గాయాన్ని లెక్కచేయక.. నెట్స్లో బౌలింగ్! | Medium pacer Bhuvneshwar bowls in the nets | Sakshi
Sakshi News home page

గాయాన్ని లెక్కచేయక.. నెట్స్లో బౌలింగ్!

Feb 13 2015 6:19 PM | Updated on Sep 2 2017 9:16 PM

గాయాన్ని లెక్కచేయక.. నెట్స్లో బౌలింగ్!

గాయాన్ని లెక్కచేయక.. నెట్స్లో బౌలింగ్!

ఒకవైపు గాయం బాధపెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా భారత మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ శుక్రవారం నాడు టీమిండియా ప్రాక్టీసు సెషన్లో నెట్స్లో బౌలింగ్ చేశాడు.

ఒకవైపు గాయం బాధపెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా భారత మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ శుక్రవారం నాడు టీమిండియా ప్రాక్టీసు సెషన్లో నెట్స్లో బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మూడు టెస్టుల్లో గాయం కారణంగా భువీ బౌలింగ్ చేయలేకపోయాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన ముక్కోణపు సిరీస్లో కూడా కేవలం రెండు వన్డేలలోనే పాల్గొన్నాడు. ఇక అఫ్ఘానిస్థాన్తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేశాడు.

అయితే.. ఇంతకుముందు కంటే భువీ రనప్ దూరం కాస్త తగ్గింది. అలాగే.. మోచేతిని కూడా పూర్తిగా వంచలేకపోతున్నాడు. అయినా కూడా భువీ బౌలింగులో కచ్చితత్వం మాత్రం అలాగే ఉందని అంటున్నారు. సింగిల్ వికెట్ను నేరుగా బంతితో పడగొట్టడం లాంటి ఫీట్లు చూపించాడు. ఏడడుగుల ఎత్తున్న పాకిస్థానీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ బౌలింగును ఎదుర్కోడానికి స్టూల్ బౌలింగును కూడా టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీసు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement