పద్మశాలీ యువక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన..
సాక్షి, ముంబై : పద్మశాలీ యువక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 150 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నాయిగాం పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగువారితోపాటు మరాఠీయులు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.జి.కానాజి, గౌరవ అతిథిగా డాక్టర్ దంతాల పురుషోత్తం హాజరయ్యారు. ఈ శిబిరానికి హాజరైన వారికి మోకాళ్ల నొప్పుల నివారణ కు వైద్యులు ఈ సందర్భంగా తగు సూచనలు, సలహాలిచ్చారు. పద్మశాలీ యువక సంఘం చైర్మన్ గాడిపెల్లి గణేష్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంఘ ధర్మకర్తలు ముశం నారాయణ, బుదారపు రాజారాం, బోగా కళావతి, అధ్యక్షుడు కోడిచంద్రమౌళి, ఉపాధ్యక్షులు పొన్న శ్రీనివాస్‌లు, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, కోశాధికారి జిల్లా పురుషోత్తం, కార్యదర్శులు, వైద్య సమితి ఉపాధ్యక్షుడు చిలివేరి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.