హర్యానా తరఫున సెహ్వాగ్ | Sehwag joins Haryana Ranji team | Sakshi
Sakshi News home page

హర్యానా తరఫున సెహ్వాగ్

Aug 23 2015 1:24 AM | Updated on Sep 3 2017 7:56 AM

హర్యానా తరఫున సెహ్వాగ్

హర్యానా తరఫున సెహ్వాగ్

సుదీర్ఘకాలంగా ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లాడిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇక నుంచి హర్యానాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 1997-98 నుంచి

 ఫరీదాబాద్: సుదీర్ఘకాలంగా ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లాడిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇక నుంచి హర్యానాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 1997-98 నుంచి 18 సీజన్ల పాటు ఢిల్లీకి ఆడిన తను గతంలోనే ఆ జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇటీవలే ఢిల్లీ నుంచి ఎన్‌వోసీ తీసుకున్న ఈ సీనియర్ ఆటగాడు హర్యానా తరఫున బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. ‘ఎక్కువగా యువ ఆటగాళ్లతో ఉన్న హర్యానా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను. వారితో నా అనుభవాలను పంచుకుంటాను’ అని 36 ఏళ్ల సెహ్వాగ్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement