
విజయ్ మాల్యా రాకపోతే పాస్‌పోర్టు రద్దు
హవాలా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ముందు మార్చి 18వ తేదీలోగా విచారణకు హాజరుకాకపోతే లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్‌పోర్టును రద్దుకు చర్యలు తీసుకుంటామని ఈడీ వర్గాలు మంగళవారం నాడిక్కడ వెల్లడించాయి.
న్యూఢిల్లీ: హవాలా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ముందు మార్చి 18వ తేదీలోగా విచారణకు హాజరుకాకపోతే లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్‌పోర్టును రద్దుకు చర్యలు తీసుకుంటామని ఈడీ వర్గాలు మంగళవారం నాడిక్కడ వెల్లడించాయి. ఈ విషయంలో ఇప్పటికే కసరత్తు జరిగిపోయిందని, ఆయన విచారణకు రాకపోయినట్లయితే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపాయి.
భారత బ్యాంకులకు 9,000 వేల కోట్ల రూపాయలను ఎగవేసిన కేసులో విజయ్ మాల్యా సిబీఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేయడం, కేసు విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది. ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోతే ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాల్సిందిగా కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈడీ మాత్రం ఏకంగా మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయడానికే చర్యలు తీసుకుంటోంది. పాస్‌పోర్టు రద్దు చేసినట్లయితే మాల్యాను లండన్ నుంచి భారత్‌కు రప్పించడం సులభం. ఈ 9,000 వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని అక్రమంగా విదేశాలను తరలించారన్న ఆరోపణలపై మాల్యాపై ఈడి హవాలా కేసు దాఖలు చేసి విచారిస్తోంది.