ముంబై వరదల్లో కుక్కను కాపాడిన పోలీసు

Police Officer Saves Dog From Floods In Mumbai - Sakshi

ముంబై: ముంబై నగరం గత కొన్నిరోజులుగా వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ముంబైని వరదలు ముంచెత్తడంతో ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే ఈ వరదల్లో చిక్కుకున్న ఓ కుక్కకు మాత్రం భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి. వరదలో కొట్టుకుపోతున్న ఈ కుక్కను కానిస్టేబుల్‌ రక్షించడంతో అది చావు నుంచి తప్పించుకుంది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ కుక్కను ప్రకాష్‌ పవార్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ రక్షించాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆ కుక్కను రక్షిస్తుండగా తీసిన వీడియోను ముంబై పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘మనిషికి కుక్క ఓ మంచి ఫ్రెండ్‌.. అయితే అలాంటి ఓ కుక్కకు కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ పవర్‌ రూపంలోమంచి స్నేహితుడు దొరికాడు’ అంటూ ట్వీట్‌ చేశారు. నెటిజన్లు ఆ కానిస్టేబుల్‌ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top