వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు.
మెల్‌బోర్న్: వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. పేస్ ద్వయం జేమ్స్ ఫాల్క్‌నర్, నాథన్ కౌల్టర్ నైల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరో పేసర్ మిషెల్ స్టార్క్ గాయం కారణంగా దూరమయ్యాడు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
రెండు జట్లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఇండోర్, కోల్‌కతాలో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక హైదరాబాద్, రాంచీ, గువాహటిలో మూడు టి20లు నిర్వహిస్తారు.