సమయం వచ్చినపుడు చేసుకుంటా | Anushka Shetty Not Getting Married, Says Manager | Sakshi
Sakshi News home page

సమయం వచ్చినపుడు చేసుకుంటా

May 12 2015 2:54 AM | Updated on Apr 6 2019 9:01 PM

సమయం వచ్చినపుడు చేసుకుంటా - Sakshi

సమయం వచ్చినపుడు చేసుకుంటా

పెళ్లి అనేది అనుకోగానే జరిగిపోయేది కాదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా అని అంటున్నారు నటి అనుష్క.

 పెళ్లి అనేది అనుకోగానే జరిగిపోయేది కాదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా అని అంటున్నారు నటి అనుష్క. నటిగా ఈ యోగా సుందరి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నారు. తొలి చిత్రం సూపర్(తెలుగు) 2005 జూలై 14న విడుదలైంది. ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరుగా అనుష్క నటించారు. ఆ చిత్రం, ఆ తర్వాత తమిళంలో నటించిన రెండు సినిమాలు ఆమెకు ఆశించిన విజయాన్ని అందించలేదు. అలా అపజయాల నుంచి విజయాల వైపు దూ సుకుపోయిన అనుష్క ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ల లో ఒకరుగా వెలుగొందుతున్నారు.
 
  చారిత్రాత్మక చిత్రం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనుష్క. ఆమెకు ఆ ఇమేజ్‌ను ఆపాదించిన చిత్రం అరుంధతి. ప్రస్తుతం ఈమె నటించిన రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల కోసం అనుష్క అహర్నిశలు శ్రమించారు. ఈ అమ్మడు పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ఇటీవల సోషల్ నెట్‌వర్క్‌లో హల్ చల్ చేశాయి.
 
  బాత్రూం సన్నివేశాలు కూడా వెబ్‌సైట్లలో ప్రసారమై కలకలం సృష్టించాయి. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ‘ఆ విషయం గురించి ప్రస్తుతానికి ఆలోచించలేదు. కారణం పలు చిత్రాలతో బిజీగా ఉన్నా. వివాహ గడియలు వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా’ అన్నారు. అది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చే పెళ్లా? అన్న ప్రశ్నకు రెండింటిలో ఏదైనా తనకు సమ్మతమేనని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆమె జీరో సైజు అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement