‘ప్రేమ’ కానుక | Happy Valentine's Day | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’ కానుక

Feb 14 2015 1:53 AM | Updated on Sep 2 2017 9:16 PM

‘ప్రేమ’ కానుక

‘ప్రేమ’ కానుక

ప్రేమికుల దినోత్సవం.... ప్రేమికులకు పండుగ రోజే. ఈ రోజును వ్యతిరేకించే వాళ్లు ఉన్నా, వారితో తమకేంటి...

ప్రేమికుల దినోత్సవం.... ప్రేమికులకు పండుగ రోజే. ఈ రోజును వ్యతిరేకించే వాళ్లు ఉన్నా, వారితో తమకేంటి... ప్రేమకు అడ్డెవ్వరు ... అని ముందుకు సాగే ప్రేమ జంటలు అధికమే.  తమ ప్రేమను వ్యక్తం చేసే వాళ్లు కొందరు అయితే, ఆనందోత్సాహాలతో ప్రేమికుల దినోత్సవాన్ని గడిపే ప్రేమికులు మరి కొందరు. ఈ రోజున ప్రేయసికి ప్రియుడు, ప్రియుడికి ప్రేయసి కానుకలు ఇచ్చుకోవడం సహజం. టెక్నాలజీ విస్తరించినా, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ రూపంలో మొబైల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నా, ప్రేమికుల రోజున కానుకలు ఇవ్వడం, పుచ్చుకోవడంలో ఉన్న కిక్కే వేరు. ఈ ప్రేమికుల్ని దృష్టిలో ఉంచుకున్న నగరంలోని పలు దుకాణాలు ప్రేమ కానుకల్ని కొలువు దీర్చాయి.

ప్రేమించుకుంటున్న వాళ్ల కోసం, ప్రేమను వ్యక్తంచేసే వాళ్ల కోసం వివిధ రకాల సంభాషణలతో కూడిన ప్రత్యేక డిజైనింగ్ కార్డులు, చాక్లెట్లు, ప్రేమను చాటే వివిధ రకాల ఆకర్షణీయమైన గిఫ్టులు, గాజు, పింగాణీతో తయారు చేసిన వస్తువులు, ఇలా... ఎన్నో, మరెన్నో చూడగానే ఆకర్షించే, మనస్సుకు హత్తుకునే కానుకల్ని విక్రయాలకు కొలువు దీర్చాయి. ప్రేమ పండుగకు మరో రోజు మాత్రమే సమయం ఉండడంతో తమకు నచ్చినవాళ్లకు కానుకల్ని సమర్పించేందుకు యువతీ, యువకులే కాదు, ఒకప్పటి ప్రేమికులు, నేటి సంసార సాగరంలో ఆనందకర జీవితాలను అనుభవిస్తున్న దంపతులు సిద్ధమవుతున్నారు.                - బెంగళూరు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement