మదన్ లాల్ ఓటమి | Madan Lal loss | Sakshi
Sakshi News home page

మదన్ లాల్ ఓటమి

Oct 8 2015 2:05 AM | Updated on Sep 3 2017 10:35 AM

ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రోజు బరిలో దిగిన నలుగురు బాక్సర్లలో ఇద్దరు ముందంజ వేయగా

దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రోజు బరిలో దిగిన నలుగురు బాక్సర్లలో ఇద్దరు ముందంజ వేయగా... మరో ఇద్దరు ఇంటిదారి పట్టారు. రెండో రోజున పోటీ పడిన ఏకైక భారత బాక్సర్ మదన్ లాల్‌కు చుక్కెదురైంది. 52 కేజీల విభాగం తొలి రౌండ్‌లో మదన్ లాల్ 0-3తో విన్‌సెంజో పికార్డి (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు.  మదన్ లాల్ ఓటమితో ప్రస్తుతం బరిలో భారత్ నుంచి ముగ్గురు బాక్సర్లు (శివ థాపా, వికాస్ కృషన్, సతీశ్ కుమార్) మాత్రమే ఉన్నారు.
 

Advertisement

పోల్

Advertisement