విరాట్‌-అనుష్కల పెళ్లి చెల్లదట! | Marriage Not Valid… Do Virat and Anushka need to remarry? | Sakshi
Sakshi News home page

విరాట్‌-అనుష్కల పెళ్లి చెల్లదట!

Jan 14 2018 8:34 PM | Updated on Jan 14 2018 8:36 PM

Marriage Not Valid… Do Virat and Anushka need to remarry? - Sakshi

న్యూఢిల్లీ:  గత నెలలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.  అటు తర‍్వాత ఆ జంట భారత్‌కు తిరిగొచ్చి రెండు వేర్వేరు రిసెప్షన్లు ఏర్పాటు చేసి విందు కూడా ఇచ్చారు. అయితే విరాట్‌-అనుష్కల పెళ్లికి ఒక చిక్కొచ్చి పడిందట. అది ఇటలీలో చేసుకున్న పెళ్లి కాబట్టి ఇక్కడ చెల్లదంటూ ప్రచారం జరుగుతుంది.

దాంతో కోహ్లి-అనుష్కలు పెళ్లి చేసుకుని నెల రోజులైనా కాకముందే మళ్లీ వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి.  దీంతో ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా మ్యారేజ్ సర్టిఫికెట్‌కు అప్లై చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా, అనుష్క శర్మ అతని వెంటే వెళ్లింది.  ఈ ప్రచారంపై విరాట్‌-అనుష్క శర్మలు ముగింపు ఎలా ఇస్తారో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement