కరోనా: ధోనిపై ట్రోలింగ్‌.. మండిపడ్డ భార్య!

Sakshi Dhoni Slams At False News Over Donation Corona Virus Lockdown

మీడియా సంస్థలపై ధోని భార్య ఆగ్రహం

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సంక్షోభంపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు పలువురు వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ అసోం ప్రభుత్వానికి తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన వంతు సహాయంగా ఓ ఎన్జీవో ద్వారా లక్ష రూపాయలు సహాయ నిధికి అందించినట్లు వార్తలు వెలువడ్డాయి.(834కు చేరిన కేసులు.. 19 మంది మృతి)

ఈ క్రమంలో ధోని తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సంపన్నుడైన క్రికెటర్‌.. ఇంత పెద్ద మొత్తం దానం చేయడం గొప్ప విషయం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా సంక్షోభంలో డొనేషన్‌ జోక్‌గా మారిపోయిందంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ధోని భార్య సాక్షి ధోని తీవ్రంగా స్పందించారు. ఈ వార్తను ప్రచురించిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు..‘‘సున్నితమైన సమయాల్లో ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా! సిగ్గు పడండి! జర్నలిజం విలువలు మాయమైపోయాయా అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది’’అని సాక్షి ట్వీట్‌ చేశారు.(కరోనాపై పోరాటంలో గెలుస్తాం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top