర్ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేదంటే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.-భట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె.తారకరామారావు పేర్కొనడం, ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు అడ్డుపడుతుండటంతో.. బడ్జెట్ పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుపడటంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘‘మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు. సంయమనం ఉండాలి. మేం కూడా రెచ్చగొట్టగలం. 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20శాతం కమీషన్ అంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్‌ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేకుంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి’’అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం పాపం వల్లే రూ.లక్ష కోట్ల పనులు చేసిన వారు బిల్లులు రాక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ.. కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బాధ్యతతో రాజకీయాల్లో వచ్చాం. అడ్డగోలుగా మీలా రాష్ట్రం మీద పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. నాలాగా అణగారిన వర్గాలు, బాధితులు, పీడితులు, పేద కుటుంబాల కోసం ఏదో చేయాలని ఉన్నతమైన ఆశయంతో వచ్చిన వాళ్లం. మీలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పాడు చేసిపోయేందుకు రాలేదు. మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదీ పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా?’’అని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ‘30శాతం కమీషన్..’అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో.. కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్‌పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని చెప్పారు. బట్టలు విప్పి కొడతామంటూ సభలో సీఎం రేవంత్ అన్నప్పుడు లేని అభ్యంతరం తమ మాటలకు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు. భట్టి దళితుడనే ఆరోపణలు: పొన్నం దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత పదవి దక్కవద్దనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. -
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అసెంబ్లీలో మరోసారి రచ్చ రచ్చ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్, ఎంఐఎం నిరసనకు దిగాయి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదని ఆందోళన చేపట్టాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై నిరసన చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరసనను విరమించుకోవాలి సభకు సహకరించాలి. అసెంబ్లీ నిబంధనలను ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు తెలుసుకోవాలని శ్రీధర్‌బాబు అన్నారు.మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో కేసు నడుస్తుండగా సీఎం రేవంత్ సభలో మాట్లాడారని.. అది రూల్స్‌కు వ్యతిరేకమన్నారు. కోర్టులో కేసు నడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తీర్పు ఇచ్చారు. తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందా? రేవంత్ ఇస్తారా?. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి ప్రివిలేజ్ కిందికి వస్తది. సీఎం వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేశాం. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. మాకు అవకాశం ఇవ్వనందున సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సూచనల కోసం మైక్ ఇవ్వాలని సీఎం సూక్తులు చెప్పారు. సూచనలు చెప్తాం.. అంటే మైక్ ఇవ్వడం లేదు. బెట్టింగ్ యాప్‌ను గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ పదిహేను నెలల్లో బ్యాటింగ్ యాప్స్‌ను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 50 శాతం సీసీటీవీలు పనిచేయడం లేదు. పోలీస్ వాహనాలకు డీజీల్ కోసం ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం.. భట్టి ఆవేదన
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ‘కమీషన్’ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేపాయి. కేటీఆర్(KTR) వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు కేటీఆర్ వ్యాఖ్యలను ప్యానెల్ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించడంతో నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసి అసెంబ్లీ బయట నిరసనలు కొనసాగించింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మంత్రులకు సంయమనం ఉండాలి. ప్రభుత్వ హామీలు అమలు చేయకుంటే అడుగుతాం. 30 శాతం కమిషన్ అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు’’ అని అనడంతో సభలో అలజడి రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. ‘‘కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి. సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి. కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మాట్లాడితే డెమోక్రసీ అంటున్నాడు. కానీ, ఇలా మాట్లాడతాడని ఊహించలేదు. .. సభలో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీలాగా బరితెగించి రాజకీయాలు చేయడం లేదు. కాంట్రాక్టు బిల్లులు ఇవ్వకుండా పోయింది ఎవరు? ఇప్పుడొచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారా? చర్చ వాస్తవంగా జరగాలే తప్ప పక్కదారి పట్టించేలా ఉండకూడదు’’ అని అన్నారు. ఈ క్రమంలో.. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని ప్యానెల్ స్పీకర్‌ను కోరారు. అయితే.. భట్టి(Bhatti) వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కేటీఆర్‌ను తాను విమర్శించలేదన్న భట్టి.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నానని, అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదని భట్టి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల ోటాపోటీ నినాదాలు కొనసాగాయి. భట్టి వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఎంట్రీ 4 మెట్ల మీద కూర్చుని ‘‘వద్దు రా నాయనా ఈ 30 శాతం కమిషన్ ప్రభుత్వం’’ అంటూ బయట నినాదాలు చేశారు. ఈ క్రమంలో మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ వ్యాఖ్యల తొలగింపు‘‘కేటీఆర్ వ్యాఖ్యలతోనే ఈ గొడవ మొదలు అయింది. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కేటీఆర్ అన్‌పార్లమెంటరీ పదాన్ని వాడారు. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తాం. సీనియర్ సభ్యులుగా ఉండి ఇలాంటి నిరసనలు చేయడం కరెక్ట్ కాదు’’ అని ప్యానెల్ స్పీకర్ అన్నారు. -
భూ భారతి, ధరణిపై అసెంబ్లీలో మాటల యుద్దం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ధరణి, భూ భారతి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి.ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ధరణి, భూ భారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాశారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. దున్నేవాడితే భూమి కదా సాయుధ పోరాట నినాదం. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణిని వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చాం. జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు. ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.భూ భారతి కాదు.. భూ హారతి: పల్లా రాజేశ్వర్ రెడ్డిభూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదు భూ హారతి. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలి.భవిష్యత్‌లో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం: పొంగులేటిపల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ఓడించారు. ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు. 2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం. -
సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్..
Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎంట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్ మార్షల్ సూచనలుమార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్‌గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్ఎస్, కేటీఆర్బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్‌పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్‌లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్‌ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ -
కేటీఆర్‌పై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఫిర్యాదుతో నకిరేకల్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings - Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups...While 15 people have been involved,only 6 have been… pic.twitter.com/XHBScJBrY7— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025 -
నాణ్యమైన విద్య, వైద్యం మా ప్రభుత్వ విధానం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్‌శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించడంతో బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు. కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు. -
కేటీఆర్.. మీరు సీఎం అవుతారు
సాక్షి, హైదరాబాద్: ‘కేటీఆర్.. మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో మరోసారి మేము అధికారంలోకి వస్తాం. అప్పటివరకు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు గతంలో రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు. మాకు కూడా ప్రజలు రెండు పర్యాయాలు అధికారం ఇస్తారు’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీఆర్ఎస్ పాత్ర ఉందని.. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ మరింత పెద్ద పాత్ర పోషించారని చెప్పారు. అందుకే తమకు కూడా ప్రజలు రెండు పర్యాయాలు అధికారం ఇస్తారని పే ర్కొన్నారు. శాసనసభలో మంగళవారం రహదారులు, భవ నాల శాఖ పద్దుపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. మీరు వదిలేస్తే.. మేం సరిదిద్దుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన పనులను తాము ఇప్పుడు చక్కబెడుతున్నామని వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘మీరు కొన్ని మంచి పనులు చేశారు. కొన్ని తప్పులు చేశారు. కొన్ని ప్రారంభించి వదిలేశారు. అవన్నీ మేము సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం. జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం. అల్వాల్‌లో కూడా డిఫెన్స్ నుంచి భూమి తీసుకుని అక్కడ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఎల్బీ నగర్లో నిర్మించే టిమ్స్‌ను 24 అంతస్తుల నుంచి 14 అంతస్తులకు కుదించి వేగంగా పనులు కొనసాగుతున్నాయి. మీరు సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు. అంచనా కంటే రూ.500 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. ఇప్పుడు వేలకోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది’అని తెలిపారు. మీరు ఫామ్‌హౌస్‌కు.. మేము ఢిల్లీకి ‘మీ అధిష్ఠానం ఫామ్‌హౌస్‌లో ఉంటే.. మా పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో ఉంది. అందుకే మేము ఢిల్లీకి వెళ్తున్నాం. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మీరు విమర్శించడం మంచిది కాదు’అని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. కాగా, పనులు చేసిన తరువాత బిల్లులు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్–తాండూరు–జహీరాబాద్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు.సంగెం బ్రిడ్జిని మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ రామచంద్రునాయక్ కూడా మాట్లాడారు. మన్నెగూడ– అప్పా జంక్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన నాలుగు రోడ్లకు కూడా తుదిరూపు ఇవ్వాలని కోరారు. -
కేబినెట్ విస్తరణ.. మూడున ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు అదేరోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి.. ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు.. ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అనే అంశాలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగించారు. ఇంకా సమాచారం లేదన్న ఆ ముగ్గురూ.. మంగళవారం శాసనసభ లాబీల్లో మంత్రివర్గ విస్తరణే ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎమ్మెల్యేలతో హడావుడిగా కనిపించింది. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు భట్టి చాంబర్‌కు వచ్చి చర్చలు జరిపారు. అసలు ఢిల్లీలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సమావేశాల విధులకు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు కూడా ఆ ముగ్గురిని కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆ ముగ్గురూ.. మరోవైపు ఇంకా సమాచారమేమీ లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో సాయంత్రం వరకు సీఎం కసరత్తు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బయలుదేరేంతవరకు ఢిల్లీలో ఒంటరిగానే గడిపారు. ఎలాంటి అపాయింట్మెంట్లు, పార్టీ పెద్దలతో ములాఖత్‌లకు వెళ్లని రేవంత్ మంత్రివర్గ కూర్పుపై ఏకాంతంగా కసరత్తు చేశారనే చర్చ జరుగుతోంది. కొత్తగా కేబినెట్లోకి తీసుకునే మంత్రులకు శాఖలు, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దిశలో ఆయన కసరత్తు చేశారని, ఈ మేరకు అధిష్టానానికి సమాచారమిచ్చారని తెలుస్తోంది. ఈ కసరత్తు నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండిపోయారని చెబుతున్నారు. ఇద్దరు కీలక మంత్రుల శాఖల్లో మార్పులు! కేబినెట్లోకి కొత్తగా నలుగురు లేదా ఐదుగురిని తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించేందుకు కారణాలున్నాయని కొందరు చెబుతుండగా, అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదని, ప్రస్తుతమున్న మంత్రులంతా కొనసాగుతారని, కొత్తగా కొందరు మంత్రులవుతారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. శాఖల మార్పుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులుంటాయని, ఓ మహిళా మంత్రికి అదనపు బాధ్యతలిస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే ఎన్.బాలూనాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, కొత్తగా కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి పేరు కూడా చర్చలోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్‌గా ఈమెను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చీఫ్ విప్ పదవిలో ఎవరిని నియమిస్తారు?, విప్లలో ఎవరికైనా మంత్రిగా అవకాశమిస్తే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైనా రకరకాల చర్చలు జరుగుతుండడం గమనార్హం. -
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆ నలుగురికే ఛాన్స్!
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు, ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించనుంది. ఇద్దరు రెడ్లు, ఒక బీసీ,ఒక ఎస్సీ సామాజిక వర్గం నేతకు అవకాశం కల్పించనుండగా.. చీప్ విప్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టేయోచనలో అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ప్రస్తుతం మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. అయితే, అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపితే వారికే మంత్రి పదవి ఖాయం. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. ఆ వివరాల ఆధారంగా మంత్రి పదవులు కేటాయింపు ఉంటుంది. -
‘దేవుళ్లని మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క’
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క. రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
‘నేను పేర్లు చెప్పలేను...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ వేదికగా మన ఊరు మన బడి అంశానికి సంబంధించి మాట్లాడారు. ‘ మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగింది. మన ఊరు మన బడి లో ఏమి పని జరగలేదు...జరిగిన దానికి నిదులు విడుదల కాలేదు. మన ఊరు మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. రూ. 14, రూ. 18, రూ. 20వేల ఒక్కో బెంచ్ కొన్నారు. రూ. 5వేలకు ఒక బెంచ్ వస్తది...20వేల పెట్టీ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. పెద్ద స్కాం చేశారు. దానికి సంబంధించి ఒకరు అప్పుడు BRS తో ఉన్నారు...ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు’ అని అక్బరుద్దీన్ విమర్శించారు. -
ప్రశాంత్‌రెడ్డి Vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో RRRపై రచ్చ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ట్రీపుల్ఆర్పై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారమంటూ ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ కోసం కష్టపడింది బీఆర్ఎస్సే. 15 నెల్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. 2017లో అనుమతి వస్తే అప్పుడే ఆగిపోయిందని ప్రచారమా? అంటూ ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడుతూ.. ట్రిపుల్ ఆర్‌పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. ‘‘మేం ఓఆర్ఆర్ కడితే మీరు అమ్ముకున్నారు. ఎన్నికల ముందు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి తెచ్చారు. 2014 నుంచి మీరు వేసిన రోడ్లకు డబ్బుకు మేం కడుతున్నామని కోమటిరెడ్డి అన్నారు.మన ఊరు-మన బడి పథకంలో భారీ స్కాం: అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందన్నారు. ‘మన ఊరు మన బడిలో ఏ పని జరగలేదు. జరిగిన దానికి నిధులు విడుదల కాలేదు. మన ఊరు-మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. 14, 18, 20 వేల ఒక్కో బెంచ్ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. ఐదు వేలకు ఒక బెంచ్ వస్తది. 20 వేల పెట్టీ కొన్నారు. పెద్ద స్కాం చేశారు...అప్పుడు బీఆర్ఎస్తో ఉన్నారు.. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు.’’ అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. -
నాకైతే ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదు: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఓ కొలిక్కి వస్తున్న వేళ.. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. గతంలో భువనగిరి ఎంపీ పదవిని సమర్దవంతంగా నిర్వహించా. నాకు హోంమంత్రి అంటే ఇష్టం. అయినా ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా. ప్రజల పక్షాన నిలబడతా. ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ పై చర్చ జరిగినట్లు ఉంది. నాకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి అయితే ఫోన్ రాలేదు’’ అని అన్నారాయన. నమస్తే మంత్రి వివేక్.. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య సరదా సంభాషణ జరిగింది. వివేక్ వెంకటస్వామి ఎదురుపడడంతో.. నమస్తే మంత్రి అని పలకరించారు మల్లారెడ్డి. దీనికి థాంక్స్ మల్లన్న అంటూ మురిసిపోయారాయన. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తుందని మల్లారెడ్డి అనగా.. బీఆర్ఎస్ హయంలో నీ హవా నడిచిందంటూ వివేక్ కౌంటర్ ఛలోక్తి విసిరారు. -
గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్‌ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్‌ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్‌గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్‌తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్‌లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అసెంబ్లీకి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా తనపై విధించిన సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక బులెటిన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం స్పీకర్ చాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను జగదీశ్‌రెడ్డి కలిశారు. తనను అన్యాయంగా, ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని, ఇప్పటికైనా తన సస్పెన్షన్‌పై బులెటిన్ విడుదల చేయడంతోపాటు అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టాలని స్పీకర్‌కు అందజేసిన లేఖలో జగదీశ్‌రెడ్డి కోరారు.కాగా అసెంబ్లీ లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష చాంబర్‌కు వచ్చిన జగదీశ్‌రెడ్డిని సభ ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కరుణాకర్ కోరారు. తనను సస్పెన్షన్ చేసినట్టు బులెటిన్ చూపిస్తే బయటకు వెళతానని జగదీశ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను అసెంబ్లీకి రావడంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. సాయంత్రం మూడు గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలోనే జగదీశ్‌రెడ్డి గడిపారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోంది: రాజ్యాంగ విలువ లు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని జగదీశ్‌రెడ్డి అ న్నారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను అసెంబ్లీ సమావేశాల నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణాలు, ఆ ధారాలు చూపడం లేదు. మందబలంతో సభ నడుపుతామంటే కుదరదు.కోర్టు కు వెళతాననే భయంతోనే నా సస్పెన్షన్‌కు సంబంధించిన బులెటిన్ విడుదల చేయడం లేదు. సభ్యులు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఏకంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మంత్రులు గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు. జాన్పాడ్లో జరిగిన దావత్‌కు కూడా మాజీమంత్రి జానారెడ్డి హెలికాప్టర్లో వచ్చారు’అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం..అయోమయం: బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని..అసలు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికే స్పష్టత లేక అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. అసలు రాష్ట్రం మొత్తం అప్పులెన్ని.. వాటిపై చెల్లిస్తున్న వడ్డీ ఎంత.. కొత్తగా తెస్తున్న అప్పు ఎంత ? లాంటి వివరాలేవీ తెలపటం లేదని విమర్శించారు. -
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి ఒకటి, రెండురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్చంద్రశేఖర్ను నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. త్వరలోనే కేంద్రమంత్రి శోభకరాంద్లజే తెలంగాణకు వచ్చి అభిప్రాయసేకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇది ముగిశాక ఒకనేత పేరుతో నామినేషన్ పత్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. మరుసటి రోజు అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చునని అంటున్నారు.అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత–కొత్త నేతల మధ్య ‘జాతివైరం’స్థాయిలో ఇప్పటికీ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలున్న పాత నాయకులకే ఈ పదవి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. పార్టీలో చేరాక, ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా మరో పదవికో ఎన్నికయ్యాక పాత–కొత్త అంటూ ఉండదని కొందరు (గత మూడు, నాలుగేళ్లలో చేరి ఆయా పదవులు పొందినవారు) వాదిస్తున్నారు. పార్టీలో కొత్తరక్తం నింపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని ఈ వర్గం సూచిస్తోంది.అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు, సీనియర్ నేతలు, పాత–కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ⇒ ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కొచ్చుననే ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరి్వంద్, బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి తదితరులు పోటీపడుతున్నారు. ⇒ ఇక ఓసీ నాయకుల విషయానికొస్తే ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, ఇంకా పి.మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ⇒ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న వారిలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అనూహ్యంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంజయ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం మొగ్గుచూపొచ్చుననేది ఈ ప్రచార సారాంశం. అయితే అధ్యక్ష పదవి కోసం తాను పోటీలో లేనంటూ తాజాగా సంజయ్ వివరణ ఇచ్చారు. అయినా, పార్టీని ముందుండి నడిపించేందుకు ఆయన్నే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. బీసీ నేతకు ఇస్తే ఈటల రాజేందర్‌కు దక్కొచ్చునని గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పీఎం మోదీ, సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డా వంటివారు ఈటలకే ఓటేస్తారనే ప్రచారం జరిగింది.నేనంటే నేను అని ప్రచారంగతంలో ఎన్నడూలేని విధంగా తనకే అధ్యక్ష పదవి వస్తుందంటూ కొందరు ముఖ్యనేతలు సైతం ప్రచారం చేసుకోవడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అధ్యక్షుడిని అవుతున్నానంటూ వారు మీడియాకు, అనుచరులకు లీక్‌లు ఇచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. పార్టీనాయకుల్లో ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రపార్టీలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే జాతీయ నాయకత్వం కూడా డైలమాలో పడిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం’
బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటాడంటూ విమర్శించారు కవిత. ఈరోజు(సోమవారం) కామారెడ్డి జిల్లా పర్యటలో భాగంగా బాన్సువాడలో ఆమె మాట్లాడారు. ‘బాన్సువాడ బీఆర్ఎస్ గడ్డ. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం ఉంటుంది. నేను, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి లాంటి వారం బాన్సువాడకు అండగా ఉంటాం. సీఎం రేవంత్ ది ఎప్పుడూ ఫ్లైట్ మోడే. అందుకే 15 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ చెప్పినట్లు వింటారు. 15 నెలలుగా జనాలు అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడతారు. క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు పండుగ బహుమతులు ఎత్తేశారు’ అంటూ విమర్శించారు.వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్ఎస్ వ్యతిరేకం‘తులం బంగారం అన్నారు.. అదీ లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. వీటిన్నంటిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.. రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. మీ పక్షాన నిలబడుతుంది.. మేము ఎప్పటికీ మీ వెంటనే ఉంటాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా., ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలే. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఆయన ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు.జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారు. అక్కడ హిందూ ముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదు. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్ చేసింది.. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు కవిత. -
TG: కాంగ్రెస్ ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు.. ఎందుకంటే..?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు(సోమవారం) మధ్యాహ్న సమయంలో సీఎం రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు.. తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్, పలువురు మంత్రులను ఢిల్లీకి బయల్దేరి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో వీరు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో సీఎం రేవంత్ విదేశీ పర్యటనఏప్రిల్ లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అయితే ఈ లోపే డీ లిమిటేషన్ పై హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు రేవంత్.