యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ను తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు.
మోత్కూరు మార్కెట్‌కు వచ్చిన కోదండరాం
Apr 28 2017 1:09 PM | Updated on Jul 29 2019 2:51 PM
మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ను తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతో సమావేశమై లభిస్తున్న గిట్టుబాటు ధరల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతు జేఏసీ కో కన్వీనర్ కోదండరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Advertisement
Advertisement