క్వార్టర్‌ ఫైనల్లో హరీందర్‌ పాల్‌ సంధూ | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో హరీందర్‌ పాల్‌ సంధూ

Published Wed, Nov 8 2017 1:13 AM

 quarterfinals Harinder Pandu Sandhu - Sakshi

ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియా స్క్వాష్‌ సర్క్యూట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో జాతీయ మాజీ చాంపియన్‌ హరీందర్‌ పాల్‌ సింగ్‌ సంధూ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హరీందర్‌ పాల్‌ 4–11, 11–6, 11–2, 11–3తో ఏడో సీడ్‌ ఇవాన్‌ యువెన్‌ (మలేసియా)పై సంచలన విజయం సాధించాడు.

మరో మ్యాచ్‌లో ‘వైల్డ్‌ కార్డు’తో మెయిన్‌ ‘డ్రా’లో ఆడుతున్న రమిత్‌ టాండన్‌ (భారత్‌) 11–7, 4–11, 11–4, 11–3తో ఎనిమిదో సీడ్‌ అబ్దుల్లా తమిమీ (ఖతర్‌)ను బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ సంపాదించాడు.   

Advertisement
 
Advertisement
 
Advertisement