శివలాల్‌కు పితృవియోగం | Shivlal Yadav bereaved | Sakshi
Sakshi News home page

శివలాల్‌కు పితృవియోగం

Apr 23 2014 12:54 AM | Updated on Sep 2 2017 6:23 AM

శివలాల్‌కు పితృవియోగం

శివలాల్‌కు పితృవియోగం

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఎస్‌జీ నందలాల్ (89) మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి స్వగృహంలో కన్నుమూశారు.

మారేడ్‌పల్లి,న్యూస్‌లైన్: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఎస్‌జీ నందలాల్ (89) మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య రామ్‌బాయి, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శివలాల్ పెద్ద కుమారుడు కాగా, రాజేశ్ యాదవ్, వీరేందర్ యాదవ్‌లు ఆ తర్వాతి వారు.
 
 ముగ్గురు కుమార్తెలలో ఇంద్రాణి పటేల్ ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకోగా, సుజాత యాదవ్, విద్యాయాదవ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రెజ్లింగ్ క్రీడలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న నందలాల్, దాదాపు 50 ఏళ్ల పాటు మిలిటరీ డైరీ ఫామ్‌కు పాల కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మెట్టుగూడలోని యాదవ సమాజ శ్మశాన వాటికలో జరిగాయి. శివలాల్ తండ్రి మృతి పట్ల బీసీసీఐ ప్రముఖులు, హెచ్‌సీఏ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement