1న సమైక్య సింహగర్జన | Simhagarjana on september 1st | Sakshi
Sakshi News home page

1న సమైక్య సింహగర్జన

Aug 29 2013 4:35 AM | Updated on Sep 27 2018 5:56 PM

చెన్నైలోని వళ్లువర్‌కోట్టం జంక్షన్ వేదికగా సెప్టెంబర్ 1న సమైక్య సింహగర్జన నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ తమిళనాడు కన్వీనర్ తంగుటూరి రామకృష్ణ తెలిపారు.

చెన్నైలోని వళ్లువర్‌కోట్టం జంక్షన్ వేదికగా సెప్టెంబర్ 1న సమైక్య సింహగర్జన నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ తమిళనాడు కన్వీనర్ తంగుటూరి రామకృష్ణ తెలిపారు. రాజధాని హైదరాబాద్ అందరిదిరా అంటూ రాష్ట్రంలోని తెలుగువారందరూ, ప్రవాసాంధ్రులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
 కొరుక్కుపేట, న్యూస్‌లైన్: చెన్నై మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాము లు స్మారక మందిరంలో తంగుటూరి రామకృష్ణ బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వార్థ రాజకీయ నాయకుల దుష్ట ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ను తిరోగమ నం పాలు చేసి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ప్రకటన చేయ డం బాధాకరమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సెప్టెం బర్ 1న సమైక్య సింహగర్జన నిర్వహించనున్నట్లు వెల్లడిం చారు. ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరవుతారన్నారు. 
 
 ఎన్నో లక్షలమంది తెలుగువారు కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ అందరిదన్నారు. విభజించాల్సి వస్తే ప్రతి ఒక్కరికీ సమన్యాయం చేయాలని, దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కో కన్వీనర్లు పొన్నూరు రంగనాయకులు, ఎం.వి.నారాయణగుప్తా మాట్లాడారు. సమైక్యాం ధ్రకు మద్దతుగా ఉద్యమం తీసుకు రానున్నామన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి మద్దతు కోరుతామన్నారు. పది సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ విభజనకు సోనియా, మన్మోహన్ సింగ్ ఇలా చేయడం సరికాదన్నారు. అనంతరం సమైక్య సింహగర్జనకు సంబంధించి బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ తమిళనాడు కోశాధికారులు పుట్టా జయరాం, జి.శివప్రసాద్, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement