భారత క్రికెట్ జట్టుకు భయమా? | Misbah-ul-Haq, Shahid Afridi Say India Not Scared of Playing Pakistan | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్ జట్టుకు భయమా?

Mar 31 2017 3:44 PM | Updated on Sep 5 2017 7:35 AM

భారత క్రికెట్ జట్టుకు భయమా?

భారత క్రికెట్ జట్టుకు భయమా?

భారత్ జట్టు భయపడుతుందంటూ పాకిస్తాన్ క్రికెట్ పరిమిత ఓవర్ల కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ వెటరన్ క్రికెటర్లు మిస్బావుల్ హక్, షాహిద్ ఆఫ్రిదిలు విభేదించారు.

కరాచీ:తమతో క్రికెట్ ఆడటానికి భారత్ జట్టు భయపడుతుందంటూ పాకిస్తాన్ క్రికెట్  పరిమిత ఓవర్ల కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ వెటరన్ క్రికెటర్లు మిస్బావుల్ హక్, షాహిద్ ఆఫ్రిదిలు విభేదించారు. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటానికి భారత్ జంకుతుందని సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఇది సర్ఫరాజ్ వ్యక్తిగత అభిప్రాయంగా వారు పేర్కొన్నారు.

'మనతో క్రికెట్ ఆడటానికి భారత్ కు ఎందుకు భయపడుతుంది. మనతో మ్యాచ్లకు వారు సిద్ధం కాలేదనడం, భయపడుతున్నారని అనడం ఎంతమాత్రం వాస్తవం కాదు. అది సర్ఫరాజ్ వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇరు జట్ల మధ్య  ద్వైపాక్షిక సిరీస్ ఎందుకు జరగడం లేదో అందరికీ తెలుసు. అందుకు భారత్ ప్రభుత్వమే కారణం. అక్కడి రాజకీయాలే మనతో భారత్ క్రికెట్ జట్టు మ్యాచ్ లు ఆడకపోవడానికి ప్రధాన కారణం. అంతే కానీ పాక్ తో క్రికెట్ ఆడటానికి భారత జట్టు బెదురుతుందనేది సరైన వాదన కాదు'అని మిస్బావుల్ హక్, ఆఫ్రిదిలు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement