రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించే బాహుబలి తమ నేత జానారెడ్డి కావొచ్చు.. మరెవరైనా కావొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
బాహుబలి ఆయనే కావొచ్చు: కోమటిరెడ్డి
Mar 18 2017 3:18 PM | Updated on Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించే బాహుబలి తమ నేత జానారెడ్డి కావొచ్చు.. మరెవరైనా కావొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు బాహుబలి మానియా పట్టిందని జానారెడ్డి కూడా బాహుబలి గురించి మాట్లాడి ఉంటారని అన్నారు. ఆ బాహుబలి జానారెడ్డే కావొచ్చు, మరెవరైనా కావొచ్చునని చెప్పారు.
నల్లగొండ జిల్లాకు సాగునీరు ఏప్రిల్ 15 వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం డెడ్ స్టోరేజీకి వెళ్లినా సరే మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు ఇవ్వాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినట్లు చెప్పారు.
Advertisement
Advertisement