భారత-స్పెయిన్ల మ్యాచ్ డ్రా | Six-Nation Tournament: India Draw 1-1 With Spain in Final League Game | Sakshi
Sakshi News home page

భారత-స్పెయిన్ల మ్యాచ్ డ్రా

Jul 3 2016 7:24 PM | Updated on Sep 4 2017 4:03 AM

ఆరుదేశాల ఇన్విటిషనల్ హాకీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం స్పెయిన్తో జరిగి లీగ్ మ్యాచ్ను భారత జట్టు డ్రా చేసుకుంది.

వాల్సెనియా: ఆరుదేశాల ఇన్విటిషనల్ హాకీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం  స్పెయిన్తో జరిగి లీగ్ మ్యాచ్ను భారత జట్టు డ్రా చేసుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా ఇరు జట్లు చివరి వరకూ పోరాడిన 1-1తో ముగించాయి. మ్యాచ్ ఆరంభంలో పెనాల్టీ కార్నర్ను గోల్ గా మలచడంలో భారత్ విఫలమైంది.

 

ఆ తరువాత కాసేపటికి స్పెయిన్ ఆటగాడు పా ఖుమేదా తొలి గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. అయితే ఆట 18వ నిమిషంలో  భారత ఆటగాడు రఘునాథ్ గోల్ చేయడంతో స్కోరు సమం అయ్యింది.  దీంతో తొలి అర్థ భాగం ఇరు జట్లు తలో ఒక పాయింట్తో మాత్రమే సరిపెట్టుకున్నాయి.  ఇక రెండో అర్థభాగంలో అత్యంత నియంత్రణతో ఆడిన భారత్..  స్పెయిన్ ఎటాక్ను అడ్డుకుంది. ఆట చివరి క్వార్టర్లో భారత్-స్పెయిన్ జట్లు గెలుపు కోసం తీవ్రంగా యత్నించినా గోల్ ను సాధించడంలో మాత్రంలో విఫలం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement