కోహ్లికి ఫిదా అయిన పాక్‌ స్టార్‌ పేసర్‌.. | Mohammad Amir Praises Virat Kohli Regarding Winning Award | Sakshi
Sakshi News home page

కోహ్లికి ఫిదా అయిన పాక్‌ స్టార్‌ పేసర్‌..

Jan 16 2020 9:18 AM | Updated on Jan 16 2020 1:04 PM

Mohammad Amir Praises Virat Kohli Regarding Winning Award - Sakshi

ముంబై: ఐసీసీ వన్డేల్లో  స్పిరిట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికైన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై పాకిస్తాన్‌ స్టార్ పేసర్ మొహమ్మద్‌ ఆమీర్ ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే విరాట్‌ కోహ్లి అత్యుత్తమ ఆటగాడని.. ఏ బౌలర్‌కైనా కోహ్లి వికెట్‌ లభిస్తే గొప్ప బహుమతిగా భావిస్తారని ఆమీర్‌ అన్నాడు. ఈ ట్వీట్‌పై ఆమీర్‌, కోహ్లి అభిమానులు స్పందించారు. అభిమానులు స్పందిస్తూ..ఇద్దరు అత్యన్నత నైపుణ్యాలున్న క్రికెటర్లంటూ తమ క్రికెటర్ల పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమీర్‌ అత్యుత్తుమ బౌలరంటూ గతంలో కోహ్లి కితాబిచ్చిన విషయం తెలిసిందే.  2019సంవత్సరానికి గాను ఐసీసీ బుధవారం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ట్విటర్‌లో ఆమీర్‌ పోస్ట్‌ చేశారు. 

2019 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లి, ఆమీర్‌ చివరిసారిగా తలపడ్డారు. పా​కిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ 89పరుగులతో విజయం సాధించింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించి.. వీరోచిత ఫామ్‌లో ఉన్న కోహ్లికి ఐసీసీ స్పిరిట్‌ క్రికెటర్‌ అవార్డును ప్రకటించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement