
నటుడు సాయిప్రశాంత్ మృతిపై దర్యాప్తు
నటుడు సాయిప్రశాంత్ మరణం ఇటు బుల్లితెర, అటు వెండితెర వర్గాల్లో పెద్ద కలకలాన్నే రేకెత్తించింది. అయి తే సాయిప్రశాంత్‌ది ఆత్మహత్యేనా
తమిళసినిమా: నటుడు సాయిప్రశాంత్ మరణం ఇటు బుల్లితెర, అటు వెండితెర వర్గాల్లో పెద్ద కలకలాన్నే రేకెత్తించింది. అయి తే సాయిప్రశాంత్‌ది ఆత్మహత్యేనా అన్న సందేహాలు పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. సాయిప్రశాంత్ ముక్కు నుంచి రక్తం కారడం, అతని మృతదేహం పక్కన ఒక సూసైడ్ నోటు ఉండడం, అందులో తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సాయిప్రశాంత్ రాసినట్లు ఉండడం వంటి విషయాలపై మదురవాయిల్ పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
సాయిప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడే ముందు కోవైలో ఉన్న తన తల్లికి ఫోన్ చేసి మానసిక వేదనకు గురవుతున్నందున చనిపోతున్నాననీ చెప్పినట్లు తెలిసింది. ఆ తరువాత అదే కోవైలో తన తల్లి ఇంటిలో ఉన్న భార్య సుజితకు ఫోన్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని సమాచారం. సాయిప్రశాంత్ మరణించే ముందు ఇంకా ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడాడు తదితర వివరాలను పోలీసులు కూపీ లాగుతున్నారు.
సాయిప్రశాంత్ కు అతని భార్య సుజితకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో సుజిత అ తన్ని వదిలి తల్లి ఇంటికి వెళ్లిపోయిందన్న విషయంపైనా, సాయిప్రశాంత్ చావుకు ఆర్థికపరమైన సమస్యలేమైనా ఉన్నాయా?లాంటి అంశాలపైనా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలు సాయిప్రశాంత్‌ది ఆత్మహత్యేనా అన్న విషయం పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తరువాతే తెలుస్తుందనీ పోలీసులు పేర్కొన్నారు. ఏదేమైనా చిత్ర పరిశ్రమలో తారల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోవడం ఆవేదనకు గురి చేసే అంశం.