అభిమానులకు రైనా, జడేజా వీడియో మెసేజ్‌ | Ravindra Jadeja, Suresh Raina Post Messages For CSK Fans | Sakshi
Sakshi News home page

Jan 5 2018 9:18 AM | Updated on Jan 5 2018 9:29 AM

Ravindra Jadeja, Suresh Raina Post Messages For CSK Fans - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు దిగ్గజ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్‌ ధోని,  సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాలను అట్టిపెట్టుకొని అభిమానులకు తియ్యటి వార్త అందించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన అనంతరం  రైనా, జడేజా, ధోనిలు కాంట్రాక్ట్‌ ఒప్పందాలు సంతకం చేస్తున్న వీడియోలను సీఎస్‌కే అభిమానులతో పంచుకుంది.

అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా స్టార్‌ క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వణక్కమ్‌ చెన్నై అంటూ రైనా, విజిల్‌ పొడు అని జడేజా అభిమానులకు తమ సందేశాన్నిచ్చారు. ఇక ధోని ఒప్పంద పత్రాలపై సంతక చేస్తున్న సమయంలో అతని కూతురు జీవా పక్కనే ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. 

‘వణక్కమ్‌ చెన్నై! సీఎస్‌కే పునరాగమనం సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా కోల్పోయిన ఆటను మీ ముందు ఆడటానికి ఉవ్విళ్లూరుతున్నాను. చెపాక్‌ స్టేడియంలో మిమ్మల్ని కలవడానికి ఉత్సాహంగా ఉన్నాను. - సురేశ్‌ రైనా

‘హాయ్‌ గాయ్స్‌! నేను సీఎస్‌కేలో మళ్లీ భాగమైనందుకు చాలా ఉత్సహంగా, సంతోషంగా ఉన్నాను. మా ఆటను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మేం చాలా మ్యాచ్‌లు గెలవడానికి ప్రయత్నిస్తాం. విజిల్‌ పొడు’- రవీంద్ర జడేజా

ధోని నాయకత్వంలో సీఎస్‌కే రెండు సార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేగాకుండా 2010 చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ సైతం నెగ్గింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అక్షర్‌ పటేల్‌ను ఒక్కరినే అట్టిపెట్టుకోంది. ఈ యువ క్రికెటర్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement