దక్షిణాఫ్రికా గెలిచేనా?

Precariously placed South Africa face uphill West Indies challenge - Sakshi

నేడు వెస్టిండీస్‌తో మ్యాచ్‌

మధ్యాహ్నం గం.3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

సౌతాంప్టన్‌: వరుసగా మూడు పరాజయాలతో ప్రపంచ కప్‌లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు మరో కఠిన పరీక్ష. ఆ జట్టు సోమవారం సౌతాంప్టన్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఒకదాంట్లో గెలిచి, మరోటి ఓడిన కరీబియన్లకిది మూడో మ్యాచ్‌. మామూలుగా చూస్తే మొత్తం వన్డే గెలుపోటముల గణాంకాల్లో వెస్టిండీస్‌పై సఫారీలది తిరుగులేని ఆధిపత్యం. గత మూడు కప్‌లలోనూ వారిపై విజయం సాధించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సి ఉండగా, కరీబియన్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇరు జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో తలపడితే... నాలుగింటిలో సఫారీలు, రెండింటిలో కరీబియన్లు నెగ్గారు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top