రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య | constable shoots self dead at police station, mumbai | Sakshi
Sakshi News home page

రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

Dec 20 2015 8:10 PM | Updated on Mar 19 2019 5:52 PM

రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య - Sakshi

రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇంటికి ఫోన్‌చేసి ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఘటన నాగపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

సాక్షి, ముంబై: ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇంటికి ఫోన్‌చేసి ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఘటన నాగపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. నాగపూర్ నగరంలోని సావనేర్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రవీంద్ర ఠాకూర్ (45)కు రెండు నెలల క్రితం గుండెపోటు రావడంతో స్టేషనరీ డిపార్టుమెంట్‌కు బదిలీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం విధులకు వచ్చిన రవీంద్ర అక్కడ చార్జ్ తీసుకున్నారు.

సహచరుని నుంచి రివాల్వర్, బుల్లెట్లు తీసుకొని, కొద్ది సమయం తర్వాత ఇంటికి ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాని మాట్లాడుతూనే తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్ధం విన్న సహచర పోలీసులు పరుగున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఠాకూర్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాని అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సమస్యల వల్ల రవీంద్ర ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement