చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత | tension in chandragiri railway station | Sakshi
Sakshi News home page

చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత

Jan 30 2017 11:40 AM | Updated on Sep 5 2017 2:29 AM

చిత్తూరు జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాట్పాడి-గూడూరు ప్యాసింజర్‌ రైలును 3 గంటల పాటు చంద్రగిరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేయడంతో.. అసహనానికి గురైన ప్రయాణికులు గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. 9 గంటలకు వెళ్లాల్సిన కాట్పాడి-గూడూరు ప్యాసింజర్‌కు సిగ్నల్‌ ఇవ్వకుండా చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు.
 
అసహనానికి గురైన ప్రయణికులు రైల్లో నుంచి కిందకు దిగి ఆందోళన చేశారు. అదే సమయంలో వచ్చిన గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. ఆ రైలు అడ్డుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement