సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం నవరాత్రి శోభను సంతరించుకోనుంది. ఈ నెల 5 నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు నగరవ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
5 నుంచి నవరాత్రి ఉత్సవాలు
Oct 1 2013 2:23 AM | Updated on Sep 29 2018 5:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం నవరాత్రి శోభను సంతరించుకోనుంది. ఈ నెల 5 నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు నగరవ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సంకటహరణ గణపతి ఆలయంలో ఈ నెల 5నుంచి 14వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు సంకటహరణ గణపతి ఆయల ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్ తెలిపారు. తొమ్మిది రోజులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలతోపాటు ప్రతిరోజు ఉదయం అభిషేకాలు ఉంటాయన్నారు.
పతిరోజూ భక్తులతో శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 6న విలక్కు(దీప)పూజ నిర్వహించనున్నట్టు చెప్పారు. దీనిలో వసుంధర ఎన్‌క్లేవ్, నోయిడా, ఇంద్రపురం, గాజీపుర్, వైశాలీతోపాటు ఇతర ప్రాంతాల నుంచి రెండు వందల మంది మహిళలు పాల్గొననున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా బొమ్మల కొలువు ఉంటుందన్నారు.
ఆలయ ప్రాంగణంలో వందకుపైగా దేవతామూర్తుల బొమ్మలతో ఈ కొలువు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 13న సరస్వతి పూజ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయల పూజా కమిటీ ఆధ్వర్యంలో చేయనున్నారు. విక్కుల పూజ, సరస్వతి పూజలో పాల్గొనాలనుకునేవారు 8826655855, 9811161370 నంబర్లపై సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement