హర్యానా తరఫున సెహ్వాగ్
ఫరీదాబాద్: సుదీర్ఘకాలంగా ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లాడిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇక నుంచి హర్యానాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 1997-98 నుంచి 18 సీజన్ల పాటు ఢిల్లీకి ఆడిన తను గతంలోనే ఆ జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇటీవలే ఢిల్లీ నుంచి ఎన్వోసీ తీసుకున్న ఈ సీనియర్ ఆటగాడు హర్యానా తరఫున బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. ‘ఎక్కువగా యువ ఆటగాళ్లతో ఉన్న హర్యానా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను. వారితో నా అనుభవాలను పంచుకుంటాను’ అని 36 ఏళ్ల సెహ్వాగ్ అన్నాడు.