రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు | vemulawada rajarajeswara temple hundis filled with rs 500, 1000 notes | Sakshi
Sakshi News home page

రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు

Nov 15 2016 1:06 PM | Updated on Sep 4 2017 8:10 PM

రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు

రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు

కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్‌ పెరిగింది.

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్‌ పెరిగింది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు లక్షల్లో పాత నోట్లను వేశారు. ఓ వ్యక్తి రూ.500, రూ. వెయ్యి నోట్లతో రూ.4.50 లక్షలు, మరో అజ్ఞాత వ్యక్తి పాత రూ.వెయ్యి నోట్లతో లక్ష రూపాయలను హుండీలో వేయడం సంచలనం కలిగించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement