భాతత్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భాగంగా నాల్గో రోజు ఆటకు వరణుడు అంతరాయం కలిగించాడు.
ఫతుల్లా: భాతత్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భాగంగా నాల్గో రోజు ఆటకు వరణుడు అంతరాయం కలిగించాడు. తొలి సెషన్ ముగిసే సరికి బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్లకు 111 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లకు 351 పరుగులు వెనుకంజలో ఉంది. తర్వాత రెండు, మూడు సెషన్లను వరణుడు అడ్డుకున్నాడు.
భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. ఇమ్రుల్ కేయ్స్ (59), షకిబుల్ హసన్ (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.