చెలరేగిన రోహిత్ భరద్వాజ్ | Rohit Bhardwaj (107) erupted Oxford Blues 182 runs victory against the National CCD. | Sakshi
Sakshi News home page

చెలరేగిన రోహిత్ భరద్వాజ్

Aug 31 2013 12:29 AM | Updated on Sep 1 2017 10:17 PM

రోహిత్ భరద్వాజ్ (107) చెలరేగడంతో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ 182 పరుగుల తేడాతో నేషనల్ సీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 382 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన నేషనల్ జట్టు 200 పరుగుల వద్ద ఆలౌటైంది.

జింఖానా, న్యూస్‌లైన్: రోహిత్ భరద్వాజ్ (107) చెలరేగడంతో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ 182 పరుగుల తేడాతో నేషనల్ సీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు 382 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన నేషనల్ జట్టు 200 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ బౌలర్లు భరన్, సాయితేజ, భరత్, వికాస్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
 
 మరో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లూస్ బౌలర్ పుష్కర్ (6/66) విజృంభించినప్పటికీ జట్టుకు విజయం దక్కలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ బ్లూస్ జట్టు 219 పరుగులు చేసింది. అభిషేక్ (74), యుధిష్ (80) రాణించారు.  తర్వాత బరిలోకి దిగిన వీనస్ సైబర్ టెక్ జట్టు 222 పరుగులు చేసి నెగ్గింది. వంశీ రెడ్డి (84), కార్తీక్ (50) చక్కని ప్రదర్శన కనబరిచారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
జిందా సీసీ: 243, చార్మినార్: 247/5 (మిర్ ఒబేద్ అలీ 46, ముజీబ్ 35 నాటౌట్, ప్రసాద్ 128 నాటౌట్; అవినాష్ 3/75).  న్యూ బ్లూస్: 231, కేంబ్రిడ్జి ఎలెవన్: 235/9 (సయ్యద్ అలీ 30; ప్రకాశ్ 4/89)  పాషా బీడీ: 201/8 (రహీమ్ 56, ఫిజాన్ 49; ప్రీతమ్ 5/40), రాజు సీసీ: 19/0; మ్యాచ్ డ్రా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement